అన్వేషించండి

YS Jagan: నరసాపురం చరిత్రలో ఇదెప్పుడూ జరగలేదు, తొలిసారి ఇలా - సీఎం జగన్

నరసాపురం పురపాలక సంఘం మంచినీటి అభివృద్ధి పథకాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో సీఎం జగన్ ప్రసంగించారు.

CM Jagan Narasapuram Tour: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటించారు. అక్కడ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మొత్తం రూ.3,300 కోట్ల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. నరసాపురం పురపాలక సంఘం మంచినీటి అభివృద్ధి పథకాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో సీఎం జగన్ ప్రసంగించారు. నరసాపురంలో ఒకేసారి ఇన్ని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఎప్పుడూ జరగలేదని జగన్ అన్నారు. రూ.3,300 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరగడం ఇదే తొలిసారని అన్నారు. 

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘‘ఆంధ్రప్రదేశ్‌ ఆక్వా యూనివర్శిటీకి శంకుస్థాపన చేశాం. నరసాపురం ఆక్వా రంగానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. నర్సాపురం రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆక్వారంగం నర్సాపురానికి ఎంత ప్రధానమైందో తెలుసు. ఫిషరీస్‌ యూనివర్శిటీలు తమిళనాడు, కేరళలో మాత్రమే ఉన్నాయి. దేశంలో మూడో ఫిషరీస్ యూనివర్శిటీ ఏపీలో రాబోతుంది. రూ.332 కోట్ల వ్యయంతో ఫిషరీస్ యూనివర్శిటీని ఏర్పాటు చేస్తున్నాం’’

‘‘ముమ్మిడివరంలో వేట కోల్పోయినవారికి అండగా నిలుస్తున్నాం. వేట కోల్పోయిన వారికి రెండో దఫా పరిహారం అందిస్తున్నాం. ఈ ప్రభుత్వం మీది.. మీకు అండగా ఉంటుంది. జగనన్న ప్రభుత్వం అంటే మన ప్రభుత్వం అనుకునేలా పాలన చేస్తున్నాం. ఎన్నికలప్పుడు చెప్పిన హామీలను నెరవేరుస్తున్నాం. నేను విన్నాను.. నేను.. ఉన్నాను.. అని చెప్పి హామీని నెరవేరుస్తున్నాం. నర్సాపురంలో దశాబ్దాల కాలంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తున్నాం’’ అని సీఎం అన్నారు.

ప్రారంభోత్సవాలు ఇవీ 
Narasapuram News: నరసాపురంలో ఉన్న 100 పడకల ప్రాంతీయ ఆస్పత్రిలో కొత్తగా రూ.13 కోట్లతో మాతా శిశు సంరక్షణ విభాగం ఏర్పాటు చేశారు. నరసాపురం పట్టణంలో మంచి నీటి సమస్య నివారణకు రూ.61.81 కోట్లతో నీటి సరఫరా అభివృద్ధి పథకం చేపట్టి పూర్తి చేశారు.

ఇవీ శంకుస్థాపనలు..
CM Jagan in Narasapuram: రూ.24.01 కోట్లతో మొగల్తూరు వియర్‌ పంట కాలువ నిర్మాణం చేపడతారు. రూ.8.83 కోట్లతో కాజ, ఈస్ట్‌ కొక్కిలేరు, ముస్కేపాలెం అవుట్‌ఫాల్‌ నాలుగు స్లూయీస్‌ల పునః నిర్మాణం చేయనున్నారు. రూ.1.08 కోట్లతో నరసాపురం డివిజినల్‌ సబ్ ట్రెజరీ ఆఫీసు కొత్త భవన నిర్మాణం చేశారు. రూ.87 కోట్లతో ఫస్ట్ ఫేజ్‌ పనులు, రూ.26.32 కోట్లతో వశిష్ఠ వారధి – బుడ్డిగవాని రేవు ఏటి గట్టు పటిష్ట పనులు చేపట్టనున్నారు. రుస్తుంబాద గ్రామంలో రూ.132.81 కోట్లతో 220/ 132/ 33 కె.వి సబ్‌స్టేషన్‌ నిర్మాణ పనులు, మున్సిపాలిటీ పరిధిలో రూ.237 కోట్లతో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణం చేయనున్నారు.

రూ.7.83 కోట్ల అంచనా ఖర్చుతో చివరి గ్రామాలకు సాగు, తాగు నీటి సౌకర్యాలు కల్పించేందుకు శేషావతారం పంట కాలువ అభివృద్ధిలో భాగంగా ఛానల్‌ డీ సిల్టింగ్, టెయిల్‌ డ్యామ్‌ నిర్మాణం, సీసీ లైనింగ్‌ పనులు చేపట్టడానికి శంకుస్థాపన చేశారు. రూ.4 కోట్ల ఖర్చుతో నరసాపురం బస్‌ స్టేషన్‌ పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేశారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Breaking News:నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
PM Modi At Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
YSRCP Leaders Absconding: పరారీలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జులు - ముస్తఫా, చింతాడ రవికుమార్‌లపై నాన్-బెయిలబుల్ కేసులు!
పరారీలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జులు - ముస్తఫా, చింతాడ రవికుమార్‌లపై నాన్-బెయిలబుల్ కేసులు!
Godavari River Overflow: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
The Hundred League Hug: భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
Pawan Kalyan onTiger Death: రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
Revanth Reddy Criminal Waste Remarks: రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
PM Modi On CJP Protest: నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
Embed widget