అన్వేషించండి

Bail For AP MLC : ఎమ్మెల్సీ అనంతబాబుకు ఊరట - బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు !

ఎమ్మెల్సీ అనంతబాబుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ షరతులను దిగువ కోర్టు ఖరారుచేయనుంది.

Bail For AP MLC :    మాజీ డ్రైవర్ హత్య కేసులో నిందితడిగా ఉన్న ఏపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు సుప్రీంకోర్టు  బెయిల్ మంజూరు చేసింది. డీఫాల్ట్  బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు అనంతబాబు. గతంలో విచారణకువచ్చిన సమయంలో  ప్రతి వాదులకు నోటీసులు జారీ చేశారు. సోమవారం జరిగిన విచారణలో బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. బెయిల్ షరతులను కింది కోర్టు నిర్ణయించాలని స్పష్టం చేసింది. ఇప్పటికే అనంతబాబు బెయిల్ పిటిషన్ ను రాజమండ్రిలోని ఎస్సీ ఎస్టీ కోర్టు, ఏపీ హైకోర్ట్ కొట్టి వేశాయి. దీంతో బెయిల్ కోసం అనంతబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 

డీఫాల్ట్ బెయిల్‌కు అనంతబాబు అర్హుడని సుప్రీంకోర్టులో అనంతబాబు లాయర్ వాదన 

గత విచారణలో అనంతబాబును అరెస్టు చేసి 90 రోజులు దాటిపోయిందని ఆయన తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.  పోలీసులు దర్యాప్తు పూర్తి చేయడం లేదన్నారు.  ఫోరెన్సిక్ నివేదికలని మరో కారణం చెప్పి చార్జిషీట్ దాఖలు చేయడం లేదన్నారు.  ఆగస్టు 26న ట్రయల్ కోర్టులో జరిగిన విచారణ సందర్భంగా నిందితుడికి మరో 15 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ పొడిగించాలని.. ఈలోగా చార్జిషీట్ దాఖలు చేస్తామని పోలీసులు చెప్పారన్నారు. కానీ ఇప్పటి వరకు చార్జిషీట్ దాఖలు చేయలేకపోయారని అన్నారు. ఈ పరిస్థితుల్లో అనంత బాబు డిఫాల్ట్ బెయిల్ పొందేందుకు అర్హుడని, ఆయనకు బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అనంతబాబు తరపు లాయర్ వాదనలతో సుప్రీంకోర్టు ధర్మాసనం ఏకీభవించింది. 

బెయిల్  కుటుంబానికి రక్షణ ఉండదని సుబ్రహ్మణ్యం కుటుంబం లాయర్ వాదన

అనంతబాబుకు  బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారని హత్య జరిగిన తర్వాత మృతదేహాన్ని బాధిత కుటుంబానికి అప్పగించి, రూ. 2 లక్షలు డబ్బులిచ్చి, ఎక్కడా మాట్లాడొద్దంటూ బెదిరింపులకు పాల్పడ్డారని డ్రైవర్ సుబ్రహ్మణ్యం తరపు లాయర్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.  బెయిలిస్తే కేసులో సాక్షులను, బాధిత కుటుంబాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని వాదనలు వినిపించారు. ఈ పరిస్థితుల్లో అనంతబాబుకు బెయిల్ ఇవ్వొద్దంటూ విజ్ఞప్తి చేశారు. అయితే  తామేమీ అనంత బాబును నిర్దోషిగా ప్రకటించడం లేదని, అయితే 90 రోజుల్లోగా చార్జిషీట్ దాఖలు చేయకపోతే డిఫాల్ట్ బెయిల్‌కు అర్హులవుతారని చెప్పింది.  ఆ వాదనల ప్రకారం ఇప్పుడు డీఫాల్ట్ బెయిల్‌ను సుప్రీంకోర్టు మంజూరు చేసింది. 

మే 19న సుబ్రహ్మణ్యం హత్య - ఎమ్మెల్సీని సస్పెండ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ 

ఎమ్మెల్సీ అనంత బాబు తన డ్రైవ‌ర్‌ సుబ్ర‌హ్మ‌ణ్యంను హత్య చేసి, ఆ త‌ర్వాత మృత‌దేహాన్ని బాధితుడి ఇంటికి డోర్ డెలివరీ చేసిన ఘ‌ట‌న ఏపీలో క‌ల‌క‌లం రేపింది. మే 19వ తేదీన  మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యంను ఆయన ఇంటి నుంచి అనంతబాబు తీసుకెళ్లారు. అదే రోజు ప్రమాదంలో చనిపోయారని మృతదేహాన్ని ఇంటి వద్ద వదిలి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ సుబ్రహ్మణ్యం బంధువులు అడ్డుకున్నారు. అయితే  అందర్నీ బెదిరించి ఆయన అక్కడ్నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన కలకలం రేపడంతో పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఎమ్మెల్సీని అరెస్ట్ చేశారు. తాను ఒక్కడినే సుబ్రహ్మణ్యాన్ని హత్య చేశానని అంగీకరించినట్లుగా పోలీసులు ప్రకటించారు. అయితే ఈ కేసులో ఇంత వరకూ పోలీసులు చార్జిషీట్ దాఖలు చేయలేకపోయారు. ఎమ్మెల్సీ అనంతబాబును వైఎస్ఆర్‌సీపీ నుంచి అప్పుడే సస్పెండ్ చేశారు. 

కేసును సీబీఐకి ఇవ్వాలన్న పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

అనంతబాబు కేసు విషయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.. దర్యాప్తు చేయడం లేదని.. అధికార పార్టీకి చెందిన  వ్యక్తి కావడంతో ఇలా చేస్తున్నారని.. అందుకే కేసును కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఇవ్వాలన్న విజ్ఞాపనతో  ప్రస్తుతం హైకోర్టులో ఓ పిటిషన్ విచారణలో ఉంది. 
 

 

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Naidu Narendra Modi Relation Strategy: మోదీపై చంద్రబాబు అంతులేని పొగడ్తలు - విమర్శలు వచ్చినా తగ్గేదే లే - అసలు కారణం ఇదేనా?
మోదీపై చంద్రబాబు అంతులేని పొగడ్తలు - విమర్శలు వచ్చినా తగ్గేదే లే - అసలు కారణం ఇదేనా?
Amalapuram Latest News: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులు తిరుగుబాటు- పంట విరామం ప్రకటించిన తాడికోన అన్నదాతలు! 
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులు తిరుగుబాటు- పంట విరామం ప్రకటించిన తాడికోన అన్నదాతలు! 
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
YSRCP Leaders Legal Troubles: వైఎస్సార్‌సీపీ నేతల వరుస కేసులు, ఆజ్ఞాతం - పొలిటికల్ స్ట్రాటజీనా? దూకుడు వికటించిందా?
వైఎస్సార్‌సీపీ నేతల వరుస కేసులు, ఆజ్ఞాతం - పొలిటికల్ స్ట్రాటజీనా? దూకుడు వికటించిందా?

వీడియోలు

Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Udhayanidhi Arrest: ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
Udhayanidhi Arrest: ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
Indian Politics Instagram Reels Strategy: ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
High Uric Acid : యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలివే.. సమస్యను తగ్గించుకోవాలంటే ఈ ఫుడ్స్ తింటూ ఈ పనులు చేయాలట
యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలివే.. సమస్యను తగ్గించుకోవాలంటే ఈ ఫుడ్స్ తింటూ ఈ పనులు చేయాలట
బొడ్డు కిందకి చీర కడితే అసభ్యంగా చూడకండి - ఆయుర్వేదం, యోగశాస్త్రంలో ఏముందంటే!
బొడ్డు కిందకి చీర కడితే అసభ్యంగా చూడకండి - ఆయుర్వేదం, యోగశాస్త్రంలో ఏముందంటే!
New Fielding Coach: టీమ్ ఇండియా కొత్త ఫీల్డింగ్ కోచ్ సుభదీప్ ఘోష్.. గంభీర్ వర్క్ మేట్ కు బిసిసిఐ ప్రమోషన్, ఈ మాజీ ప్లేయర్ ట్రాక్ రికార్డ్ తెలుసా!
టీమ్ ఇండియా కొత్త ఫీల్డింగ్ కోచ్ సుభదీప్ ఘోష్.. గంభీర్ వర్క్ మేట్ కు బిసిసిఐ ప్రమోషన్, ఈ మాజీ ప్లేయర్ ట్రాక్ రికార్డ్ తెలుసా!
Amalapuram Latest News: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులు తిరుగుబాటు- పంట విరామం ప్రకటించిన తాడికోన అన్నదాతలు! 
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులు తిరుగుబాటు- పంట విరామం ప్రకటించిన తాడికోన అన్నదాతలు! 
Embed widget