Tirupati Laddu Case : వాయిదా కోరిన సొలిసిటల్ జనరల్ - తిరుపతి లడ్డూ కేసు శుక్రవారానికి వాయిదా !
Supreme Court : తిరుపతి లడ్డూ కేసు విచారణను శుక్రవారం ఉదయానికి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణపై అభిప్రాయం చెప్పేందుకు సొలిసిటర్ జనరల్ మరింత సమయం కోరారు.
Supreme Court adjourned Tirupati Laddu case hearing : తిరుపతి శ్రీవారి లడ్డూ ప్రసాదంలో నెయ్యికల్తీ అంశంపై విచారణను సుప్రీంకోర్టు శుక్రవారం ఉదయం పదిన్నరకు వాయిదా వేసింది. కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణపై కేంద్రం అభిప్రాయం చెప్పేందుకు రేపటి వరకూ సమయం కావాలని సొలిసిటర్ జనరల్ కోరడంతో విచారణ ప్రారంభమైన వెంటనే ధర్మాసనం శుక్రవారం ఉదయం పదిన్నకు కేసును వాయిదా వేస్తూ నిర్ణయం ప్రకటించింది.
ఎవరు దర్యాప్తు చేయాలో శుక్రవారం ఖరారు చేయనున్న సుప్రీంకోర్టు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ పెట్టి లడ్డూ కల్తీ అంశం గురించి ప్రకటించినందున సిట్ విచారణపై సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యక్తం చేసింది. అందుకే కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించే అంశంపై కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరింది. అయితే కేంద్రం ఇంకా ఎలాంటి నిర్ణయం చెప్పకపోవడంతో సొలిసిటర్ జనరల్ తుషార్ మొహతా వాయిదా కోరారు. శుక్రవారం ఉదయం పదిన్నర గంటలకు జరిగే విచారణలో కేంద్రం చెప్పే అభిప్రాయాన్ని బట్టి సుప్రీంకోర్టు లడ్డూ కల్తీ అంశాన్ని ఏ దర్యాప్తు సంస్థ విచారణ చేయాలన్నది ఖరారు చేస్తారు. ఆ తర్వాత ఆయా సంస్థలు విచారణ ప్రారంభించే అవకాశం ఉంది.
తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు నిర్ణయమేంటీ? కేంద్రం ఏం చెబుతుంది?
కేంద్ర ప్రభుత్వం అభిప్రాయమే కీలకం
ఇప్పటికే ఏపీ ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్ అధికారి సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలో ఓ సిట్ ను నియమించింది. వారునాలుగు రోజుల పాటు తిరుమలతో పాటు ఏఆర్ డెయిరీలో కూడా పరిశీలించారు. అనేక వివరాలు తెలుసుకున్నారు. ప్రాధమిక నివేవది సిద్ధం చేసే టప్పటికీ సుప్రీంకోర్టు వ్యతిరేక వ్యాఖ్యలు చేయడంతో దర్యాప్తు నిలిపివేయాలని డీజీపీ నిర్ణయించుకున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారమే తదుపరి విచారణ ఉంటుందని తెలిపారు. ఒక వేళ సిట్ కు అనుమతి ఇస్తే.. విచారణ కొనసాగించే అవకాశం ఉంది. సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలకు అనుమతి ఇస్తే.. ఆయా సంస్థలు కేసును టేకప్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి.
Also Read: తమిళనాడులోనూ పవన్ కల్యాణ్ హాట్ టాపిక్ - దక్షిణాది హిందూత్వ నేతగా మరో అడుగు ముందుకేసినట్లేనా ?
అయితే పిటిషనర్లు మాత్రం.. ఎవరు దర్యాప్తు చేసినా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పర్యవేక్షణ ఉండాలని కోరుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్తలపై నమ్మకం లేదంటున్నారు. అయితే ఇలాంటి కేసులను సుప్రీంకోర్టు తమ పర్యవేక్షణలో దర్యాప్తు చేయిస్తుందా లేదా అన్నదానిపై న్యాయనిపుణుల్లో సందేహాలు ఉన్నాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న వైవీ సుబ్బారెడ్డి కూడా పిటిషన్ దార్లలో ఉండటంతో.. ఆయన కోసం దర్యాప్తు సంస్థల విశ్వసనీయతను ప్రశ్నించబోరని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఏమైనా శుక్రవారం ఉదయం జరిగే విచారణలో కేంద్ర ప్రభత్వం వెల్లడించే అభిప్రాయాన్ని బట్టి ఏ సంస్థ దర్యాప్తు చేయాలన్నది ఖరారు చేసే అవకాశం ఉంది.