అన్వేషించండి

Roja : పదవి ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేసి మోసం - రోజాపై వైసీపీ కౌన్సిలర్ తీవ్ర ఆరోపణలు

Puttur YSRCP : పుత్తూరు మున్సిపల్ చైర్మన్ పదవి పేరుతో 40లక్షలు మోసం చేశారని రోజాపై సొంత పార్టీ నేతలు ఆరోపణలు గుప్పించారు. ఆధారాలు కూడా ఉన్నాయని పుత్తూరు కౌన్సిలర్ మీడియా సమావేశం పెట్టారు.

Roja :  ఏపీ మంత్రి రోజా, ఆమె సోదరుడిపై పుత్తూరు మున్సిపాలిటీకి చెందిన  మహిళా నేత భువనేశ్వరి తీవ్ర ఆరోపణలు చేశారు. పుత్తూరు మున్సిపల్ ఛైర్మన్ పదవిని అమ్మేసుకున్నారని ఆరోపించారు. రిజర్వేషన్ ఉండటంతో తనకు పదవి ఇస్తానని హామీ ఇచ్చారని.. తాను ఏకగ్రీవంగా గెలిచిన వెంటనే పదవిపై భరోసా ఇచ్చారన్నారు. మంత్రి రోజా మిగిలిన విషయాలను తన సోదరుడు కుమారస్వామితో మాట్లాడమని చెప్పారని.. ఛైర్మన్ పదవి కోసం ఆయన రూ.40 లక్షలు డిమాండ్ చేసినట్లు ఆరోపించారు.  తాను అడిగినంత డబ్బులు ఇచ్చినా పదవి మాత్రం దక్కలేదన్నారు.

రెండో విడతలో ఛైర్మన్ పదవి ఇస్తామని చెప్పారని.. కానీ ఇంతవరకు తనకు అవకాశం దక్కలేదన్నారు. ఇప్పుడు అడిగితే ఎన్నికల తర్వాత పదవి ఇస్తామని మాయ మాటలు చెబుతున్నారన్నారు. తమకు ఎన్నికల తర్వాత పదవి అవసరం లేదు.. తాము ఇచ్చిన డబ్బుల్ని తిరిగి ఇవ్వాలని అడిగితే.. మంత్రి రోజా, ఆమె సోదరుడి నుంచి కనీసం స్పందన లేదన్నారు. మంత్రికి మెసేజ్ చేసినా కనీసం స్పందన లేదన్నారు. దళిత మహిళను అయిన తనకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి జగన్‌ను కోరుతున్నానని  భవనేశ్వరి ప్రకటించారు. 

తాము డబ్బులు ఇచ్చినట్లు తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని కొన్ని వీడియోలను ప్రదర్శించారు. రోజా సోదరుడు కుమారస్వామి అనుచరుడు సత్య తన ఇంటికి వచ్చి డబ్బులు తీసుకెళ్లినట్లు ఆమె చెప్పారు. విడతల వారీగా డబ్బులు ఇచ్చామని.. ఒకసారి రూ.20 లక్షలు.. మరోసారి రూ.7 లక్షలు, ఇంకోసారి రూ.3 లక్షలు, మరో రూ.10లక్షలు ఇచ్చినట్లు వివరించారు. రోజా సోదరుడు తమకు తిరిగి రూ.29 లక్షలు మాత్రమే ఇస్తామన్నారని అవైనా ఇవ్వమంటే అవి కూడా ఇవ్వడం లేదన్నారు. రేపు, మాపు అంటూ తిప్పుకుంటున్నారన్నారు. మంత్రిపై ఫిర్యాదు చేస్తే పోలీసులు తీసుకునే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

పుత్తూరు కౌన్సెలర్ చేసిన ఆరోపణలపై మంత్రి రోజా కానీ.. ఆయన సోదరుడు కానీ స్పందించలేదు. పుత్తూరు మున్సిపాలిటీ నగరి నియోజకవర్గంలో భాగంగానే ఉంటుంది. ఇప్పటికే నగరి నియోజకవర్గంలో రోజాపై స్థానిక నేతలు తీవ్ర అవినీతి ఆరోపణలు చేస్తూ ఉంటారు. ఆమెకు పార్టీలోని  కీలక నేతలతో సఖ్యతగా ఉండరన్నపేరు ఉంది. ఈ క్రమంలో రోజాపై పార్టీకి చెందిన దళిత మహిళా కౌన్సిలర్ చేసిన ఆరోపణలు సంచలనంగా మారుతున్నాయి. 

రోజాకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఉందా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. వచ్చే ఎన్నికల్లో రోజానే పోటీ చేస్తారని అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఆమె నియోజకవర్గంలో ఇంకొక పేరు పరిశీలనకు రావడం లేదు. ఎవరి పేర్లూ ప్రచారంలోకి రావడం లేదు. దీంతో రోజాకు మళ్లీ సీటు ఖాయమన్న ప్రచారం జరుగుతోంది.  అయితే సొంత పార్టీ నేతల నుంచి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటూ ఉండటం.. రోజాకు సమస్యగా మారింది.                                                         

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Statue of Sacrifice: ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
Vizag Semi-ring Road: భోగాపురం నుండి రాంబిల్లి వరకు సెమీ రింగ్ రోడ్ - విశాఖ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
భోగాపురం నుండి రాంబిల్లి వరకు సెమీ రింగ్ రోడ్ - విశాఖ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
Vizag Firecracker Explosion: విశాఖలోని ఓ ఇంట్లో భారీ పేలుడు, తప్పిన పెను ప్రమాదం.. బాణసంచా నిల్వలపై స్థానికులు ఆగ్రహం
విశాఖలోని ఓ ఇంట్లో భారీ పేలుడు, తప్పిన పెను ప్రమాదం.. బాణసంచా నిల్వలపై స్థానికులు ఆగ్రహం
Potti Sriramulu Statue: నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Statue of Sacrifice: ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
Vizag Semi-ring Road: భోగాపురం నుండి రాంబిల్లి వరకు సెమీ రింగ్ రోడ్ - విశాఖ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
భోగాపురం నుండి రాంబిల్లి వరకు సెమీ రింగ్ రోడ్ - విశాఖ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
Hyderabad Crime News: చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
Dubai Airport Drone Attack: ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
Telangana Rains: తెలంగాణలో నేటి నుంచి 5 రోజులపాటు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
తెలంగాణలో నేటి నుంచి 5 రోజులపాటు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
Oscar 2026 : ఆస్కార్ వేడుకల్లో అరుదైన ఇన్సిడెంట్ - 14 ఏళ్ల తర్వాత టై... ఆ కేటగిరీలో ఇద్దరికి అవార్డ్
ఆస్కార్ వేడుకల్లో అరుదైన ఇన్సిడెంట్ - 14 ఏళ్ల తర్వాత టై... ఆ కేటగిరీలో ఇద్దరికి అవార్డ్
Tata Nexon లేదా Maruti Brezza .. EMI కట్టడంలో ఏ కారు చౌక? ఈ విషయాలు తెలుసుకోండి
Tata Nexon లేదా Maruti Brezza .. EMI కట్టడంలో ఏ కారు చౌక? ఈ విషయాలు తెలుసుకోండి
AP Cabinet Reshuffle: ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
Embed widget