అన్వేషించండి

YS Viveka murder Case : వివేకా పోస్టుమార్టం రిపోర్టుపై సీబీఐ పరిశీలన.. దస్తగిరిపై కొత్తగా అనుమానాలు..!

వివేకా హత్య కేసులో క్లూ కోసం సీబీఐ అధికారులు పరిశోధన కొనసాగిస్తున్నారు. పోస్టుమార్టం చేసిన డాక్టర్‌ని పిలిపించి ప్రశ్నించారు. డ్రైవర్ దస్తగిరి స్టేట్‌మెంట్ రికార్డు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.


వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు  పోస్టు మార్టం నివేదికను పరిశీలిస్తున్నారు. పోస్ట్‌మార్టం చేసిన పులివెందుల ఆస్పత్రి వైద్యుడు శ్రీనివాసనాయక్‌ను పిలిపించి మరిన్ని వివరాలు తెలుసుకున్నారు. పోస్టుమార్టం నివేదికలో ఉన్న అంశాలపై తమకు ఉన్న అనుమానాలను నివృతి చేసుకున్నారు. వివేకా హత్య కేసులో పోస్టుమార్టం నివేదిక అత్యంత కీలకం. ఆయన మొదట గుండెపోటుతో చనిపోయారన్న ప్రచారం జరిగింది. ఆ తరవాత కుటుంబసభ్యులు కూడా అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. పోస్టుమార్టం అవసరం లేదని వైద్యులకు సమాచారం ఇచ్చారు. అయితే హైదరాబాద్‌లో ఉన్న వివేకా కుమార్తె వైఎస్ సునీత పట్టుబట్టడంతో  పోస్టుమార్టం చేయించారు. అప్పుడే వైఎస్ వివేకా మృతదేహానికి ఉన్న గాయాలన్నీ బయటపడ్డాయి. అప్పటి వరకూ గుండెపోటుగానే ప్రచారం జరిగింది. ఆ తర్వాత అనుమానాస్పద మృతి అని చెప్పుకున్నారు. పోస్టుమార‌్టం రిపోర్టులో అవన్నీ పదునైన ఆయుధంతో దాడి చేసినట్లుగా తేల్చడంతో హత్యగా నిర్ధారించారు. ఈ కారణంగా సీబీఐ అధికారులు పోస్టుమార్టం నివేదికపై ప్రత్యేకమైన పరిశీలన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. 

మరో వైపు తాము అరెస్ట్ చేసిన ఒకే ఒక్క నిందితుడు సునీ‌ల్ యాదవ్‌ను పది రోజుల పాటు కస్టడీకి తీసుకున్నా ఒక్క సమాచారం రాబట్టలేకపోయారేమో కానీ.. ఆయనకు నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహించాలన్న లక్ష్యంతో సీబీఐ అధికారులు ఉన్నారు. ఈ మేరకు కోర్టులో పిటిషన్ వేసి అనుమతి కోసం ఎదురు చూస్తున్నారు.  జమ్మలమడుగు మేజిస్ట్రేట్ వాదనలను వచ్చే నెల ఒకటో తేదీన వినననున్నారు. సునీల్ యాదవ్ కస్టడీలో ఉండగా చెప్పిన విషయాల ప్రకారం కొన్ని సోదాలు నిర్వహించి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లుగా ప్రచారం జరిగింది. కానీ సీబీఐ అధికారులు ధృవీకరించలేదు.

మరోవైపు, ఇదే కేసులో మరో అనుమానితుడైన వివేకా డ్రైవర్ దస్తగిరితో వాంగ్మూలం ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయనను ప్రొద్దుటూరు తీసుకెళ్లినా పని కాకపోవడంతో మళ్లీ కడపకు తీసుకొచ్చారు. వివేకా చనిపోయినప్పుడు ఆయన డ్రైవరే కొట్టి చంపాడని వివేకా రాసినట్లుగా ఓ లేఖ బయటకు వచ్చింది. కొట్టి చంపుతూంటే ఎలా లేఖ రాస్తారన్న అనుమానాలు అప్పట్లో బయటకు వచ్చాయి. ఆ లేఖను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ఆ లేఖను ఎవరు రాశారో  రిపోర్ట్‌ వచ్చిందో లేదో స్పష్టత లేదు. వైఎస్ వివేకా కేసులో ఆధారాలు ఇస్తే రూ. ఐదు లక్షలు ఇస్తామంటూ పేపర్ ప్రకటన ఇచ్చిన తర్వాత సీబీఐ దర్యాప్తుపై పలువురు విమర్శలు చేస్తున్నారు. అత్యంత క్లిష్టమైన కేసుల్ని కూడా సాదాసీదా పోలీసులు చేధిస్తూంటే .. కాస్త దృష్టి పెడితే సులువుగా పరిష్కారమయ్యే కేసును ఎందుకు సాగదీస్తున్నారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. 

 

టాప్ హెడ్ లైన్స్

Vijayasai Reddy: ఏపీని కమ్మ, క్రిస్టియన్లు పాలిస్తున్నారు.. మేం గెలిస్తే ఆ కులాలకే సీఎం పదవి: విజయసాయిరెడ్ది
ఏపీని కమ్మ, క్రిస్టియన్లు పాలిస్తున్నారు.. మేం గెలిస్తే ఆ కులాలకే సీఎం పదవి: విజయసాయిరెడ్ది
Kuppam Greenfield Airport: కుప్పం గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టుకు భూమి ఇచ్చేందుకు టీటీడీ బోర్డు అంగీకారం
కుప్పం గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టుకు భూమి ఇచ్చేందుకు టీటీడీ బోర్డు అంగీకారం
Tirupati News: బ్రహ్మోత్సవాల్లో అపశ్రుతి.. సాంబారు మీద పడి 12 మందికి గాయాలు
బ్రహ్మోత్సవాల్లో అపశ్రుతి.. సాంబారు మీద పడి 12 మందికి గాయాలు
AP Local Body Elections 2026: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు - తాడేపల్లి హుకుం.. క్షేత్రస్థాయిలో నైరాశ్యం! వైఎస్సార్‌సీపీలో రాజకీయ సంక్షోభం కనిపిస్తోందా?
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు - తాడేపల్లి హుకుం.. క్షేత్రస్థాయిలో నైరాశ్యం! వైఎస్సార్‌సీపీలో రాజకీయ సంక్షోభం కనిపిస్తోందా?

వీడియోలు

Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే
Ravindra Jadeja for 2027 World Cup | జడేజా స్థానంపై స్పష్టతనిచ్చిన కోచ్ బహుతులే
Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
October Rule Changes: అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. బ్యాంక్ FD, LPG లో మార్పులు, ఎన్‌పీఎస్ కొత్త స్కీమ్
అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. బ్యాంక్ FD, LPG లో మార్పులు, ఎన్‌పీఎస్ కొత్త స్కీమ్
Hyderabad dating app scam: డేటింగ్ పేరుతో పబ్‌కు తీసుకెళ్లి 29వేలు బిల్ కట్టించింది. హైదరాబాద్ టెకీకి షాక్ ఇచ్చిన సుందరి
డేటింగ్ పేరుతో పబ్‌కు తీసుకెళ్లి 29వేలు బిల్ కట్టించింది. హైదరాబాద్ టెకీకి షాక్ ఇచ్చిన సుందరి
AP Local Body Elections 2026: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు - తాడేపల్లి హుకుం.. క్షేత్రస్థాయిలో నైరాశ్యం! వైఎస్సార్‌సీపీలో రాజకీయ సంక్షోభం కనిపిస్తోందా?
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు - తాడేపల్లి హుకుం.. క్షేత్రస్థాయిలో నైరాశ్యం! వైఎస్సార్‌సీపీలో రాజకీయ సంక్షోభం కనిపిస్తోందా?
Telangana Pending Bills Protests: భట్టి చాంబర్ ముందు కాంట్రాక్టర్లు, ఉద్యోగుల రోజువారీ ధర్నాలు - తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిందా?
భట్టి చాంబర్ ముందు కాంట్రాక్టర్లు, ఉద్యోగుల రోజువారీ ధర్నాలు - తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిందా?
Kalki Bhagavan Passes Away: ఆధ్యాత్మిక గురువు కల్కి భగవాన్ కన్నుమూత.. నేడు తిరుపతి జిల్లాకు పార్థివదేహం తరలింపు
ఆధ్యాత్మిక గురువు కల్కి భగవాన్ కన్నుమూత.. నేడు తిరుపతి జిల్లాకు పార్థివదేహం తరలింపు
Athletics Gold Rush: ట్రాక్ పై భారత మహిళల సంచలన పరుగు.. అథ్లెటిక్స్ లో ఏకైక పసిడితో అదిరిపోయే ముగింపు, ఆఫ్ సెంచ‌రీకి దాటిన భారత్ మెడల్స్ వేట
ట్రాక్ పై భారత మహిళల సంచలన పరుగు.. అథ్లెటిక్స్ లో ఏకైక పసిడితో అదిరిపోయే ముగింపు, ఆఫ్ సెంచ‌రీకి దాటిన భారత్ మెడల్స్ వేట
PM Modi Degree Case: ప్రధాని మోదీ డిగ్రీ కేసు.. అరవింద్ కేజ్రీవాల్‌ అప్పీల్ కొట్టివేత, రూ.25 వేల జరిమానా
ప్రధాని మోదీ డిగ్రీ కేసు.. అరవింద్ కేజ్రీవాల్‌ అప్పీల్ కొట్టివేత, రూ.25 వేల జరిమానా
Onions Price: ఏపీలో రైతు బజార్లలో రూ.35కే కేజీ ఉల్లిపాయలు విక్రయం
ఏపీలో రైతు బజార్లలో రూ.35కే కేజీ ఉల్లిపాయలు విక్రయం
Embed widget