అన్వేషించండి

Pawan Campaign : కోలుకున్న పవన్ కల్యాణ్ - ఆదివారం నుంచి ఉత్తరాంధ్ర ప్రచారం !

Andhra News : ఆదివారం నుంచి ఉత్తరాంధ్రలో పవన్ ప్రచారం చేయనున్నారు. జ్వరం నుంచి పూర్తిగా కోలుకున్నారు.

Pawan will campaign in Uttarandhra from Sunday : జ్వరం బారిన పడటంతో తాత్కలికంగా ప్రచారాన్ని నిలిపి వేసిన పవన్ కల్యాణ్  మళ్లీ ఆదివారం నుంచి ప్రారంభించనున్నారు.  ఏప్రిల్ 7 నుంచి పవన్ కల్యాణ్ వారాహి విజయభేరి యాత్ర ఉత్తరాంధ్రలో నిర్వహించనున్నారు. స్వల్ప అస్వస్థత కారణంగా పవన్ ఎన్నికల ప్రచారానికి బ్రేక్ పడింది.  యాత్రలో భాగంగా అనకాపల్లిలో 7న సభ నిర్వహించనున్నారు. 8న ఎలమంచిలి, 9న పిఠాపురంలో సభ నిర్వహించనున్నారు. ఆ తరువాత జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న నెల్లిమర్ల, అనకాపల్లి, యలమంచిలి నియోజకవర్గాల్లో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. పిఠాపురం తర్వాత ఆయన తెనాలిలో ప్రచారం చేయాల్సి ఉంది. ఉత్తరాంధ్ర  పర్యటన తర్వాత తెనాలి సభలో ప్రసంగించే అవకాశం ఉంది. 

 

తెలుగుదేశం జనసేన బీజేపీ పార్లమెంటు స్థాయి ఉమ్మడి సమన్వయ సమావేశాలు ప్రారంభమయ్యాయి.  రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్లమెంట్ స్థాయిలో ఉమ్మడి సమన్వయ సమావేశాలు నిర్వహించనున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం పై చర్చించి కూటమి కార్యాచరణను రూపొందించుకోనున్నారు. ఎన్నికలు సన్నద్ధత, ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్, కొత్త ఓటర్లు, ఇతర ప్రాంతాల్లో నివసించే ఓటర్లు, పోస్టల్ ఓట్లు, బూత్ ఏజెంట్ లు తదితర అంశాలపై చర్చించనున్నారు.                                                                                    

కూటమి తరపున భారీ బహిరంగ సభలు నిర్వహణ, సామాజిక మాధ్యమాల్లో ఎంపీ ఎమ్యెల్యే అభ్యర్థులు ప్రచారం పై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఎంపీ అభ్యర్థి మేనిఫెస్టో ఇతర స్థానిక సమస్యలపైనా చర్చించనున్నారు. కూటమి పార్లమెంట్​ స్థాయి అభ్యర్థులు, పార్టీ అధ్యక్షులు పాల్గొనున్నాంట్లు సమాచారం. అంతే కాకుండా 7 అసెంబ్లీ స్థానాల అభ్యర్థులు, 7 నియోజకవర్గ ఇన్​ఛార్జీలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.                                                 

పవన్ కల్యాణ్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయనున్నారు. మొదట జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న చోట ప్రచారం పూర్తి చేస్తారు. తర్వాత  నామిషన్లు ప్రారంభమవగానే..  ఉమ్మడి ప్రచార వ్యూహాలను ఖరారు చేస్తారు.                                                                        

టాప్ హెడ్ లైన్స్

Aggipetti Macha : ఆగిన అగ్గిపెట్టె మచ్చ అంత్యక్రియలు - ఆస్తి వివాదాలే కారణమా?
ఆగిన అగ్గిపెట్టె మచ్చ అంత్యక్రియలు - ఆస్తి వివాదాలే కారణమా?
Chandrababu Naidu Meets PM Modi: ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
Vijayawada Police: విదేశీయుల ఆశ్రయంపై పోలీసుల నిఘా.. నిబంధనలు అతిక్రమిస్తే భారీ జరిమానా, జైలు శిక్ష
విదేశీయుల ఆశ్రయంపై పోలీసుల నిఘా.. నిబంధనలు అతిక్రమిస్తే భారీ జరిమానా, జైలు శిక్ష
Chandrababu Naidu CII Partnership Summit: గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా ఏపీ - న్యూఢిల్లీ సీఐఐ సదస్సులో సీఎం చంద్రబాబు ప్రకటన!
గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా ఏపీ - న్యూఢిల్లీ సీఐఐ సదస్సులో సీఎం చంద్రబాబు ప్రకటన!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu Meets PM Modi: ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Trump TV Ads: అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
Kanpur Fraud Case: ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Embed widget