అన్వేషించండి

Case On Somu Veerraju : పోలీసులపై దౌర్జన్యం - సోము వీర్రాజుపై కేసులు నమోదు !

పోలీసులపై దౌర్జన్యం చేసిన ఘటనలో సోము వీర్రాజుపై కేసు నమోదు చేశారు. రెండు సెక్షన్ల కింద కేసులు పెట్టారు.


Case On Somu Veerraju :   ఆంధ్రప్రదేశ్  బీజేపీ చీఫ్ సోము వీర్రాజుపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల విధి నిర్వహణను అడ్డుకుని దౌర్జన్యం చేసినందుకు రెండు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.  బుధవారం ఉదయం కోనసీమ జిల్లా రావులపాలెం వద్ద భారీ కంటెయినర్ పెట్టి సోము వీర్రాజు కారును పోలీసులు అడ్డుకున్నారు. వారితో వాగ్వివాదానికి దిగిన బీజేపీ నేత తన దారికి అడ్డు తప్పుకోవాలంటూ పోలీసులను తోసేశారు. దీంతో పోలీసులకూ, సోము వీర్రాజుకు మధ్య కాసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఉద్రిక్తతను పోలీసులు వీడియో చిత్రీకరించారు. 

అమలాపురం అల్లర్ల బాధితులను పరామర్శించేందుకు  రావులపాలెం నుంచి జొన్నాడ జంక్షన్ వైపు వెళ్తుండగా సోమువీర్రాజు కారుని పోలీసులు నిలిపేశారు. 144 సెక్షన్ అమల్లో ఉందని వెళ్లడానికి లేదన్నారు.  ఆయనను అడ్డుకునేందుకు కారుకు ముందు కంటెయినర్ నిలపడంతో ఆయన వాహనానికి దారి లేదు. తాను ఎస్పీకి సమాచారం ఇచ్చి వెళ్తున్నానని, అయినా మీరు నన్ను ఎందుకు అడ్డుకున్నారో చెప్పాలంటూ పోలీసులను సోము వీర్రాజు ప్రశ్నించారు. ఇది మంచి పద్ధతి కాదని, శాంతియుతంగా వెళ్లే వారిని అడ్డుకోదని చెప్పగా పోలీసులు వినిపించుకోకపోవడంతో వారిని పక్కకు తోసేసి డ్రైవర్ వద్దకు వెళ్లారు. 
 
వ్యక్తిగత స్వేచ్ఛను హరించే హక్కు మీకు ఎవరిచ్చారని సోము వీర్రాజు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.  పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నామని ఉద్రిక్త పరిస్థితులను నిర్మాణం చేయదలచుకోలేదని ఎస్పీ స్థాయి అధికారికి వివరణ ఇచ్చిన తర్వాత కూడా ఈ ఆంక్షలెందుని ప్రశ్నించారు. కార్యకర్తలు కుటుంబాన్ని పరామర్శిస్తుంటే పోలీసు శాఖ ద్వారా ఈ దుందుడుకు చర్యలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పాలన, అసమర్ధతను బయటపెడుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏ క్షణంలో ఏం జరుగుతుందో ప్రభుత్వ నిఘా వర్గాలకు కూడా తెలియని స్థాయికి జగన్ పాలన దిగజారిందనే విషయాన్ని మీ చర్యలు అద్దం పడుతున్నాయంటూ సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సోము వీర్రాజు పోలీసులపై దౌర్జన్యం చేస్తున్న సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో పోలీసులు సాయంత్రం న్యాయసలహా తీసుకుని రెండు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే గతంలో ఇంత కంటే దారుణంగా మంత్రి సీదిరి అప్పలరాజు పోలీసుల్ని తిట్టారని కానీ ఆయనపై కేసులు నమోదు చేయలేదని.. బీజేపీ నేతుల గుర్తు చేస్తున్నారు.  వైఎస్ఆర్‌సీపీ నేతలకు వర్తించని చట్టం సోము వీర్రాజుకు ఎలా వర్తిస్తుందని ప్రశ్నిస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
AP CM Chandrababu Speech: ఎల్‌నినో ప్రభావంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. అక్కడ మాత్రమే వరి వేయాలని రైతులకు సూచనలు
El Nino ప్రభావంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. అక్కడ మాత్రమే వరి వేయాలని రైతులకు సూచనలు
Addanki Police Controversy: అద్దంకి పోలీసు వాహనంలో గంజాయి దొరికిందని ప్రచారం! ఖండించిన ఖాకీలు! రెడ్‌ బుక్ రాజ్యాంగమంటూ జగన్ ధ్వజం!
అద్దంకి పోలీసు వాహనంలో గంజాయి దొరికిందని ప్రచారం! ఖండించిన ఖాకీలు! రెడ్‌ బుక్ రాజ్యాంగమంటూ జగన్ ధ్వజం!
BJP All Cells Joint Coordinator: విద్యార్థి నాయకుడి నుంచి జాతీయ పదవి దాకా.. బీజేపీ ఆల్ సెల్స్ జాయింట్ కో-ఆర్డినేటర్‌గా ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి నియామకం !
విద్యార్థి నాయకుడి నుంచి జాతీయ పదవి దాకా.. బీజేపీ ఆల్ సెల్స్ జాయింట్ కో-ఆర్డినేటర్‌గా ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి నియామకం !

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget