అన్వేషించండి

Mudragada Padmanabham Funeral:ముద్రగడ అంత్యక్రియలపై మరో వివాదం! అధికారిక లాంఛనాలపై వైసీపీ అభ్యంతరం! తప్పు పట్టిన మంత్రి!

అనారోగ్యంతో మృతి చెందిన ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో మరో వివాదం చోటు చేసుకుంది. అధికారిక లాంఛనాలు అవసరం లేదని వైసీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తే, మంత్రులు వారికి కౌంటర్ ఇచ్చారు. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది.
  • కుటుంబం లాంఛనాలను తిరస్కరించిందని వైసీపీ నేతలు ప్రకటించి, సర్కారుపై విమర్శలు చేశారు.
  • అంత్యక్రియలు రాజకీయం చేయవద్దని పర్యాటక మంత్రి దుర్గేష్ వైసీపీకి కౌంటర్ ఇచ్చారు.
  • ముద్రగడ కుమార్తెను చివరి చూపుకు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.

Mudragada Padmanabham Funeral:మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో వరుస వివాదాలు అనుచరులకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఉదయం కుమార్తె రాక సందర్భంగా కిర్లంపూడిలో హడావిడి నడిచింది. ఇప్పుడు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలపై ఇష్యూ నడుస్తోంది. అలాంటి అధికారిక లాంఛనాలకు ముద్రగడకు అవసరం లేదని వైసీపీ నేతలు కొట్టిపారేస్తున్నారు. మరణించిన ప్రజాప్రతినిధులకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేయడం సంప్రదాయమని మంత్రులు చెబుతున్నారు. దీంతో వివాదం ఏ స్థాయికి వెళ్తుందని ఆయన అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలపై వివాదం

కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ఏర్పాట్లు చేస్తున్నారు. మాజీ మంత్రి కావడంతో అధికారిక లాంఛనాలతో అంతిసంస్కారాలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే దీనికి కుటుంబ సభ్యులు అంగీకరించడం లేదని వైసీపీ నేతలు ప్రకటించారు. ఆ పార్టీ సీనియర్ నేత జక్కంపూడి రాజా దీనిపై మీడియాతో మాట్లాడారు. ముద్రగడ ఎప్పడూ అధికారం కోసం పాకులాడలేదని తెలిపారు. అందుకే అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు వద్దని కుటుంబ సభ్యులు చెప్పినట్టు వెల్లడించారు. ఇంటి ఆవరణంలో సాధారణంగా ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారని ప్రకటించారు.   

ప్రభుత్వంపై వైసీపీ విమర్శలు

అంతేకాకుండా ప్రభుత్వంపై జక్కంపూడి విమర్శలు కూడా చేశారు. ముద్రగడ బతికున్నప్పుడు కచ్చితంగా వేధించారని ఆరోపించారు. ప్రజాసమస్యలపై పోరాడిన వ్యక్తిని ఇబ్బంది పెట్టారని, ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే ప్రభుత్వ లాంఛనాలు అవసరం లేదని కుటుంబ సభ్యులు చెప్పినట్టు వెల్లడించారు. 

అంతకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చర్చించుకొని ముద్రగడ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ఆదేశించారు. ముద్రగడ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఒకసారి ఎంపీగా పని చేసిన ఆయనకు దక్కాల్సిన గౌరవం అందివ్వాలని ప్రభుత్వం యోచించింది. ఇప్పుడు కుటుంబ సభ్యులు వద్దని చెప్పారని వైసీపీ నేతలు ప్రకటించడంతో సరికొత్త వివాదానికి దారి తీసింది.  

వైసీపీ నేతలు ప్రకటనపై పర్యాటక మంత్రి కందుల దుర్గేష్‌ కౌంటర్ ఇచ్చారు. మంత్రిగా, ప్రజాప్రతినిధిగా రాష్ట్ర ప్రజలకు ముద్రగడ పద్మనాభం చేసిన సేవలకు గుర్తింపుగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అన్నారు. మృతి విషయంలో రాజకీయాలు చేయడం మంచిది కాదని అభిప్రాయపడ్డారు. 

ఉదయం కుమార్తెను రానివ్వను కుటుంబం, వైసీపీ నేతలు 

ఉదయం కూడా ముద్రగడను చూసేందుకు వచ్చిన కుమార్తె క్రాంతిని కుటుంబ సభ్యులు, వైసీపీ నేతలు అడ్డుకున్నారు. బతికి ఉన్నప్పుడు ఆయన్ని ఇబ్బంది పెట్టిన కుమార్తెకు చివరి చూపు చూసే అర్హత లేదని కూడా నినాదాలు చేశారు. అంతేకాకుండా 2024లో ముద్రగడ చేసిన కామెంట్స్‌ను గుర్తు చేశారు. అప్పట్లో నెలకొన్ని వివాదాలపై స్పందించిన ముద్రగడ తనకు కుమార్తె లేరని ప్రకటించారు. తాను మరణిస్తే చివరి చూపు కోసం కూడా రావద్దని ప్రకటించారు. అందుకే ఆమెను అనుతించేందుకు కుటుంబ సభ్యులు, వైసీపీ నేతలు అంగీకరించేదు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకొని ముద్రగడ కుమార్తె క్రాంతిని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. 

Frequently Asked Questions

ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల వివాదం ఏమిటి?

ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించగా, కుటుంబ సభ్యులు అంగీకరించడం లేదని వైసీపీ నేతలు ప్రకటించారు. ఇది సరికొత్త వివాదానికి దారితీసింది.

ముద్రగడ కుటుంబ సభ్యులు అధికారిక లాంఛనాలను ఎందుకు తిరస్కరిస్తున్నారు?

ముద్రగడ అధికారం కోసం పాకులాడలేదని, అందుకే సాధారణంగా ప్రక్రియ పూర్తి చేయాలని కోరుకుంటున్నారని వైసీపీ నేతలు తెలిపారు. బతికున్నప్పుడు ప్రభుత్వం ఆయన్ను వేధించిందని కూడా ఆరోపించారు.

ముద్రగడ కుమార్తె క్రాంతిని అంత్యక్రియల వద్ద ఎందుకు అడ్డుకున్నారు?

ముద్రగడ బతికి ఉన్నప్పుడు

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Amalapuram Latest News: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులు తిరుగుబాటు- పంట విరామం ప్రకటించిన తాడికోన అన్నదాతలు! 
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులు తిరుగుబాటు- పంట విరామం ప్రకటించిన తాడికోన అన్నదాతలు! 
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
Breaking News: నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
Andhra Pradesh And Telangana Weather Report: ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
Advertisement

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Udhayanidhi Stalin: నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
Telangana Police Vehicle Rapido: పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
Khanapur MLA Wedma Bojju: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
AP High Court Rejects CBI Probe on Mega DSC: మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
Crop Insurance Scheme: రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
Utnoor Gond Fort: ఎకో టూరిజం కేంద్రంగా గోండు రాజుల చారిత్రాత్మక కోట అభివృద్ధి
ఎకో టూరిజం కేంద్రంగా గోండు రాజుల చారిత్రాత్మక కోట అభివృద్ధి
Embed widget