Kakinada: కాకినాడలో కరోనా కలకలం, 40 మంది విద్యార్థుల్లో లక్షణాలు - NCC క్యాంపులో 317 మంది
దేశంలో కరోనా కేసులు స్థిరంగా నమోదవుతున్నాయి. కొత్తగా 13,313 కరోనా కేసులు వచ్చాయి. 38 మంది మృతి చెందారు.
తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడలో ఒకేసారి 40 మంది విద్యార్థులకు కరోనా లక్షణాలు కనిపించాయి. స్థానిక ఎస్‌కేఆర్ ఉన్నత పాఠశాలలో ఈ కరోనా కలకలం వెలుగు చూసింది. స్కూలులో ఉన్న 40 మంది ఎన్‌సీసీ విద్యార్థులకు కరోనా లక్షణాలు కనిపించడంతో వారిని అధికారులు ఐసోలేషన్‌లో ఉంచారు. ఎన్‌సీసీ క్యాంప్‌లో మొత్తం 317 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ నెల 18 నుంచి ఎన్‌సీసీ క్యాంప్ ప్రారంభం అయింది. అయితే, యూనిట్ కమాండింగ్ అధికారి లక్షణాలు ఉన్న 40 మందికి కరోనా పరీక్షలు చేయించారు. వీరి కరోనా పరీక్షలకు సంబంధించి రిపోర్టులు రావాల్సి ఉంది. వచ్చే ఫలితాలను బట్టి తర్వాత క్యాంపు కొనసాగించాలా వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఏపీలో బుధవారం 340 కరోనా కేసులను గుర్తించారు. అంతకు ముందు రోజు 298 కేసులు నమోదయ్యాయి.
దేశంలో కరోనా కేసులు స్థిరంగా నమోదవుతున్నాయి. కొత్తగా 13,313 కరోనా కేసులు వచ్చాయి. 38 మంది మృతి చెందారు. తాజాగా 10,972 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.60 శాతానికి చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.19 శాతం ఉన్నాయి. డైలీ పాజిటివిటీ రేటు 2.03 శాతంగా ఉంది. వీక్లీ పాజిటివిటీ రేటు 2.81గా నమోదైంది.
- మొత్తం కరోనా కేసులు: 4,33,44,958
- మొత్తం మరణాలు: 5,24,941
- యాక్టివ్ కేసులు: 83,990
- మొత్తం రికవరీలు: 4,27,36,027
వ్యాక్సిన్ పంపిణీ ఇలా..
దేశంలో కొత్తగా 14,91,941 మందికి టీకాలు అందించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,96,62,11,973 కోట్లకు చేరింది. మరో 6,56,410 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.
కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్రం.. రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కరోనా నిబంధనలను తప్పకుండా పాటించేలా చూడాలని తెలిపింది. కరోనా టెస్టులను పెద్ద ఎత్తున నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. మాస్కులు తప్పనిసరిగా వినియోగించాలని కోరింది.
►దేశంలో కరోనా వైరస్ క్రమంగా విస్తరిస్తోంది.కొత్త కేసులు భారీగా పెరిగి..17వేలకు పైగా నమోదయ్యాయి.
— DD News Andhra (అధికారిక ఖాతా) (@DDNewsAndhra) June 24, 2022
► పాజిటివిటీ రేటు నాలుగు శాతం దాటి,ఆందోళన కలిగిస్తోంది.
►నిన్న 4 లక్షల మందికి పైగా కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా.. 17,336 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది#Unite2FightCorona pic.twitter.com/EkWeFWHdCC
► ముందురోజు కంటే కొత్త కేసులు 4 వేల మేర పెరిగి,30 శాతం అధికంగా నమోదయ్యాయి.
— DD News Andhra (అధికారిక ఖాతా) (@DDNewsAndhra) June 24, 2022
►ప్రస్తుతం వైరస్ క్రమంగా వ్యాపిస్తుండటంతో క్రియాశీల కేసులు గణనీయంగా పెరిగాయి.
►ప్రస్తుతం వాటి సంఖ్య 88,284కి చేరింది.#Unite2FightCorona#LargestVaccineDrive#OmicronVariant
►క్రియాశీల రేటు 0.20 శాతానికి పెరగ్గా.. రికవరీ రేటు(98.59 శాతం) రోజురోజుకూ పడిపోతోంది.
— DD News Andhra (అధికారిక ఖాతా) (@DDNewsAndhra) June 24, 2022
►24 గంటల వ్యవధిలో 13,029 మంది కోలుకున్నారు. 13 మంది మరణించారు.#Unite2FightCorona#LargestVaccineDrive#OmicronVariant