News
News
X

AP News : ఏప్రిల్ 10న ఎన్‌ఐఏ కోర్టుకు సీఎం జగన్- బాధితుడిగానే !

ఏప్రిల్ పదో తేదీన హాజరు కావాలని సీఎం జగన్‌కు ఎన్‌ఐఏ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

FOLLOW US: 
Share:

AP News :   ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్  రెడ్డి ఏప్రిల్ పదో తేదీన విజయవాడలోని ఎన్ఐఏ కోర్టుకు  హాజరు కానున్నారు. ఆ రోజున హాజరు కావాలని ఎన్ఐఏ కోర్టు ఆదేశాలు జారీ చేసింది జగన్ తో పాటు ఆయన పిఏ నాగేశ్వరరరెడ్డికి కూడా ఈ ఆదేశాలు జారీ అయ్యాయి.  ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఎపి సిఎం జగన్‌పై విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన దాడి ఘటనపై విజయవాడ ఎన్‌ఐఏ కోర్టులో  విచారణ జరుగుతోంది.  బాధితుడు కూడా ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలని గతంలో ఎన్‌ఐఎ కోర్టు ఆదేశించింది. బాధితుడు కూడా విచారణకు  హాజరు కావాలని షెడ్యూల్ ఇవ్వాలని ఆదేశించింది. ఇప్పటికి షెడ్యూల్ ఖరారయింది. ఏప్రిల్ పదో తేదీన హాజరు కానున్నారు. 

ఘటన జరిగినప్పటి నుండి నిందితుడు శ్రీనివాసరావు జైల్లోనే ఉన్నారు. బెయిల్ కూడా రాలేదు. దాడికి వాడిన కోడి కత్తి గురించి న్యాయమూర్తి గత విచారణలో ఆరా తీశారు. దానిని తమ ముందు ప్రవేశ పెట్టాలని దర్యాప్తు అధికారుల్ని ఆదేశించారు. అయితే్ కోడి కత్తి మిస్ అయినట్లుగా ప్రచారం జరుగుతోంది.  2019లో వైజాగ్ ఎయిర్ పోర్టులో అప్పటి విపక్ష నేత ప్రస్తుత సిఎం జగన్‌పై కోడి కత్తితో జనిపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి దాడికి పాల్పడ్డాడు.  అప్పట్లో జగన్ ఉత్తరాంధ్ర ప్రాంతంలో పాదయాత్ర చేస్తున్నారు. ప్రతి శుక్రవారం ఆయన కోర్టుకు హాజరవ్వాల్సి ఉండేది. అందుకే ప్రతి గురువారం మధ్యాహ్నం కల్లా ఆయన పాదాయత్ర నిలిపివేసి వెంటనే విశాఖ ఎయిర్ పోర్టు నుంచి హైదరాబాద్ బయలుదేరేవారు. 

ఇలా  ఎయిర్ పోర్టుకు వచ్చిన సమయంలో  ఎయిర్ పోర్టు క్యాంటీన్‌లో పని చేసే శ్రీను అనే వ్యక్తి విఐపి లాంజ్‌లోకి వెళ్లడానికి అవకాశం దొరకబుచ్చుకున్నాడు. టీ, కాఫీలు అందించే ఉద్దేశంతో వెళ్లాడు. కోడికత్తితో దాడి చేశాడు. చిన్న గాయం కావడంతో వెంటనే జగన్ విమానం ఎక్కి వెళ్లిపోయారు. నీ హైదరాబాద్ చేరుకున్న తరవాత   సిటీ న్యూరో ఆస్పత్రిలో చేరారు. ఆ ఆస్పత్రి వైద్యులు తొమ్మిది కుట్లేసినట్లుగా ప్రకటించారు.

ఇది పెద్ద సంచలనం అయింది. శీను జగన్ అభిమాని అని జగన్‌పై సానుభూతి రావడం కోసం చేశారని పోలీసులు తేల్చారు. అయితే వైసిపి నేతలు ఇందులో టీడీపీ నేతల కుట్ర ఉందని ఆరోపించి..  ఎన్‌ఐఎ విచారణకు ఆదేశాలు తెచ్చుకున్నారు.   ఆ కేసుని చేతుల్లోకి తీసుకున్న ఎన్‌ఐఏ కోడికత్తి శీనును జైలుకు పంపి కాస్త విచారణ జరిపి నిజమేంటో దర్యాప్తు చేస్తోంది. ఎన్‌ఐఎ అప్పటి నుంచి దర్యాప్తు కొనసాగిస్తునే ఉంది. ఈ కేసులో నిందితుడు జనిపల్లి శ్రీనివాస్‌కు బెయిల్ ఇప్పించాలని అతని కుటుంబ సిఎం జగన్‌కు విజ్ఞప్తి చేసింది. జైల్లో రిమాండ్ ఖైదీ గానే ఉన్న జనిపల్లి శ్రీనివాస్‌కు బెయిల్ కోరుతూ అతని కుటుంబ సభ్యులు చేసుకున్న దరఖాస్తులను ఇప్పటికే కోర్టు కొట్టి వేసింది.   బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే క్రమంలో జగన్ నుంచి నిరభ్యంతర పత్రం కోసం శ్రీను తల్లితండ్రులు సిఎం క్యాంపు కార్యాలయానికి తిరుగుతునే ఉన్నారు. అయినా జగన్ నుంచి ఎటువంటి స్పందనాలేదు.  

Published at : 14 Mar 2023 06:11 PM (IST) Tags: NIA court Kodi knife case Jagan airport attack case Janapalli Srinivas

సంబంధిత కథనాలు

Attack On Satya Kumar :  పోలీసులు  కారు ఆపారు - వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు : సత్యకుమార్

Attack On Satya Kumar : పోలీసులు కారు ఆపారు - వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు : సత్యకుమార్

Attack On Satya Kumar : బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌పై ఎటాక్ - మందడంలో తీవ్ర ఉద్రిక్తత !

Attack On Satya Kumar :  బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌పై ఎటాక్ - మందడంలో తీవ్ర ఉద్రిక్తత !

Breaking News Live Telugu Updates: బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌పై ఎటాక్ - మందడంలో తీవ్ర ఉద్రిక్తత !

Breaking News Live Telugu Updates: బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌పై ఎటాక్ - మందడంలో తీవ్ర ఉద్రిక్తత !

ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌ రెడ్డి నిజంగా పార్టీ మారుతున్నారా? ఏపీబీ దేశంతో ఏమన్నారు?

ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌ రెడ్డి నిజంగా పార్టీ మారుతున్నారా? ఏపీబీ దేశంతో ఏమన్నారు?

Kotamreddy Sridhar: ఆయన ఒక్కమాట చెబితే అమరావతి ఎక్కడికీ పోదు - ఎమ్మెల్యే కోటంరెడ్డి

Kotamreddy Sridhar: ఆయన ఒక్కమాట చెబితే అమరావతి ఎక్కడికీ పోదు - ఎమ్మెల్యే కోటంరెడ్డి

టాప్ స్టోరీస్

Tenali Council Fight : తెనాలి మున్సిపల్ కౌన్సిల్ లో రసాభాస, చొక్కాలు చిరిగేలా కొట్టుకున్న టీడీపీ, వైసీపీ కౌన్సిలర్లు

Tenali Council Fight : తెనాలి మున్సిపల్ కౌన్సిల్ లో రసాభాస, చొక్కాలు చిరిగేలా కొట్టుకున్న టీడీపీ, వైసీపీ కౌన్సిలర్లు

Naga Chaitanya : చైతూను కావాలని టార్గెట్ చేశారా? డివోర్స్, డేటింగ్ రూమర్స్ - ప్లాన్ ప్రకారమే ప్రతిదీ తెరపైకి?

Naga Chaitanya : చైతూను కావాలని టార్గెట్ చేశారా? డివోర్స్, డేటింగ్ రూమర్స్ - ప్లాన్ ప్రకారమే ప్రతిదీ తెరపైకి?

PM Modi Degree Certificate: మోదీ ఎడ్యుకేషన్‌ గురించి అడిగిన కేజ్రీవాల్‌కు జరిమానా- ఆరాలు అనవసరమన్న గుజరాత్ హైకోర్టు

PM Modi Degree Certificate: మోదీ ఎడ్యుకేషన్‌ గురించి అడిగిన కేజ్రీవాల్‌కు జరిమానా-  ఆరాలు అనవసరమన్న గుజరాత్ హైకోర్టు

Shaakuntalam: ‘శాకుంతలం’ నుంచి ‘మల్లిక’ వీడియో సాంగ్ రిలీజ్ - అందంతో కట్టిపడేస్తోన్న సమంత

Shaakuntalam: ‘శాకుంతలం’ నుంచి ‘మల్లిక’ వీడియో సాంగ్ రిలీజ్ - అందంతో కట్టిపడేస్తోన్న సమంత