Pawan Kalyan: పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు - బన్నీ పుష్ప సినిమా గురించేనా?
Pawan Kalyan in Karnataka: డిప్యూటీ సీఎం పవన్ ఈ వ్యాఖ్యలను అల్లు అర్జున్ పుష్ప సినిమాను ఉద్దేశించే చేశారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ అయింది.
Telugu News: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) (Pawan Kalyan) సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో సినిమాల్లో హీరోలు అడవులను కాపాడేలా వ్యవహరించి హీరోయిజం చూపేవారని కానీ, ఇప్పుడు పరిస్థితి మారిందని అన్నారు. ఇప్పుడు అడవుల్లో చెట్లను నరికి స్మగ్లింగ్ చేయడం హీరోయిజం అయిందని వ్యాఖ్యానించారు. తాను సినీ రంగానికి చెందిన వాడినే అయినప్పటికీ పరిస్థితులు ఎలా మారిపోయాయో అర్థం చేసుకోవాలని అన్నారు. ఈ 40 ఏళ్లలో ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం అంటూ పవన్ ప్రశ్నించారు. గురువారం (ఆగస్టు 8) కర్ణాటక పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఈ వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ అయింది. గురువారం పవన్ బెంగళూరులో కర్ణాటక అటవీశాఖ మంత్రి ఈశ్వర్ బి. ఖండ్రేతో భేటీ అయ్యారు.
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చేసిన ఈ వ్యాఖ్యలను అల్లు అర్జున్ (Allu Arjun) పుష్ప (Pushpa 2 Movie) సినిమాను ఉద్దేశించే చేశారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. పుష్ప (Pushpa Movie) సినిమా పూర్తిగా ఎర్రచందనం స్మగ్లింగ్ చుట్టే తిరుగుతుంది. అందులో హీరో అయిన అల్లు అర్జున స్మగ్లింగ్ చేస్తూ హీరోయిజం ప్రదర్శిస్తుంటాడు దీంతో అల్లు అర్జున్ (Allu Arjun)ను టార్గెట్ చేసి పవన్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు భావిస్తున్నారు.
పైగా అల్లు అర్జున్ (Allu Arjun)కు మెగా కుటుంబంతో బేధాభిప్రాయాలు ఉన్నట్లుగా ప్రచారం ఉంది. గత ఎన్నికల సమయంలో అల్లు అర్జున పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కోసం పిఠాపురానికి ప్రచారానికి రాకుండా.. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి కోసం ప్రచారానికి నంద్యాల వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ పరిణామం కూడా అప్పట్లో సంచలనం అయింది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా పవన్ కల్యాణ్ (Pawan Kalyan).. అల్లు అర్జున్ (Allu Arjun) ను ఉద్దేశించే పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారని అంతా అనుకుంటున్నారు.
ఏనుగులు, ఎర్ర చందనం గురించి చర్చ
చిత్తూరు జిల్లా పరిధితో పాటు ఇటు పార్వతీపురం ప్రాంతంలో ఏనుగుల సమస్య ఇబ్బందికరంగా మారింది. అవి ఊళ్ళ మీదకు వచ్చి రైతులు కష్టపడి పండించుకున్న పంటలను నాశనం చేస్తున్నాయి. ఫలితంగా ఎంతో మంది నష్టపోతుండగా.. కొంత ప్రాణ హాని కూడా ఉంటోంది. ఇలా వచ్చే ఏనుగులను తిరిగి అడవిలోకి తరమడం కోసం కుంకీ ఏనుగులు అవసరం అని భావిస్తున్నారు. ఆ కుంకీ ఏనుగులు కర్ణాటక వద్ద ఉండగా.. 6 కుంకీ ఏనుగులు మన రాష్ట్రానికి ఇచ్చేలా కర్ణాటక అటవీ శాఖను పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కోరారు. ఈ విషయంపై ఆ రాష్ట్ర అటవీశాఖ మంత్రి ఈశ్వర్ బి. ఖండ్రేతో చర్చించారు.
ఇంకా ఎర్రచందనం అక్రమ రవాణా విషయంలో కూడా ఇరువురు చర్చలు జరిపినట్లు తెలిసింది. స్మగ్లింగ్ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఖండ్రేతో పవన్ చర్చలు జరిపారు. పొరుగు రాష్ట్రాల సహకారంతో ఎర్ర చందనం దోపిడీని అరికట్టవచ్చని పవన్ తెలిపారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ కట్టడి కోసం కలిసి పని చేయాలని కోరారు.