అన్వేషించండి

Varahi Yatra : మరో వారం విశాఖలోనే వారాహియాత్ర - కీలక నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి !

పవన్ కల్యాణ్ మరో వారం రోజుల పాటు విశాఖలోనే పర్యటించనున్నారు. వారాహియాత్రలో భాగంగా పలు నియోజకవర్గాలకు వెళ్తారు.

 

Varahi Yatra :  జనసేన అధినేత పవన్ కల్యాణ్.. విశాఖలో వారాహియాత్రను జగదాంబ సెంటర్‌లో బహిరంగసభను నిర్వహించడం ద్వారా ప్రారంభించారు. మరో వారం పాటు విశాఖలోనే వారాహియాత్ర సాగుతుంది. ఆ తర్వాత  పరిస్థితిని బట్టి షెడ్యూల్ ఖరారు చేసుకుంటారు. 

వారాహి యాత్ర ఎక్కడెక్కడంటే ?                                         
 
వారాహియాత్ర శనివారం పెందుర్తి నియోజకవర్గంలో జరుగుతుంది.  వాలంటీర్ చేతిలో హత్యకు గురైన వృద్దురాలు వరలక్ష్మి కుటుంబ సభ్యులను పవన్ కల్యాణ్ పరామర్శిస్తారు.  అదే రోజు సాయంత్రం 4 గంటలకు విశాఖ నగరంలో సి.ఎన్.బి.సి. ల్యాండ్స్ ప్రాంతాన్ని సందర్శిస్తారు. తర్వాత ఆదివారం  వారాహి విజయ యాత్రలో భాగంగా గాజువాక నియోజకవర్గంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. 14వ తేదీన సోమవారం  ఉదయం 11 గంటలకు అనకాపల్లి నియోజకవర్గ పరిధిలోని విస్సన్నపేటకు వెళ్తారు. అక్కడ ఆక్రమణకు గురైన భూములను పరిశీలిస్తారు.  15వ తేదీ  స్వాతంత్ర్య దినోత్సవం కావడంతో మంగళగిరి కేంద్ర కార్యాలయంలో జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. 16వ తేదీ బుధవారం  విశాఖ నగరం భీమిలి నియోజకవర్గంలో పర్యటిస్తారు.  ధ్వంసానికి గురవుతున్న ఎర్రమట్టి దిబ్బలను సందర్శిస్తారు. 17వ తేదీ  గురువారం విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన జనవాణి కార్యక్రమంలో పాల్గొంటారు. 18వ తేదీన జరిగే కార్యక్రమాల వివరాలను తర్వాత ప్రకటిస్తారు. 

విజయవంతానికి ప్రత్యేక జాగ్రత్తలు                                                     

పవన్ వారాహి యాత్రను విజయవంతం చేయడానికి పార్టీ నాయకులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  నాదెండ్ల మనోహర్ శుక్రవారం విశాఖపట్నం ముఖ్య నేతలతో భేటీ నిర్వహించి కార్యక్రమాలను సమీక్షించారు. జగదాంబ కూడలిలో జరిగిన బహిరంగ సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరినీ ఈ సందర్భంగా అభినందించారు. పవన్ కళ్యాణ్ పర్యటన షెడ్యూల్ పై చర్చించారు.  

 

 
విద్వేష ప్రసంగం చేశారని పవన్‌కు ఇప్పటికే పోలీసులు నోటీసులు                                  

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు విశాఖ పోలీసులు నోటీసులు జారీ చేశారు.  వారాహి యాత్రలో భాగంగా గురువారం జరిగిన సభలో పవన్ కల్యాణ్ రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారని పోలీసులు  నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు విశాఖ తూర్పు ఏసీపీ పవన్ కల్యాణ్ కు నోటీసులు అందించారు. బహిరంగ సభలో పవన్ నిబంధనలు ఉల్లంఘించారని.. పవన్ ఇలా వ్యవహరించి ఉండకూడదని నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు.  

టాప్ హెడ్ లైన్స్

Breaking News: మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
AP CM Chandrababu Speech: ఎల్‌నినో ప్రభావంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. అక్కడ మాత్రమే వరి వేయాలని రైతులకు సూచనలు
El Nino ప్రభావంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. అక్కడ మాత్రమే వరి వేయాలని రైతులకు సూచనలు
Addanki Police Controversy: అద్దంకి పోలీసు వాహనంలో గంజాయి దొరికిందని ప్రచారం! ఖండించిన ఖాకీలు! రెడ్‌ బుక్ రాజ్యాంగమంటూ జగన్ ధ్వజం!
అద్దంకి పోలీసు వాహనంలో గంజాయి దొరికిందని ప్రచారం! ఖండించిన ఖాకీలు! రెడ్‌ బుక్ రాజ్యాంగమంటూ జగన్ ధ్వజం!
BJP All Cells Joint Coordinator: విద్యార్థి నాయకుడి నుంచి జాతీయ పదవి దాకా.. బీజేపీ ఆల్ సెల్స్ జాయింట్ కో-ఆర్డినేటర్‌గా ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి నియామకం !
విద్యార్థి నాయకుడి నుంచి జాతీయ పదవి దాకా.. బీజేపీ ఆల్ సెల్స్ జాయింట్ కో-ఆర్డినేటర్‌గా ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి నియామకం !

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget