అన్వేషించండి

JNTU Kakinada : కాకినాడ జేఎన్‌టీయూలో 194 దేశాల జెండాలు, ఎందుకు పెట్టారో తెలుసా?

Kakinada Latest News: వాక్ విత్ నేష‌న్స్ పేరుతో కాకినాడ జేఎన్‌టీయూలో 194 దేశాల జెండాలు ఆవిష్క‌రించారు. పూర్వ విద్యార్ధి బాదం సుంద‌రరావు వీటిని ఏర్పాటు వెనుక

కాకినాడ జేఎన్‌టీయూ అంటే సాంకేతిక విద్యలో తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరుంది. ఇక్కడ చదివిన ఎంతో మంది సాంకేతిక రంగాల్లో ఎనలేని కీర్తిని సంపాదించిన వారు ఉన్నారు. వేల మంది దేశ విదేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. అటువంటి కీర్తిప్రతిష్టలు కలిగిన కాకినాడ జేఎన్‌టీయూ అభివృద్ధిపరంగానే కాకుండా యూనివర్సిటీ ప్రత్యేకతను చూపించేందుకు చాలా మంది పూర్వవిద్యార్థులు తమ భాగస్వామ్యపాత్ర పోషిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే దేశంలో ఏ విశ్వవిద్యాలయంలోనూ కనిపించని విధంగా జేఎన్‌టీయూకేలో ఏకంగా 194 దేశాల జాతీయపతాకాలను ఏర్పాటు చేసి ఆవిష్కరించారు. జెనీవా, న్యూయార్క్‌, సియోల్‌, షాంఘై, శాంటోడోమింగ్‌లో ఉండే జాతీయ పతాకాల సమ్మేళనం మన దేశంలో తొలిసారిగా కాకినాడ జేఎన్‌టీయూలో ఏర్పాటుచేశారు. యూనివర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వీటిని ఇన్‌చార్జ్‌ వైస్‌ ఛాన్సలర్‌ కేవీఎస్‌జీ మురళీకృష్ణ ఆవిష్కరించారు. 

వాక్‌విత్‌ నేషన్‌ పేరుతో ఏర్పాటు జరిగిందిలా..
జేఎన్‌టీయూకే ప్రాంగణంలో 194 దేశాల జెండాలు ఆవిష్కరించడం వెనుక పూర్వవిద్యార్ధి, సుందర్‌ అసోసియేట్స్‌ ఛైర్మన్‌ బాదం సుందరరావు ఉన్నారు. ఆయన సహకారంతో వాక్‌విత్‌ నేషన్స్‌ పేరుతో విశ్వవిద్యాలయ ప్రాంగణంలో చేసిన ఈ జెండాల ఏర్పాటు వెనుక ఐక్యరాజ్యసమితి ప్రధాన కేంద్రం స్ఫూర్తి ఉందని వీసీ మురళీ కృష్ణ తెలిపారు. వసుదైక కుటుంబమే దీని ముఖ్య ఉద్దేశ్యమని చెప్పారు. పూర్వ విద్యార్ధిగా తన విశ్వవిద్యాలయంలో ఈ 194 జెండాల ప్రాజెక్టును సొంత ఖర్చుతో ఏర్పాటు చేసినట్లు పూర్వవిద్యార్ధి బాదం సుందరరావు తెలిపారు. 

ప్రతీ జెండా స్తంభానికి క్యూ ఆర్‌ కోడ్‌...
జేఎన్‌టీయూకే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 194 దేశాల జెండాల వివరాలు తెలుసుకునేలా ప్రతీ జెండా స్తంభానికి ఒక క్యూ ఆర్‌ కోడ్‌ ఏర్పాటు చేశారు. అంత‌ర్జాతీయ స‌మైక్యత నినాద‌మే కాకుండా అంత‌ర్జాతీయ ఐక్యరాజ్యసమితిలో గుర్తింపు పొందిన దేశ పరిస్థితులు తెలుసుకోవ‌చ్చు. దీనిని స్కాన్‌ చేస్తే ఆ జెండా. దేశం వివరాలు అన్నీ తెలుసుకోవచ్చు. ఇవ‌న్నీ స‌మాన ఎత్తులో ఏర్పాటు చేయ‌డ‌మే కాకుండా అక్షర క్రమంలో ఉంచారు. దేశ భౌగోళిక పరిస్థితి, క‌రెన్సీ, ఇత‌ర వివ‌రాలు ఈ క్యూ ఆర్ కోడ్ ద్వారా తెలుసుకోవ‌చ్చు. విశ్వవిద్యాలయ ప్రాంగణంలో 194 దేశాల జెండాలు రెపరెపలాడుతూ అందరి దృష్టిని ఆకర్షించాయి. 

టాప్ హెడ్ లైన్స్

Mudragada Padmanabham Funeral:ముద్రగడ అంత్యక్రియలపై మరో వివాదం! అధికారిక లాంఛనాలపై వైసీపీ అభ్యంతరం! తప్పు పట్టిన మంత్రి!
ముద్రగడ అంత్యక్రియలపై మరో వివాదం! అధికారిక లాంఛనాలపై వైసీపీ అభ్యంతరం! తప్పు పట్టిన మంత్రి!
Breaking News: కాగజ్‌నగర్ ప్రభుత్వం పాఠశాలలో అగ్ని ప్రమాదం- వంటగదిలో గ్యాస్‌ లీక్‌తో దుర్ఘటన 
కాగజ్‌నగర్ ప్రభుత్వం పాఠశాలలో అగ్ని ప్రమాదం- వంటగదిలో గ్యాస్‌ లీక్‌తో దుర్ఘటన 
Mudragada Padmanabham Funeral:ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో వివాదం! కుమార్తె రాకను అడ్డుకున్న కుటుంబం! కిర్లంపూడిలో ఉద్రిక్తత!
ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో వివాదం! కుమార్తె రాకను అడ్డుకున్న కుటుంబం! కిర్లంపూడిలో ఉద్రిక్తత!
Andhra Pradesh RTGS: భార్య బైక్ కొట్టేసిన భర్త! పట్టించిన చంద్రబాబు టెక్నాలజీ! ఒక్క దెబ్బకు 80 కేసులు ఛేదించిన పోలీసులు!
భార్య బైక్ కొట్టేసిన భర్త! పట్టించిన చంద్రబాబు టెక్నాలజీ! ఒక్క దెబ్బకు 80 కేసులు ఛేదించిన పోలీసులు!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mudragada Padmanabham Funeral:ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో వివాదం! కుమార్తె రాకను అడ్డుకున్న కుటుంబం! కిర్లంపూడిలో ఉద్రిక్తత!
ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో వివాదం! కుమార్తె రాకను అడ్డుకున్న కుటుంబం! కిర్లంపూడిలో ఉద్రిక్తత!
HYDRAA Demolitions: హైడ్రా టార్గెట్ చేస్తున్న ప్రాజెక్టులన్నీ కేటీఆర్ సన్నిహితులవేనా ? - తెలంగాణ రాజకీయాల్లో తెర వెనుక ఏం జరుగుతోంది?
హైడ్రా టార్గెట్ చేస్తున్న ప్రాజెక్టులన్నీ కేటీఆర్ సన్నిహితులవేనా ? - తెలంగాణ రాజకీయాల్లో తెర వెనుక ఏం జరుగుతోంది?
Kaleshwaram Project: కాళేశ్వరం నీళ్లు వదలకుంటే హైదరాబాద్‌లో బిందెల యుద్ధమే :ABP Desamతో మాజీ ఇరిగేషన్ ఇంజనీర్ టి. వెంటేశం
కాళేశ్వరం నీళ్లు వదలకుంటే హైదరాబాద్‌లో బిందెల యుద్ధమే :ABP Desamతో మాజీ ఇరిగేషన్ ఇంజనీర్ టి. వెంటేశం
US Iran War: తీవ్ర స్థాయికి అమెరికా, ఇరాన్‌ మధ్య యుద్ధం! 20 యుద్ధనౌకలు, వందలాది ఫైటర్ జెట్‌లతో హోర్ముజ్‌తో రౌండప్‌!
తీవ్ర స్థాయికి అమెరికా, ఇరాన్‌ మధ్య యుద్ధం! 20 యుద్ధనౌకలు, వందలాది ఫైటర్ జెట్‌లతో హోర్ముజ్‌తో రౌండప్‌!
TTD Latest News: తిరుమల ట్రస్టులు, పథకాల దాత‌ల ప్రివిలేజెస్‌లో భారీ మార్పులు! ఒంటిమిట్ట అభివృద్ధికి నిధులు! టీటీడీ కీలక నిర్ణయాలు! 
తిరుమల ట్రస్టులు, పథకాల దాత‌ల ప్రివిలేజెస్‌లో భారీ మార్పులు! ఒంటిమిట్ట అభివృద్ధికి నిధులు! టీటీడీ కీలక నిర్ణయాలు! 
Telangana Latest News: 9,000 రూపాయల ఖరీదు చేసే డ్రోన్ 91 రూపాయలకే! టీబీ రోగుల పాలిట వరంలా సేవలు! 
9,000 రూపాయల ఖరీదు చేసే డ్రోన్ 91 రూపాయలకే! టీబీ రోగుల పాలిట వరంలా సేవలు! 
Visakhapatnam Latest News:వందల సంఖ్యలో జంతువుల సంరక్షణకు ఒకడే పశువైద్యుడా? విశాఖ జూలో ఉద్యోగ ఖాళీలపై అయ్యన్న విస్మయం!
వందల సంఖ్యలో జంతువుల సంరక్షణకు ఒకడే పశువైద్యుడా? విశాఖ జూలో ఉద్యోగ ఖాళీలపై అయ్యన్న విస్మయం!
Maruti S-Presso Price in Hyderabad: హైదరాబాద్‌లో మారుతి ఎస్‌ప్రెస్సో ఆన్‌రోడ్ ధరలు! వేరియంట్స్, మైలేజీ పూర్తి వివరాలు ఇవే!
హైదరాబాద్‌లో మారుతి ఎస్‌ప్రెస్సో ఆన్‌రోడ్ ధరలు! వేరియంట్స్, మైలేజీ పూర్తి వివరాలు ఇవే!
Embed widget