Odisha Train Accident: ఒడిశా ప్రమాదంలో 50 మందికిపైగా తెలుగువారు మృతి! వివరాలు సేకరించే పనిలో ఏపీ ప్రభుత్వం
Odisha Train Accident: ప్రమాదానికి గురైన కోరమాండల్ ఎక్స్ ప్రెస్ లో ఏపీకి రావాల్సిన 178 మంది ప్రయాణికుల్లో కొందరు చనిపోయినట్టు ఏపీ అధికారులు అనుమానిస్తున్నారు.
![Odisha Train Accident: ఒడిశా ప్రమాదంలో 50 మందికిపైగా తెలుగువారు మృతి! వివరాలు సేకరించే పనిలో ఏపీ ప్రభుత్వం Odisha Train Accident Coromandel Express AP CM Jagan twit above 50 Members of AP People Died in Coromandel Train Accident Odisha Train Accident: ఒడిశా ప్రమాదంలో 50 మందికిపైగా తెలుగువారు మృతి! వివరాలు సేకరించే పనిలో ఏపీ ప్రభుత్వం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/03/f910a6ed084e250688d4c38f4370c4371685774459078519_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Odisha Train Accident: ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లా బహనాగా రైల్వే స్టేషన్ లో శుక్రవారం రోజు ఘోర రైలు ప్రమాదం జరిగిన విషయం గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించారు. ట్విట్టర్ వేధికగా ప్రమాదంలో ప్రమాద ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని వివరించారు. అలాగే రైల్వే అధికారులతో మాట్లాడి ఏపీకి చెందిన బాధితుల వివరాలను సేకరిస్తున్నామని వెల్లడించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఒడిశాలో జరిగిన రైలు ప్రమాద దుర్ఘటన దురదృష్టకరం. ఈ ప్రమాదంలో 50 మందికి పైగా మృతిచెందడం దిగ్భ్రాంతికి గురి చేసింది. రైల్వే అధికారులతో మాట్లాడి ఏపీకి చెందిన బాధితుల వివరాలను సేకరిస్తున్నాం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. వారికి మనస్థైర్యం ఇవ్వాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.
— YS Jagan Mohan Reddy (@ysjagan) June 2, 2023
50 నుంచి అరవై మంది చనిపోయి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ విషయాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం ఓ టీంను ఒడిశా పంపించింది. అమర్ నేతృత్వంలోనే బృందం ఒడిశా అధికారులతో మాట్లాడి మృతుల వివరాలు తెలుసుకుంటోంది.
కోరమాండల్ లో ఎక్కి ఆంధ్ర ప్రదేశ్ కు చేరాల్సిన ప్రయాణీకుల వివరాలు
కోరమాండర్ ఎక్స్ ప్రెస్ లో ఎక్కి ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన మొత్తం ప్రయాణికుల సంఖ్య 178. అయితే ఇందులో ఫస్ట్ క్లాస్ ఏసీలో తొమ్మిది మంది, సెకండ్ క్లాస్ ఏసీలో 17 మంది, థర్డ్ ఏసీలో 114 మంది, స్లీపర్ క్లాస్ లో 38 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ఫస్ట్ క్లాస్AC - 9
సెకండ్ క్లాస్ AC - 17
థర్డ్ క్లాస్ A - 114
స్లీపర్ క్లాస్‌లో: 38
ప్రయాణికుల వివరాలను ఇక్కడ చూడవచ్చు
రాజమండ్రికి చెందిన 21 మంది సేఫ్.. మరో ముగ్గురి కోసం గాలింపు
ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లా బహనాగా రైల్వే స్టేషన్ లో శుక్రవారం రోజు ఘోర రైలు ప్రమాదం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఘటనలో షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్ ప్రెస్ కూడా ప్రమాదానికి గురైంది. అయితే ఈ ఎక్స్ ప్రెస్ కు చెందిన 15 బోగీలు బోల్తా పడ్డాయి. ఈ రైలులో రాజమండ్రికి వచ్చేందుకు 24 మంది ప్రయాణికులు రైలు ఎక్కినట్లు రైల్వే అధికారులు తెలిపారు. అందులో 21 మంది సురక్షితంగా ఉన్నారని.. మరో ముగ్గురి ఆచూకీ కోసం ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు. ఆ రైలులో రాజమహేంద్రవరానికి చెందిన ప్రయాణికులు ఎవరైనా ఉంటే.. వారి బంధువులు స్థానిక రైల్వే స్టేషన్ లోని హెల్ప్ లైన్ నంబర్లు 08832420541, 08832420543కు సంప్రదించాలని రైల్వే అధికారులు చెబుతున్నారు. మరోవైపు రైలు ప్రమాదం కారణంగా పలు రైళ్లు రద్దు కాగా.. మరికొన్ని రైళ్లను అధికారులు దారి మళ్లించారు. దీంతో రాజమహేంద్రవరం స్టేషన్ కు వచ్చిన ప్రయాణికులతో రైల్వే స్టేషన్ అంతా రద్దీగా మారింది. చాలా మంది రైళ్ల కోసం అక్కడే వేచి చూస్తున్నారు.
ఇప్పటికే ఈ ప్రమాదంపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్... ఓ బృందాన్ని ప్రమాద ఘటన ప్రాంతానికి పంపించారు. పరిశ్రమల శాఖ మంత్రి అమర్‌నాథ్ నేతృత్వంలోని బృందం ఒడిశాకు బయల్దేరి వెళ్లింది. ఈ బృందంలో ముగ్గురు ఐఏఎస్‌లు ఉన్నారు. అమర్ వెంట సీనియర్ ఐఏఎస్ అధికారి అరుణ్ కుమార్, శ్రీకాకుళం జాయింట్ కలెక్టర్ నవీన్ ఉన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)