CM Jagan Aerial Survey : గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే
CM Jagan Aerial Survey : గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే నిర్వహించారు. వరద ముంపు ప్రాంతాలను పరిశీలించారు.
CM Jagan Aerial Survey : గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం జగన్ జగన్ ఏరియల్ సర్వే చేశారు. వరద ప్రభావిత ప్రాంతాలను ముఖ్యమంత్రి పరిశీలిస్తున్నారు. సీఎం జగన్ వెంట హోంమంత్రి తానేటి వనిత ఉన్నారు. ఏరియల్ సర్వే అనంతరం సీఎం జగన్ అధికారులతో సమీక్షించనున్నారు. గోదావరి జిల్లాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే పూర్తి చేసుకుని తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. వరద సహాయక చర్యలపై అధికారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. వరద పరిస్థితులపై జిల్లాల కలెక్టర్లు, రాష్ట్ర స్థాయి అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.
విశాఖ నుంచి
విశాఖపట్నంలో వైఎస్సార్ వాహన మిత్ర కార్యక్రమంలో శుక్రవారం ఉదయం సీఎం జగన్ పాల్గొన్నారు. ఆ కార్యక్రమం ముగించుకుని విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్న సీఎం... అక్కడ నుంచి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఏరియల్ సర్వేకు బయలుదేరి, గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే నిర్వహించారు.