Rajahmundry: రాజమండ్రి వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు - నేడు రద్దు, లేట్ అయ్యే ట్రైన్స్ ఇవే
రైల్వే అధికారులు 9 రైళ్లను పూర్తిగా, రెండు రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. ప్రస్తుతం రైళ్ల రాకపోకలు ఒకే ట్రాక్‌పై కొనసాగుతున్నాయి.
Rajamundry Goods Train Derailment: ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరంలో ఓ గూడ్సు రైలు పట్టాలు తప్పింది. దీంతో ఆ మార్గంలో వెళ్లాల్సిన చాలా రైలు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. కొన్నింటిని దక్షిణ మధ్య రైల్వే రద్దు చేయగా, మరికొన్నింటిని దారి మళ్లించింది. ఇంకా కొన్ని రైళ్లు ఆలస్యంగా నడవనున్నాయి. బుధవారం (నవంబరు 9) తెల్లవారుజామున 3 గంటలకు రాజమహేంద్రవరం స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. గూడ్స్ రైలు బోగీలు పట్టాలపై చెల్లాచెదురుగా పడిపోయాయి. పూర్తిగా బోగీలు దెబ్బతిన్నాయి. రైలు పట్టాలు కూడా దెబ్బ తినడంతో ఒకే ట్రాక్ మీదుగా రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కోల్‌కతా - విశాఖపట్నం - చెన్నై రైలు మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది ట్రాక్ వద్దకు చేరుకొని హుటాహుటిన మరమ్మతులు చేస్తున్నారు. రైలు అధికారులు పట్టాలపై పడ్డ బోగీలను క్రేన్ల సాయంతో తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.
రైల్వే అధికారులు 9 రైళ్లను పూర్తిగా, రెండు రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. ప్రస్తుతం రైళ్ల రాకపోకలు ఒకే ట్రాక్‌పై కొనసాగుతున్నాయి. దక్షిణ మధ్య రైల్వే తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ-లింగంపల్లి రైలు 2 గంటలు ఆలస్యంగా నడవనుంది. విజయవాడ - రాజమండ్రి, కాకినాడ పోర్టు - విజయవాడ రైళ్లు పాక్షికంగా రద్దు అయ్యాయి. పూర్తిగా రద్దయిన రైళ్లలో విజయవాడ - విశాఖపట్టణం (12718), విశాఖ - విజయవాడ (12717), గుంటూరు - విశాఖ (17239), విశాఖ - గుంటూరు (17240), విశాఖ - విజయవాడ (22701), విజయవాడ - విజయవాడ (22702), విజయవాడ - గుంటూరు (07628), గుంటూరు - విజయవాడ (07864), కాకినాడ పోర్ట్ -విజయవాడ (17257) రైళ్లు ఉన్నాయి.
నవంబర్ 9న పూర్తిగా రద్దు అయిన రైళ్లు
రైలు నెంబరు మార్గం
12718 - విజయవాడ - విశాఖపట్నం
12717 - విశాఖపట్నం - విజయవాడ
17239 - గుంటూరు - విశాఖపట్నం
17240 - విశాఖపట్నం - గుంటూరు
22701 - విశాఖపట్నం - విజయవాడ
22702 - విజయవాడ - విజయవాడ
07628 - విజయవాడ - గుంటూరు
07864 - గుంటూరు - విజయవాడ
17257 - కాకినాడ పోర్టు - విజయవాడ
పాక్షికంగా రద్దు అయిన రైళ్లు
17258 - కాకినాడ పోర్ట్ - విజయవాడ
07768 - విజయవాడ - రాజమండ్రి
రీషెడ్యూల్ అయిన రైలు
12805 - విజయవాడ - లింగంపల్లి - 120 నిమిషాలు ఆలస్యం
#Attention Passengers
— DRM Vijayawada (@drmvijayawada) November 9, 2022
Due to derailment of NMG Goods Rake on Down Main Line at Rajahmundry Yard the following trains are Cancelled/Partially Cancelled/ Rescheduled@SCRailwayIndia @RailMinIndia @DRMWaltairECoR pic.twitter.com/dsKEn50B2j