అన్వేషించండి

Ntr Coin: 28న ఎన్టీఆర్ పేరుతో రూ. వంద నాణెం ఆవిష్కరణ - రాష్ట్రపతి చేతుల మీదుగా రిలీజ్ !

ఎన్టీఆర్ పేరుతో ముద్రించిన వంద నాణెన్ని ఆగస్టు 28న రాష్ట్రపతి విడుదల చేయనున్నారు.


Ntr Coin: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం నందమూరి తారక రామారావు పేరుతో రూ.100 నాణేన్ని ఈ నెల 28న విడుదల చేయనున్నారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఆయన పేరుతో రూ.100 నాణేన్ని ముద్రించింది. అయితే ఈ నాణేన్ని ఆగస్టు 28న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేయనున్నారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నాణేన్ని విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ కార్యాలయం నుంచి ఈ మేరకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది.   ఈ రూ.100 నాణేన్ని 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింకుతో తయారు చేశారు.  
  
ఈ వంద రూపాయల ఈ కాయిన్ 44 మిల్లీమీటర్లు చుట్టుకొలతతో ఉండే ఈ నాణెంలో సుమారు 50 శాతం వెండి అలాగే 40 శాతం రాగీ ఉండనుంది.అలాగే ఐదు శాతం నికెల్ ఐదు శాతం లోహాలు ఉంటాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ నాణేనికి ఓ వైపు మూడు సింహాలతో కూడిన అశోక చక్రం మరోవైపు ఎన్టీఆర్ చిత్రం దాని కింద శ్రీ నందమూరి తారక రామారావు శతజయంతి అని హిందీ,భాషలలో 1923-2023 అని ముద్రించినట్లుగా  ఆర్బీఐ తెలిపింది.  నాణెం విజుదలకు  కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ లీడర్ పురంధేశ్వరి ప్రత్యేక చొరవ తీసుకున్నారు.  
 
 చారిత్రక ఘటనలు ప్రముఖుల గుర్తుగా వెండి నాణెలు విడుదల చేయడం ఆనవాయితీ వస్తోంది. 1964 నుంచి నాణేలను విడుదల చేస్తోంది కేంద్రప్రభుత్వం. మొదటిసారి మాజీ ప్రధాని నెహ్రూ వెండి నాణెం విడుదల చేయడం గమనార్హం. ఆనవాయితీలో భాగంగా ఈ సారి ఎన్టీఆర్ పేరుతో వెండి నాణేన్ని విడుదల చేయడం పట్ల కుటుంబసభ్యులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
అటు సినిమా రంగంలో ఇంకెవరికీ అందనంత  ఎత్తుకు ఎదిగిన ఎన్టీఅర్, రాజకీయ రంగంలో ఇంకెవరికీ  సాధ్యం కాని విధంగా చరిత్ర  సృష్టించారు. ఆంధ్రుల ఆత్మ గౌరవం నినాదంతో 1982 మార్చి 29 వ తేదీ తెలుగు దేశం జెండాను ఎగరేశారు. నేను తెలుగు వాడిని, నాది తెలుగు దేశం పార్టీ, నా పార్టీ తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం  అని ప్రకటించి, పార్టీ స్థాపించి తొమ్మిది నెలలు తిరక్కుండానే, ఎంతో ఘన చరిత్ర ఉన్న, అంతవరకు రాష్ట్రంలో ఓటమి అన్నదే ఎరగని కాంగ్రెస్ పార్టీని ఓడించి అధికారంలోకి వచ్చారు.  ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తొలి కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ తొలి కాంగ్రేస్సేతర ప్రభుత్వాన్ని అప్రజాస్వామికంగా కూల్చిన ప్రధాని ఇందిరాగాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్టీఅర్ ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరాటం సాగించారు.

సిద్ధాంత పరంగా ఉత్తర దక్షిణ దృవాల వంటి బీజేపీ, కమ్యూనిస్టులను ప్రజాస్వామ్య స్పూర్తి ధారలో  ఏకం చేశారు. అందుకే ఎన్టీఆర్ సారధ్యంలో విజయం సాధించిన  ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరాటం భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక  మైలు రాయిలా చిరస్థాయిగా  నిలిచి పోయింది. ఎన్టీఆర్ అనే మూడక్షరాలను మకుటం లేని మహారాజుగా చరిత్ర పుటల్లో నిలబెట్టింది.  

టాప్ హెడ్ లైన్స్

AP TET 2026 Hall Tickets Download:ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
AP Govt Employees PRC IR Demands: ఏపీలో ఉద్యోగుల పీఆర్‌సీ రాజకీయం - చంద్రబాబు మార్క్ ఐఆర్ వ్యూహం.. ఆశల్లో ఉద్యోగ లోకం!
ఏపీలో ఉద్యోగుల పీఆర్‌సీ రాజకీయం - చంద్రబాబు మార్క్ ఐఆర్ వ్యూహం.. ఆశల్లో ఉద్యోగ లోకం!
Breaking News: విజయవాడలోని మధురానగర్‌లో బిర్యాని షాపు దగ్ధం! 
విజయవాడలోని మధురానగర్‌లో బిర్యాని షాపు దగ్ధం! 
YSRCP Nellore Politics: నెల్లూరు వైసీపీలో తీవ్ర సంక్షోభం - జగన్ సంచలన నిర్ణయం?
నెల్లూరు వైసీపీలో తీవ్ర సంక్షోభం - జగన్ సంచలన నిర్ణయం?

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP TET 2026 Hall Tickets Download:ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
AP Govt Employees PRC IR Demands: ఏపీలో ఉద్యోగుల పీఆర్‌సీ రాజకీయం - చంద్రబాబు మార్క్ ఐఆర్ వ్యూహం.. ఆశల్లో ఉద్యోగ లోకం!
ఏపీలో ఉద్యోగుల పీఆర్‌సీ రాజకీయం - చంద్రబాబు మార్క్ ఐఆర్ వ్యూహం.. ఆశల్లో ఉద్యోగ లోకం!
Jhandu Kumar In Commonwealth Games: కూరగాయలు అమ్మాడు, రిక్షా నడిపాడు, ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని తీసుకొచ్చాడు!
కూరగాయలు అమ్మాడు, రిక్షా నడిపాడు, ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని తీసుకొచ్చాడు!
Prime Minister Modi:
"రీల్స్ చేయండి, ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉండండి" కేబినెట్ మంత్రులకు మరోసారి ప్రధాని మోదీ సలహా 
Modi video:
"స్పందించి సలహాలు ఇచ్చిన వారికి ధన్యవాదాలు" మరో సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన ప్రధానమంత్రి
Jana Nayagan Box Office Collection Day 2: 'జన నాయకుడు' కలెక్షన్లు... రెండో రోజు ఢమాల్... విజయ్ సినిమాకు భారీ డ్రాప్! 
కలెక్షన్లలో విజయ్‌కు భారీ దెబ్బ... వంద కోట్ల క్లబ్బులో 'జన నాయకుడు'... కానీ రెండో రోజు అంతేనా?
Revanth Reddy Indiramma Housing: హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
కన్వర్ యాత్రలో నిజమైన ప్రేమ: దివ్యాంగుడైన భర్తను 180 కి.మీ మోసిన భార్య!
కన్వర్ యాత్రలో నిజమైన ప్రేమ: దివ్యాంగుడైన భర్తను 180 కి.మీ మోసిన భార్య!
Embed widget