అన్వేషించండి

Supreme Court On Sand : ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలు - సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు ఇవే

Andhra News : ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది.

Supreme Court on AP sand irregularities :  ఆంధ్రప్రదేశ్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ అక్రమ ఇసుక తవ్వకాలు ఉండకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.  సుప్రీం ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా అక్రమ ఇసుక తవ్వకాలు సాగటంపై మండిపడింది.   అక్రమ ఇసుక తవ్వకాలను నిలిపివేయడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వానికి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. కమిటీలో కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులను కూడా నియమించాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. 

నాలుగు రోజుల్లో ఇసుక రీచ్‌లలో తవ్వకాల నిలిపివేతకు చర్యలు               

నాలుగు రోజుల్లోపు అక్రమ ఇసుక రీచ్‌లను సందర్శించి వాటిని నిలిపివేయడానికి తగిన చర్యలను తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రతి జిల్లాలో ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక సెల్ లను కూడా ఏర్పాటు చేయాలని సుప్రీం ఆదేశించింది.  ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్లు, ఈ మెయిల్ ఐడీలను కూడా ఏర్పాటు చేయాలని..వాటికి పబ్లిసిటీ ఇవ్వాలన్నారు.  తమ ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే కోర్టు థిక్కార చర్యలను తీసుకుంటామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.  కమిటీలోని అధికారులు సుప్రీంకోర్టు నియమించిన అధికారులుగా గుర్తుంచుకోవాలని..  ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.  

సుప్రీంకోర్టు ఆదేశాల ఉల్లంఘన                             

ఏపీలో యథేచ్చగా అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని కేంద్ర పర్యావరణ, అటవీశాఖ ధృవీకరించింది. ఆ మేరకు మధ్యంతర నివేదికను సమర్పించింది. 10 వేల కోట్ల రూపాయల మేరకు అక్రమ ఇసుక రవాణా జరిగిందని ప్రతివాది తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా.. సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.  ఏపీ ప్రభుత్వం కొనసాగిస్తున్న అక్రమ ఇసుక తవ్వకాలను ఫోటోలు, ఆధారాల సహా ప్రతివాది దండా నాగేంద్ర కుమార్ నేడు సుప్రీం ముందు ఉంచారు.   అక్రమ ఇసుక తవ్వకాలను తక్షణం నిలిపివేయడానికి వెంటనే అధికారుల బృందాలను క్షేత్ర స్థాయికి పంపాలని గత వారం సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర పర్యావరణ, అటవీశాఖ అధికారులు కూడా క్షేత్ర స్థాయికి వెళ్లి అక్రమ ఇసుక తవ్వకాలు ఆపేశారా.. లేదా? అన్నది తనిఖీ చేయాలని కూడా సుప్రీం ఆదేశించింది. 

ప్రభుత్వ అఫిడవిట్ ను తిరస్కరించిన సుప్రీంకోర్టు          

ఇసుక అక్రమాలపై వచ్చిన ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటామని ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌ను సుప్రీం ధర్మాసనం తిరస్కరించింది. ఏపీ ప్రభుత్వం చర్యలన్నీ కాగితాలకే పరిమితమని తమకు తెలుసని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. నేడు సుప్రీంకోర్టు అక్రమ ఇసుక తవ్వకాల నిలిపివేతపై తీసుకున్న చర్యలను అఫిడవిట్ రూపంలో సమర్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలు ఇంకా కొనసాగుతున్నాయంటూ కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ కూడా సుప్రీంకోర్టుకు  చెప్పినట్లుగా తెలుస్తోంది. ఏపీలో ఇసుక వ్యవహారం ప్రతీ సారి సంచలనంగా మారుతోంది.                      

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP No friends: మిత్రులే లేని వైసీపీ - బీఆర్ఎస్ కూడా హ్యాండ్ - జగన్ రాజకీయం ఇంత తేడానా?
మిత్రులే లేని వైసీపీ - బీఆర్ఎస్ కూడా హ్యాండ్ - జగన్ రాజకీయం ఇంత తేడానా?
Palasa- Ichchapuram: ఉద్దానం ప్రాంత ప్రజలకు గుడ్ న్యూస్‌! దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లో పలాస- ఇచ్చాపురం సెక్షన్‌ విలీనం!
ఉద్దానం ప్రాంత ప్రజలకు గుడ్ న్యూస్‌! దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లో పలాస- ఇచ్చాపురం సెక్షన్‌ విలీనం!
YSRCP Political Plan: ఓ వైపు అమరావతి - మరో వైపు మత మార్పిళ్లు- వైఎస్ఆర్‌సీపీ స్వయం శిక్షలు దేని కోసం!?
ఓ వైపు అమరావతి - మరో వైపు మత మార్పిళ్లు- వైఎస్ఆర్‌సీపీ స్వయం శిక్షలు దేని కోసం!?
Railwaykoduru Crime News: ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై లైంగిక ఆరోపణలు చేసిన మహిళపై దాడి! జనసేన లీడర్లపై బాధితురాలి ఫిర్యాదు!
ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై లైంగిక ఆరోపణలు చేసిన మహిళపై దాడి! జనసేన లీడర్లపై బాధితురాలి ఫిర్యాదు!

వీడియోలు

Arjun Tendulkar Comments on Mumbai Indians | ముంబై ఇండియన్స్ పై అర్జున్ టెండూల్కర్ కామెంట్స్ | ABP Desam
Jadeja Breaks Silence on MS Dhoni | ధోనీపై జడేజా సంచలన వ్యాఖ్యలు | ABP Desam
IPL 2026 DC VS LSG Highlights | ఆల్ రౌండ్ షోతో బోణీ కొట్టిన ఢిల్లీ | ABP Desam
Rishabh Pant LSG vs Delhi Capitals IPL 2026 | లక్నో సూపర్ జెయింట్స్ ఓటమికి కారణం అదేనా | ABP Desam
NASA Artemis 2 Mission Launch | 50 ఏళ్ల తర్వాత మళ్ళీ చంద్రుడిపైకి మానవుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Raghav Chadha: ఆమ్‌ఆద్మీ పార్టీ యాక్షన్‌కు రాఘవ్ చద్దా స్ట్రాంగ్ రియాక్షన్! గొంతు నొక్కుతున్నారా అంటూ క్వశ్చన్స్!
ఆమ్‌ఆద్మీ పార్టీ యాక్షన్‌కు రాఘవ్ చద్దా స్ట్రాంగ్ రియాక్షన్! గొంతు నొక్కుతున్నారా అంటూ క్వశ్చన్స్!
Telangana Rythu Bharosa Scheme Update: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్- ఈ నెలలోనే రైతు భరోసా విడుదల!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్- ఈ నెలలోనే రైతు భరోసా విడుదల!
YSRCP No friends: మిత్రులే లేని వైసీపీ - బీఆర్ఎస్ కూడా హ్యాండ్ - జగన్ రాజకీయం ఇంత తేడానా?
మిత్రులే లేని వైసీపీ - బీఆర్ఎస్ కూడా హ్యాండ్ - జగన్ రాజకీయం ఇంత తేడానా?
Tamil Nadu Elections 2026: విజయ్ డబుల్ రోల్ వ్యూహం - తమిళనాడు రాజకీయాల్లో సాహసమా లేక తప్పిదమా?
విజయ్ డబుల్ రోల్ వ్యూహం - తమిళనాడు రాజకీయాల్లో సాహసమా లేక తప్పిదమా?
Biker Movie Review - 'బైకర్' రివ్యూ: తండ్రీ కుమారుల కథ ఎలా ఉంది? 'నారీ నారీ...' తర్వాత శర్వానంద్ మరో సక్సెస్ కొట్టారా?
'బైకర్' రివ్యూ: తండ్రీ కుమారుల కథ ఎలా ఉంది? 'నారీ నారీ...' తర్వాత శర్వానంద్ మరో సక్సెస్ కొట్టారా?
Kaleshwaram Politics: కాళేశ్వరంపై రేవంత్ వాదననే వినిపిస్తున్నకేంద్రం - బీఆర్ఎస్‌ ఉక్కిరిబిక్కిరి -ఎదురుదాడి ఎలా?
కాళేశ్వరంపై రేవంత్ వాదననే వినిపిస్తున్నకేంద్రం - బీఆర్ఎస్‌ ఉక్కిరిబిక్కిరి -ఎదురుదాడి ఎలా?
Mrithyunjay OTT : ఆ మర్డర్స్ చేసింది ఎవరు? - ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్ మృత్యుంజయ్
ఆ మర్డర్స్ చేసింది ఎవరు? - ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్ మృత్యుంజయ్
Palasa- Ichchapuram: ఉద్దానం ప్రాంత ప్రజలకు గుడ్ న్యూస్‌! దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లో పలాస- ఇచ్చాపురం సెక్షన్‌ విలీనం!
ఉద్దానం ప్రాంత ప్రజలకు గుడ్ న్యూస్‌! దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లో పలాస- ఇచ్చాపురం సెక్షన్‌ విలీనం!
Embed widget