RTC Driver Attacked: కావలిలో ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి వీడియో వైరల్-వైసీపీ ఆరాచకాలు ఎక్కువయ్యాయన్న టీడీపీ
నెల్లూరు జిల్లా కావలిలో ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి జరిగింది. ఇది వైఎస్‌ఆర్‌సీపీ గూండాల పనే అంటున్న టీడీపీ... దాడిని తీవ్రంగా ఖండించింది. హారన్ కొట్టడమే డ్రైవర్ చేసిన నేరమా? అని ప్రశ్నించారు నారా లోకేష్.
నెల్లూరు జిల్లా కావలిలో ఆర్టీసీ డ్రైవర్‌పై కొందరు దుండగులు దాడి చేశారు. బస్సును వెంబడించి మరి.. అటాక్ చేశారు. కాళ్లతో తన్నారు. రోడ్డుపై పడేసి ఈడ్చి ఈడ్చి కొట్టారు. తమ వాహనానికి సైడ్ ఇవ్వలేదన్న కోపంతో.. కొందరు దుండగులు... ఆర్టీసీ డ్రైవర్‌తోపాటు కండెక్టర్‌పైనా దాడి చేశారు. బస్సును ఛేజ్ చేసి మరి... దాడికి పాల్పడ్డారు. నెల్లూరు జిల్లా కావలిలో జరిగిన ఈ సంఘటన కలకలం రేపుతోంది. మొన్న (గురువారం) సాయంత్రం ఈ దాడి జరిగింది.
విజయవాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కావలి నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. కావలిలోని ట్రంకు రోడ్డులో ఆర్టీసీ బస్సు ముందు బైక్ వెళ్తోంది. దీంతో బస్సు డ్రైవర్ రామ్‌సింగ్... సైడ్ ఇవ్వాలంటూ హారన్ మోగించాడు. దీంతో బైక్‌పై ఉన్న వ్యక్తికి పట్టారాని కోపం వచ్చింది. బస్సును అడ్డంగా వచ్చాడు. బస్సును రోడ్డుపైనే ఆపేయించి... డ్రైవర్ రామ్‌సింగ్‌తో వాగ్వాదానికి దిగాడు. అయితే... అక్కడ ఉన్న పోలీసులు వారికి సర్దిచెప్పి పంపించారు. అక్కడితో అయిపోయిందని అనుకున్నారు. కానీ... బైక్‌పై ఉన్న వ్యక్తి మాత్రం మరింత రెచ్చిపోయాడు.
జరిగిన విషయంలో తన స్నేహితులతో చెప్పాడు. వారంతా కలిసి బస్సు డ్రైవర్ పనిచెప్పాలనున్నారు. 14 మంది కలిసి ఆ ఆర్టీసీ బస్సును వెంబడించాడు. కొంత దూరం వెళ్లాక బస్సును ఆపి... ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్‌పై దాడి చేశారు. 14 మంది గ్యాంగ్ ఈ దాడిలో పాల్గొన్నారు. బస్సు డ్రైవర్, కండెక్టర్‌ను రోడ్డుపై పడేసి దారుణంగా కొట్టారు. డ్రైవర్‌ను కళ్లతో తన్నారు. కండెక్టర్ చొక్కా పట్టుకుని కొట్టారు. ఈ గొడవను వీడియో తీస్తున్న వారి ఫోన్లు లాక్కుని.. పగలగొట్టారు. నడిరోడ్డుపై నానా హంగామా సృష్టించారు. కొందరు ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యి.. రాజకీయ రంగు పలుముకుంది.
ఆర్టీసీ డ్రైవర్, కండెక్టర్‌పై దాడిచేసింది వైఎస్‌ఆర్‌సీపీ నేతల పనే అంటూ తెలుగు దేశం పార్టీ ఆరోపిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైకోలు ఊరి మీద పడి జనాల్ని వేధిస్తున్నారని ట్వీట్లు చేస్తున్నారు టీడీపీ కార్యకర్తలు. సైడ్ ఇవ్వమని హారన్ కొట్టినందుకు ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి చేశారని దుయ్యబడుతున్నారు. అధికారంలో ఉన్నారని ఇష్టమొచ్చినట్టు దాడులు చేస్తున్నారంటూ విమర్శిస్తున్నారు. రోడ్డుకు అడ్డంగా ఉన్నా బస్ డ్రైవర్ హారన్ కొట్టకూడదు.. ఒకవేళ కొడితే వెంబడించి మరీ కొడతాం అనేతా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ పాలనలో శాంతి భద్రతలు దిగజారాయని విమర్శిస్తున్నారు.
టీడీపీ నేత, నారా లోకేష్ కూడా ఆర్టీసీ డ్రైవర్‌పై దాడికి తీవ్రంగా ఖండించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తన అవినీతి దందాలకు అడ్డొస్తున్నారని సొంత బాబాయ్ అయిన వివేకానందరెడ్డిని వేసేస్తే... ఆయన సైకో ఫ్యాన్స్ హారన్ కొట్టారని ఆర్టీసీ డ్రైవర్‌పై హత్యాయత్నం చేశారని ఆరోపించారు లోకేష్. పట్టపగలు... నడిరోడ్డుపై వైసీపీ నేతలు గూండాల కంటే ఘోరంగా దాడి చేశారని అన్నారు. పెద్ద సైకో జగన్ పోతేనే.. పిల్ల సైకో గ్యాంగులన్నీ సైలెంట్ అవుతాయని అన్నారు నారా లోకేష్.
వైసీపీ అధినేత తన అవినీతి దందాలకు అడ్డొస్తున్నారని సొంత బాబాయ్‌ని వేసేస్తే, ఆయన సైకో ఫ్యాన్స్ హారన్ కొట్టారని ఆర్టీసీ డ్రైవర్‌పై హత్యాయత్నం చేశారు. కావలిలో రోడ్డుకి అడ్డంగా ఉన్న బైక్ తీయాలని ఆర్టీసీ బస్సు డ్రైవర్ బీఆర్ సింగ్ హారన్ కొట్టడమే నేరమైంది. నడిరోడ్డుపై… pic.twitter.com/URVrSWIUde
— Lokesh Nara (@naralokesh) October 28, 2023