News
News
వీడియోలు ఆటలు
X

Razole MLA : ఎంపీ ఫండ్స్ తో ఇంట్లో రోడ్డు - వివాదంలో జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ !

జనసేన పార్టీ నుంచి ఎన్నికైన రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వరుస వివాదాల్లో నిలుస్తున్నారు.. తాజాగా ఎమ్మెల్యే నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో నోటీసులు అందుకున్నారు.

FOLLOW US: 
Share:

 Razole MLA :   ప్రజాప్రతినిధులు ప్రజాధనంతో రోడ్లు వేయిస్తారు. మౌలిక సదుపాయాలు కల్పించుకుంటారు. జనసేన తరపున రాజోలు నుంచి గెలిచిన రాపాక కూడా అదే చేశారు. కానీ ఆ రోడ్డు తన ఇంట్లో వేయించుకున్నారు.   జనసేన పార్టీ నుంచి ఎన్నికైన రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు వరుస వివాదాల్లో నిలుస్తున్నారు.. ఇటీవలే తాను దొంగ ఓట్లు ద్వారా ఎన్నికయ్యానని చింతలపూడి అనే గ్రామంలో ఓ వేదికపై మాట్లాడి ఏకంగా ఎన్నికల కమిషన్‌ ద్వారా విచారణకు ఆదేశాలంది చిక్కుల్లో పడ్డ రాపాక ఇప్పుడు నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కలెక్టర్‌ హిమాన్షుశుక్లా విచారణకు ఆదేశించారు. 

 తన ఇంటి ప్రహరీ లోపన సొంత స్థలంలో రోడ్డు వేయించుకున్న రాపాక

రాజోలు నియోజకవర్గ పరిధిలోనే మలికిపురం మండలం కత్తిమండ గ్రామంలో ఎమ్మెల్యే రాపాక నూతన గృహాన్ని నిర్మించుకున్నారు. అయితే ఇంటి ప్రహారీ గేట్‌ నుంచి ఇంటి వరకు రూ.12 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మించారు. ఇవి ఎంపీ ల్యాడ్స్‌ నుంచి మంజూరైన నిధులు.  కాగా దీనిపై కేశవదాసుపాలెంకు చెందిన వెంకటపతిరాజు అనే వ్యక్తి కేంద్ర మంత్రిత్వశాఖకు మెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్‌కు సదరు మంత్రిత్వ శాఖ నుంచి విచారణ చేయాలని ఆదేశాలందాయి. జిల్లా పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ చంటిబాబు కూడా దృవీకరించారు. ఈ రోడ్డు నిర్మాణంపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశాలందాయని తెలిపారు. 

ఆ రోడ్డు స్థలాన్ని పంచాయతీకి రాసిచ్చానన్న రాపాక
 
ఇంటి ప్రహారీ లోపల భాగంలో సీసీ రోడ్డు నిర్మించున్నారన్న అభియోగాలపై ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ వివరణ ఇచ్చారు. ఎమ్మెల్యేగా ఉన్న తన ఇంటికి కలవడానికి అనేక మంది ప్రజలు వస్తూ ఉంటారని, వారు ఇబ్బందులు పడకూడదనే ఆ స్థలాన్ని పంచాయతీకు రాసిచ్చి ఆపై తీర్మాణం చేశాకే రోడ్డు నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలిపారు. అంతే కాకుండా కొంత మేర ఆ రోడ్డును ఆనుకుని కొన్ని ఇళ్లు ఉన్నాయని అందుకే రోడ్డు నిర్మించినట్లు చెబుతున్నారు. 
  
వరుసగా వివాదాల్లో రాపాక  

జనసేన పార్టీ తరపున డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం నుంచి 2019లో పోటీచేసి గెలుపొందిన రాపాక వరప్రసాదరావు ఏడాది కాలవ్యవధిలోనే అధికార వైసీపీ అనుకూలంగా ఉంటూ వ్యవహరిస్తున్నారు. నేరుగా వైసీపీ అధికారిక కార్యాక్రమాల్లో పార్టీ కండువా కప్పుకుని మరీ తిరుగుతున్నారు. అయితే ఈక్రమంలోనే ఇటీవలే మలికిపురం మండలం చింతలపూడి గ్రామంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఓ వీడియో వైరల్‌ అయ్యింది. తాను దొంగ ఓట్లతో నెగ్గానని ఆయనే స్వయంగా చెప్పిన మాటలు అందులో ఉన్నాయి. అయితే అది ఇప్పటి మాట కాదని, గతంలో తాను ఎమ్మెల్యేగా పోటీచేసినప్న్టటి మాట అని సర్ధి చెప్పుకోవాల్సి వచ్చింది. అయితే దీనిపై ఓ వ్యక్తి ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదుచేయడంతో విచారణకు ఆదేశించింది. దీనిపై సంబందిత ఆదేశాలు జిల్లా కలెక్టర్‌ హిమాన్షుశుక్లాకు అందినట్లు కలెక్టరేట్‌ వెల్లడించింది.. 

Published at : 10 May 2023 03:24 PM (IST) Tags: Konaseema News Razole MLA rapaka varaprasad rapaka konaseema politics

సంబంధిత కథనాలు

Coromandel Train Accident: రైలు ప్రమాద స్థలం నుంచి ఏపీకి ప్రత్యేక రైలు, రాత్రి విజయవాడకు 50-60 మంది!

Coromandel Train Accident: రైలు ప్రమాద స్థలం నుంచి ఏపీకి ప్రత్యేక రైలు, రాత్రి విజయవాడకు 50-60 మంది!

Odisha Train Accident: ఒడిశా ప్రమాదంలో 50 మందికిపైగా తెలుగువారు మృతి! వివరాలు సేకరించే పనిలో ఏపీ ప్రభుత్వం

Odisha Train Accident: ఒడిశా ప్రమాదంలో 50 మందికిపైగా తెలుగువారు మృతి! వివరాలు సేకరించే పనిలో ఏపీ ప్రభుత్వం

AP RGUKT IIIT admissions 2023: ఏపీ ట్రిపుల్‌ ఐటీల్లో 2023-24 ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల, ఎంపిక ఇలా!

AP RGUKT IIIT admissions 2023: ఏపీ ట్రిపుల్‌ ఐటీల్లో 2023-24 ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల, ఎంపిక ఇలా!

Coromandel Train Accident : ఒడిశా ప్రమాద మృతుల్లో తెలుగు ప్రయాణికులు- బాధితుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్లు ఏర్పాటు

Coromandel Train Accident : ఒడిశా  ప్రమాద మృతుల్లో తెలుగు ప్రయాణికులు- బాధితుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్లు ఏర్పాటు

Todays Top 10 headlines: ఒడిశా రైలు ప్రమాద స్థలంలో భయానక వాతావరణం, జాతీయ రాజకీయాలపై కేసీఆర్‌ ఆలోచన మారిందా?

Todays Top 10 headlines: ఒడిశా రైలు ప్రమాద స్థలంలో భయానక వాతావరణం, జాతీయ రాజకీయాలపై కేసీఆర్‌ ఆలోచన మారిందా?

టాప్ స్టోరీస్

Odisha Train Accident: తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!

Odisha Train Accident: తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!

PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ

PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ

Whatsapp: వాట్సాప్ ఛాటింగ్ ఇంతకు ముందులా ఉండదు - ఎందులో మార్పులు జరుగుతున్నాయో తెలుసా?

Whatsapp: వాట్సాప్ ఛాటింగ్ ఇంతకు ముందులా ఉండదు - ఎందులో మార్పులు జరుగుతున్నాయో తెలుసా?

Coromandel Express Accident: రాంగ్‌ ట్రాక్‌లోకి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, అందుకే ఘోర ప్రమాదం - ప్రాథమిక రిపోర్ట్

Coromandel Express Accident: రాంగ్‌ ట్రాక్‌లోకి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, అందుకే ఘోర ప్రమాదం - ప్రాథమిక రిపోర్ట్