అన్వేషించండి

Sajjala : నేరం జరగలేదని చంద్రబాబు నిరూపించుకోగలరా ? - సజ్జల సవాల్!

నేరం జరగలేదని చంద్రబాబు నిరూపించుకోవాలని సజ్జల సవాల్ చేశారు. టీడీపీ నేతలు క్వాష్ పిటిషన్ పై మాట్లాడుతున్నారు కానీ నేరం జరగలేదని ఎక్కడా చెప్పడం లేదన్నారు.


Sajjala : చంద్రబాబు అరెస్ట్‌పై టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లి వైఎస్ఆర్‌సీపీ ఆఫీసులో మీడియాతో మాట్లాడిన ఆయన  జగన్ కక్ష సాధింపుతో చేశారని చెప్పడం కరెక్ట్ కాదన్నారు.  నేరం జరగలేదని మాత్రం వారు ఎక్కడా చెప్పడం లేదని విమర్శించారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో చంద్రబాబును పూర్తి ఆధారాలతో సీఐడీ అరెస్ట్ చేసిందన్నారు. అలాంటప్పుడు కక్ష సాధింపు చర్య ఎక్కడ? అని ప్రశ్నించారు. వందల కోట్లకు పైగా ప్రజాధనాన్ని చంద్రబాబు దుర్వినియోగం చేశారన్నారు. ఊరు, పేరు లేకుండా అగ్రిమెంట్ తయారు చేసుకున్నారన్నారు. సీమెన్స్ కూడా ఈ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తమకు సంబంధం లేదని తెలిపింది. ఫేక్ ఇన్వాయిస్‌తో నిధులను పక్కదారి పట్టించారన్నారు.

ఈ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులు విదేశాలకు పారిపోయారన్నారు. ఈ కుంభకోణంలో పాత్రధారి, లబ్ధిదారు చంద్రబాబే అన్నారు. నేరం జరగలేదని చంద్రబాబు నిరూపించగలరా? అని ప్రశ్నించారు. రూ.300 కోట్లకు పైగా ప్రజాధనాన్ని టీడీపీ అధినేత దుర్వినియోగం చేశారన్నారు. ఊరు, పేరు లేకుండా అగ్రిమెంట్ తయారు చేసుకున్నారన్నారు. స్కిల్ కేసును విచారణ చేయాలని భావించిన సీఐడీ ఆ దిశగా విచారించిందన్నారు. కోర్టు కూడా చంద్రబాబు తప్పు చేశారని భావించి జ్యూడిషియల్ రిమాండ్ విధించిందన్నారు. ఇలాంటి సమయంలో చంద్రబాబు, టీడీపీ నేతలు, చంద్రబాబు లాయర్లు నెల రోజులుగా క్వాష్ మీదనే మాట్లాడుతున్నారన్నారు.                      
 
ఆయనకు తెలిసిన ఏకైక విద్య విచారణకు రాకుండా కప్పేయడమే అన్నారు. ప్రతి కేసులో ఏదో టెక్నికల్ కారణంతో కేసును నిలిపివేస్తున్నారన్నారు. ఎవరు తప్పు చేసినా తప్పించుకునే ప్రయత్నం చేస్తారన్నారు. ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు మాజీ సీఎం అని, పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారని, రెండెకరాల నుంచి రెండు లక్షల కోట్లకు ఎదిగారని, అలాంటి వ్యక్తి ఎందులోనూ దొరకలేదని, కానీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అడ్డంగా దొరికారని వ్యాఖ్యానించారు. కోర్టుకూడా నమ్మే చంద్రబాబును జైలుకు పంపించింది. వాళ్ల లాయర్లు కూడా ఒకే పాయింట్‌ మీద వాదిస్తున్నారని విమర్శించారు.            

లేని ప్రాజెక్టులు ఉన్నట్లు చూపించి ప్రజాధనం దోచేశారు. సాక్షులను చంద్రబాబు దేశాలను దాటించగలడు. పెండ్యాల శ్రీనివాస్‌, పార్థసాని ఇద్దరూ రాత్రికి రాత్రే దేశం వదిలి పారిపోయారు. ఐటీశాఖకు చంద్రబాబు పరిధులు చెబుతున్నారు. చంద్రబాబు దోచుకున్నారని జనం కూడా నిర్ధారణకొచ్చారు. పురంధేశ్వరి ఏపీ బీజేపీ చీఫ్‌గా కాకుండా, ఏపీ టీడీపీ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. లోకేష్‌ ఢిల్లీకి ఎందుకు వెళుతున్నాడో అర్థం కావడం లేదు. అమరావతి అంతా కుట్రనే. అన్ని వ్యవస్థలను మోసం చేశారు. తప్పు చేశారు కాబట్టే టీడీపీ నేతలు మోహం చాటేస్తున్నారు. సొంతపార్టీ నేతలే టీడీపీని పట్టించుకోవడం లేదు. జాకీలు పెట్టి లేపిన టీడీపీ పార్టీ లేవదు. ’ అని సజ్జల పేర్కొన్నారు.                             

టాప్ హెడ్ లైన్స్

Breaking News: హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం- లోయలో పడిన కారు, 13 మంది మృతి 
హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం- లోయలో పడిన కారు, 13 మంది మృతి 
Pawan Kalyan Vs Vijay: పవన్, చంద్రబాబుపై సెటైర్... జన నాయకుడికి జైలు సీన్ అవసరమా?
పవన్, చంద్రబాబుపై సెటైర్... జన నాయకుడికి జైలు సీన్ అవసరమా?
Rampachodavaram Mega PTM: ప్రతి విద్యార్థి ప్రతిభను వెలికి తీసేలా విద్యావ్యవస్థలో మార్పులు - రంపచోడవరం మెగా పీటీఎంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ప్రతి విద్యార్థి ప్రతిభను వెలికి తీసేలా విద్యావ్యవస్థలో మార్పులు - రంపచోడవరం మెగా పీటీఎంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
AP Education Reforms: ప్రైవేటు నుంచి ప్రభుత్వ స్కూళ్లకు మారిన లక్ష మందికిపైగా విద్యార్థులు - గిరిజన స్కూళ్లన్నింటికీ సొంత భవనాలు - లోకేష్ కీలక ప్రకటన
ప్రైవేటు నుంచి ప్రభుత్వ స్కూళ్లకు మారిన లక్ష మందికిపైగా విద్యార్థులు - గిరిజన స్కూళ్లన్నింటికీ సొంత భవనాలు - లోకేష్ కీలక ప్రకటన

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Warning to PM Modi : జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
Kumki Elephants: పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
Honda ZR-V Review: మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Embed widget