అన్వేషించండి

Pawan Kalyan : టీడీపీకి జనసేన బీ టీమా ? - పవన్ ఇచ్చిన కౌంటర్ ఇదే

టీడీపీకి జనసేన బీ టీం అంటూ వస్తున్న విమర్శలకు పవన్ కల్యాణ్ కౌంటర్ ఇచ్చారు. సొంత పార్టీ వాళ్లు కూడా నమ్మడం లేదని సెటైర్ వేశారు.

 

Pawan Kalyan  :   రాజకీయాల్లో ప్రలోభాలను దాటుకుని వెళ్తున్నామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. టీడీపీ పార్టీకి జనసేన బీ టీం అంటూ వైసీపీ నేతలు చేసిన ఆరోపణలను కొట్టిపారేశారు. బయట వాళ్లు అంటే పర్వాలేదు కానీ.. సొంత వాళ్లు కూడా అనుమానంగా చూస్తున్నారని సెటైర్ వేశారు. తాడేపల్లి  గూడెంలో జనసేన నాయకులు వీర మహిళలతో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ..పలు అంశాలపై మాట్లాడారు.                        

రాజకీయాల్లో ఎదురుదాడి అలవాటు చేసుకోవాలని, మనం ఏ తప్పు చేయనప్పుడు భయపడే పని లేదని, అద్భుతాలు చేయాలని రాజకీయాల్లో రాలేదని, పేదల జీవితాలు మార్చాలని వచ్చానన్నారు. వ్యవస్థలోని లోపాలను సరిదిద్దాడానికే పోరాడుతున్నానని, తానూ, తన కుటుంబం ఎందుకు విమర్శలు ఎదుర్కొవాలని పవన్ ఎదురు ప్రశ్నించారు. సమాజంపై ప్రేమతో తన ప్రాణాన్ని కుటుంబానికి పణంగా పెట్టి వచ్చానని పవన్ స్పష్టం చేశారు. పంచాయతీ వ్యవస్థ ఉన్నప్పుడు సచివాలయ వ్యవస్థ దేనికి అని పవన్ ప్రశ్నించారు. సమాజంలో అవినీతి అనేది నిత్యకృత్యమైపోయిందని, తన అభిమాని అయినాసరే… మాన ప్రాణాలకు భంగం కలిగిస్తే శిక్ష తప్పదని హెచ్చరించారు.                                        
  
నన్ను అన్నా.. నా కుటుంబాన్ని అన్నా నాకు కోపం రాదు.. ప్రజలను అంటే మాత్రం నాకు కోపం వస్తుందన్నారు.   జనసేన కార్యకర్తను ఒక మహిళా సీఐ చెంప చెళ్లుమనిపించడం చాలా బాధేసింది. జగన్ సోదరి పార్టీ పెట్టారు.. ఇప్పుడు కాంగ్రెస్ లో కలిపేస్తున్నారని అంటున్నారు. మీరు అలా చేస్తారా అని నన్ను అడిగారు. పార్టీని నడపడం చాలా కష్టం.. వేల కోట్లు ఉంటే చాలదు. సైద్ధాంతిక బలం, పోరాటపటిమ, రాజ్యాంగంపై అవగాహన ఉంటేనే పార్టీని నడపగలం. అత్యవసరంగా అధికారంలోకి రావాలని నేను అనుకోవడం లేదని స్పష్టం చేశారు. 
  
అలా అనుకుంటే కాంగ్రెస్‌లోకి వెళ్లి ఏదో పదవి తెచ్చుకునే వాడిని. జగ్గుభాయ్‌ను ఇంటికి పంపే రోజు వచ్చింది. విప్లవకారుడు రాజకీయ నాయకుడు అయితే ఎలా ఉంటుందో చూపిస్తా. కొందరు వాలంటీర్లు నా దిష్టిబొమ్మలను చెప్పులతో కొట్టి, దగ్ధం చేస్తుంటే.. అటువంటి వాటిని అసలు పట్టించుకోను. వైఎస్సార్‌ను అందరూ దేవుడంటారు.. ఆయన దేవుడు అయితే అంతమంది ఐఏఎస్‌లు జైలుకు ఎందుకెళ్ళారు. ఆయన అవినీతి చెయ్యబట్టే కదా.. ప్రభుత్వం మారితే కొందరు వాలంటీర్లు ఆ విధంగానే ఇరుక్కుంటారు’’ అంటూ సీఎం జగన్‌పై పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘నా పెళ్లాన్ని అంటే పట్టించుకోను.. నా వివాహాలకు సంబంధించి విడాకులు తీసుకున్నా.. జగన్ మాత్రం నా పెళ్లిళ్లు పట్టుకుని అక్కడే ఉన్నాడంటూ మండిపడ్డారు.  సమావేశంలో జగన్ ను జగ్గూభాయ్ అంటూ సంబోధించారు.               

టాప్ హెడ్ లైన్స్

Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Arpitha Mohithe: తెలుగు బుల్లితెర వారసురాలు.. అర్పిత గురించి మీకు తెలియని విషయాలు!
తెలుగు బుల్లితెర వారసురాలు.. అర్పిత గురించి మీకు తెలియని విషయాలు!
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Embed widget