అన్వేషించండి

Rajampet : రాజంపేట వర్సెస్ రాయచోటి .. జిల్లాల పోరులో నలిగిపోతున్న వైఎస్ఆర్‌సీపీ !

కడప జిల్లా వైఎస్ఆర్‌సీపీలో జిల్లా వివాదం చిచ్చు రేపుతోంది. రాజంపేటను జిల్లా కేంద్రం చేయాల్సిందేనని ఎమ్మెల్యే సహా ప్రజలు ఉద్యమబాట పడుతున్నారు.

కొత్త జిల్లాల అంశం కడప జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇబ్బందికర వాతావరణం సృష్టిస్తోంది. రాజంపేట ఎమ్మెల్యే, రాయచోటి ఎమ్మెల్యే  మధ్య విభేదాలకు కారణం అవుతోంది. రెండు చోట్ల వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు, నేతలు తమ ప్రాంతానికి మ్దదతుగా రోడ్డు మీదకు వచ్చే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వివాదానికంతటికి కారణం కడప జిల్లాను విభజించి కొత్తగా అన్నమయ్య జిల్లాను ఏర్పాటు చేశారు. అయితే జిల్లా కేంద్రంగా రాయచోటిని నిర్ణయించారు. ఇది రాజంపేట వాసుల్ని తీవ్ర అసంతృప్తికి గురి చేసింది. 

అన్నమ్మయ్య జిల్లా కేంద్రంగా రాజంపేట కావాలని కోరుతూ జిల్లా కలెక్టర్ విజయరామరాజును కలిసి ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి వినతి పత్రం అందించారు. ఈ మధ్య జరిగిన పరిణామాలు చాలా బాధించాయని మేడా మల్లిఖార్జునరెడ్డి అన్నారు.  గతంలో సీఎం జగన్ రాజంపేట ను జిల్లా గా చేస్తామని హామీ ఇచ్చారన్నారు.  వైసీపీ విధానం ప్రకారం పార్లమెంట్ నియోజకవర్గాలను జిల్లా కేంద్రం చేయాలి. రాజంపేట పార్లమెంట్ కేంద్రం అయినప్పటికీ రాయచోటిని జిల్లా కేంద్రం చేశారు. గతంలో హామీ ఇచ్చిన సీఎం జగన్ అన్నమయ్య జిల్లాగా రాయచోటి ని చేయడం బాధాకరమని ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

ఇప్పటికే ఈ విషయాన్ని  సీఎం దృష్టికి సమస్యను తీసుకెళ్లడం జరిగిందన్నారు. రాజంపేట పార్లమెంట్ కు ఒక ప్రత్యేకత ఉందన్నారు.  ఇలాంటి నిర్ణయం తీసుకోడానికి వెనుక  పరిణామాలు ఏమి జరిగాయి అన్నది తెలీదన్నారు. రాజంపేట కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాకూడా ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందో అర్థం కావడం లేదన్నారు. అన్నమయ్య జన్మ స్థలం రాజంపేట అని.. బ్రిటిష్ కాలం నాటి నుంచి రాజంపేట కు ప్రత్యేకత ఉందని ఎమ్మెల్యే తెలిపారు. రాయచోటి జిల్లా గా చేస్తూ తాళ్ళపాక అన్నమయ్య పేరును పెట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 

రాజంపేట ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని, తొందరలో సీఎం ను కలసి సమస్యను వివరించబోతున్నామన్నారు.  కరోనా పాజిటివ్ రావడం వల్ల సీఎం ను కలవలేకపోయానని.. రాజంపేట మీద నాకు చాలా మమకారం ఉందన్నారు.అలాగే సీఎం జగన్ కు రాష్ట్రం పై చాలా అవగాహన ఉందని.. ఎలాంటి పరిస్థితి లో సీఎం నిర్ణయం తీసుకున్నారో తెలియదని..ప్రజల మనోభావాలను సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. సీఎం జగన్ తప్పకుండా న్యాయం చేస్తారని నమ్మకం ఉందన్నారు. రాజంపేట ను జిల్లా గా చేస్తారని ఆశిస్తున్నామని, సీఎం మాకందరికి పెద్ద దిక్కన్నారు. పార్టీకి అనుగుణంగా నడుచుకుంటూ, ప్రజలకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. వైఎస్ఆర్‌సీపీకి సెలవు అంటూ రాజంపేటలో ప్రజలు ప్లెక్సీలు పెడుతూండటంతో ఎమ్మెల్యే రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది. 

టాప్ హెడ్ లైన్స్

Visakhapatnam Latest News: విశాఖలో స్లం రీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్.. పేద కుటుంబాలకు ఇళ్ల నిర్మాణం- ఏపీలో తొలి ప్రాజెక్టు
విశాఖలో స్లం రీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్.. పేద కుటుంబాలకు ఇళ్ల నిర్మాణం- ఏపీలో తొలి ప్రాజెక్టు
Nandus World Nandana : నా భర్తే చూసుకుంటారు... నాకేమీ తెలీదు - నందూస్ వరల్డ్ నందన స్టేట్మెంట్... బిగ్ బాస్ కోసమే వచ్చిందా?
నా భర్తే చూసుకుంటారు... నాకేమీ తెలీదు - నందూస్ వరల్డ్ నందన స్టేట్మెంట్... బిగ్ బాస్ కోసమే వచ్చిందా?
Vijayasai Reddy New Party AP: విజయసాయిరెడ్డి ‘థర్డ్ ఫ్రంట్’ ప్రయోగం - సొంతంగా వందల కోట్ల ఖర్చు.. వేరొకరిని సీఎం చేసే తెరవెనుక వ్యూహం ఏంటి?
విజయసాయిరెడ్డి ‘థర్డ్ ఫ్రంట్’ ప్రయోగం - సొంతంగా వందల కోట్ల ఖర్చు.. వేరొకరిని సీఎం చేసే తెరవెనుక వ్యూహం ఏంటి?
TDP Janasena Social Media Warning : ఈగోలు వర్సెస్ పొత్తు ధర్మం - టీడీపీ-జనసేన అధినేతల హెచ్చరికలతో ఆ సోషల్ సైన్యాలు దారికి వస్తాయా?
ఈగోలు వర్సెస్ పొత్తు ధర్మం - టీడీపీ-జనసేన అధినేతల హెచ్చరికలతో ఆ సోషల్ సైన్యాలు దారికి వస్తాయా?

వీడియోలు

Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్
KL Rahul Retained By Delhi Capitals IPL 2027 | ఢిల్లీలోనే కేఎల్ రాహుల్.. రూమర్లకు ఎండ్ కార్డ్
Duleep Trophy Final 2026 Vaibhav | దులీప్ ట్రోఫీ ఫైనల్ లో వైభవ్ మైండ్ గేమ్
Gundenininda Gudigantalu Serial September 9 | రోహిణిని బ్లాక్‌మెయిల్ చేసిన గుణ
Ishan Kishan 270 In Duleep Trophy Final | డబుల్ సెంచరీ వెనుక రహస్యాన్ని చెప్పిన ఇషాన్ కిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijay TVK: విజయ్‌ను నడిపిస్తోంది ముగ్గురు తెలుగు స్నేహితులేనా? - ఆ రెడ్డి బ్రదర్స్‌ను డీఎంకే ఎందుకు టార్గెట్ చేస్తోంది?
విజయ్‌ను నడిపిస్తోంది ముగ్గురు తెలుగు స్నేహితులేనా? - ఆ రెడ్డి బ్రదర్స్‌ను డీఎంకే ఎందుకు టార్గెట్ చేస్తోంది?
Visakhapatnam Latest News: విశాఖలో స్లం రీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్.. పేద కుటుంబాలకు ఇళ్ల నిర్మాణం- ఏపీలో తొలి ప్రాజెక్టు
విశాఖలో స్లం రీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్.. పేద కుటుంబాలకు ఇళ్ల నిర్మాణం- ఏపీలో తొలి ప్రాజెక్టు
Hyderabad Common Travel Pass: త్వరలో హైదరాబాద్‌లో ఆర్టీసీ, మెట్రోకు కలిపి ఒకటే పాస్.. ఛార్జీల పూర్తి వివరాలు
త్వరలో హైదరాబాద్‌లో ఆర్టీసీ, మెట్రోకు కలిపి ఒకటే పాస్.. ఛార్జీల పూర్తి వివరాలు
TDP Janasena Social Media Warning : ఈగోలు వర్సెస్ పొత్తు ధర్మం - టీడీపీ-జనసేన అధినేతల హెచ్చరికలతో ఆ సోషల్ సైన్యాలు దారికి వస్తాయా?
ఈగోలు వర్సెస్ పొత్తు ధర్మం - టీడీపీ-జనసేన అధినేతల హెచ్చరికలతో ఆ సోషల్ సైన్యాలు దారికి వస్తాయా?
Vizianagaram Politics: వైసీపీకి బిగ్ షాక్.. టీడీపీలో చేరిన చిన్న శ్రీను- మేనమామ బొత్స చేసిన ప్రకటనే కారణమా?
వైసీపీకి బిగ్ షాక్.. టీడీపీలో చేరిన చిన్న శ్రీను- మేనమామ బొత్స చేసిన ప్రకటనే కారణమా?
Chandrababu: డేటా సెంటర్లకు నీళ్లు అసలు సమస్యే కాదు, లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది: చంద్రబాబు
డేటా సెంటర్లకు నీళ్లు అసలు సమస్యే కాదు, లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది: చంద్రబాబు
Historic IND VS JPN Clash: వ‌ర‌ల్డ్ ఛాంపియన్ ఇండియాతో చారిత్రాత్మక పోరుకు జపాన్  సిద్ధం.. జ‌ట్టును ప్ర‌క‌టించిన ఆ దేశ క్రికెట్ బోర్డు
వ‌ర‌ల్డ్ ఛాంపియన్ ఇండియాతో చారిత్రాత్మక పోరుకు జపాన్  సిద్ధం.. జ‌ట్టును ప్ర‌క‌టించిన ఆ దేశ క్రికెట్ బోర్డు
గణేష్ చతుర్థి 2026: ఇంట్లో, ఆఫీసులో గణపతి ప్రతిష్ఠ నియమాలు వేరు!
గణేష్ చతుర్థి 2026: ఇంట్లో, ఆఫీసులో గణపతి ప్రతిష్ఠ నియమాలు వేరు!
Embed widget