అన్వేషించండి

Pawan Kalyan On Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలి దశ ప్రారంభోత్సవంపై ఎక్స్‌లో స్పందించిన పవన్ కల్యాణ్‌!

Pawan Kalyan On Veligonda Project: ఏపీ సీఎం చంద్రబాబు సంకల్పంతోనే వెలిగొండ తొలి దశ ప్రారంభమైందని పవన్ కల్యాణ్‌ అభిప్రాయపడ్డారు. దశాబ్దాల కల నెరవేరిందని సంతోషం వ్యక్తం చేశారు. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పవన్ కల్యాణ్ వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభం చారిత్రక ఘట్టంగా అభివర్ణించారు.
  • నాలుగు జిల్లాలకు సాగు, తాగునీరు అందిస్తుందని పవన్ తెలిపారు.
  • నిర్వాసితుల త్యాగాలను స్మరిస్తూ, వారికి పరిహారం చెల్లింపులు వివరించారు.
  • చంద్రబాబు శంకుస్థాపన చేసిన వెలిగొండ నేడు ఫలించడంపై పవన్ సంతోషం.

Pawan Kalyan On Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలి దశ ప్రారంభమైన సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పానికి, కూటమి పనితీరుకు నిదర్శనమని అభిప్రాయపడ్డారు. ఎక్స్‌వేదికగా ఆయన తన శుభాకాంక్షలను తెలియజేశారు. "

వెలిగొండ ప్రాజెక్టు తొలి దశ ప్రారంభం చారిత్రక ఘట్టమని పవన్ తెలిపారు. నాలుగు జిల్లాల ప్రజల దశాబ్దాల కల నేటితో నెరవేరిందన్నారు. 119 వేల ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు అందుతుందని తెలిపారు. నల్లమల కొండలను ఛేదించి కరవు ప్రాంతాలకు నీరు చేరుతుందని పేర్కొన్నారు. 

వెలిగొండ ప్రాజెక్టులో భాగమైన ప్రతి ఒక్కరికీ పవన్ కల్యాణ్ అభినందించారు. "వెలిగొండ ప్రాజెక్టు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు. ఇంజినీర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతు సంఘాలకు ప్రత్యేక అభినందనలు. వెలిగొండ కోసం 7,300 మందికిపైగా నిర్వాసితులు భూములు, ఇళ్లు కోల్పోయారు. 

నిర్వాసితుల త్యాగాలు మరువలేనివని పవన్ గుర్తు చేశారు. అందుకే వారి బాగోగుల కోసం కూటమి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించిందని పేర్కొన్నారు. "నిర్వాసితులకు పరిహారం కోసం రూ.905 కోట్లు విడుదల చేసిన కూటమి ప్రభుత్వం. ఇప్పటికే నిర్వాసితులకు రూ.768 కోట్లు చెల్లింపులు పూర్తి అయ్యాయి. వెలిగొండ కోసం భూములు త్యాగం చేసిన నిర్వాసితులకు ప్రత్యేక కృతజ్ఞతలు." అని అన్నారు.  

వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కృషిని కూడా పవన్ కల్యాణ్ కీర్తించారు. ఆయన చేతులో మీదుగా శంకుస్థాపన చేసుకున్న ప్రాజెక్టు నేడు పూర్తి అయ్యి నేడు స్టార్ట్ అవ్వడంపై సంతోషం వ్యక్తం చేశారు. "1996లో ఉమ్మడి ఏపీ సీఎంగా వెలిగొండకు చంద్రబాబు శంకుస్థాపన చేశారు. చంద్రబాబు సంకల్పంతోనే నేడు వెలిగొండ తొలి దశ ప్రారంభమైంది. వెలిగొండ నీటితో కరవు ప్రాంతాల్లో నీటి ప్రవాహంతో ప్రజల్లో ఆనంద వెల్లివిరిస్తోంది" 

మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో జల్‌ జీవన్‌ మిషన్‌కు వెలిగొండ కీలక నీటి వనరు అని పవన్ తెలిపారు. ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు అందించాలన్న ప్రధాని మోదీ సంకల్పంలో వెలిగొండ కీలకమన్నారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయడంలో కష్టపడిన మంత్రి నిమ్మల రామానాయుడు, అధికారులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. కూటమి ప్రభుత్వ సంకల్పానికి వెలిగొండ ప్రాజెక్టు సజీవ సాక్ష్యమని పవన్ తన సోషల్ మీడియా సందేశంలో వెల్లడించారు. 

Frequently Asked Questions

వెలిగొండ ప్రాజెక్టు తొలి దశ ప్రారంభంపై పవన్ కల్యాణ్ ఏమని అభిప్రాయపడ్డారు?

ఇది ఒక చారిత్రక ఘట్టమని, నాలుగు జిల్లాల ప్రజల దశాబ్దాల కల నెరవేరిందని పవన్ కల్యాణ్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పానికి, కూటమి పనితీరుకు ఇది నిదర్శనమని తెలిపారు.

వెలిగొండ ప్రాజెక్టు వల్ల ఎన్ని ఎకరాలకు సాగునీరు, ఎంతమందికి తాగునీరు అందుతుంది?

వెలిగొండ ప్రాజెక్టు ద్వారా 119 వేల ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు అందుతుంది. కరవు ప్రాంతాలకు నల్లమల కొండలను ఛేదించి నీరు చేరుతుంది.

వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల కోసం ప్రభుత్వం ఏం చేసింది?

వెలిగొండ ప్రాజెక్టు కోసం 7,300 మందికిపైగా నిర్వాసితులు భూములు, ఇళ్లు కోల్పోయారు. కూటమి ప్రభుత్వం వారికి పరిహారం కోసం రూ.905 కోట్లు కేటాయించి, రూ.768 కోట్లు చెల్లించింది.

వెలిగొండ ప్రాజెక్టుకు ఎవరు శంకుస్థాపన చేశారు?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు 1996లో వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఆయన సంకల్పంతోనే నేడు తొలి దశ ప్రారంభమైంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2027 Retention Full List: ఐపీఎల్ రిటెన్షన్ గడువు రోజున ఫ్రాంచైజీల సంచలన నిర్ణయాలు..  స్టార్ ఆటగాళ్లకు ఉద్వాసన
ఐపీఎల్ రిటెన్షన్ గడువు రోజున ఫ్రాంచైజీల సంచలన నిర్ణయాలు..  స్టార్ ఆటగాళ్లకు ఉద్వాసన
CM Chandrababu: ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
MLA Anirudh Reddy: రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతిపరులు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతిపరులు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
హై-వోల్టేజ్‌తో తిరిగొచ్చిన Ultraviolette X-47 Venom.. పాత X-47 మోడల్‌తో పోలిస్తే కొత్తగా ఏం మారింది?
హై-వోల్టేజ్ బైక్‌ 'అల్ట్రావయొలెట్ X-47 వెనమ్‌' vs 'X-47'.. ధర, ఫీచర్లలో తేడాలేంటి?
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2027 Retention Full List: ఐపీఎల్ రిటెన్షన్ గడువు రోజున ఫ్రాంచైజీల సంచలన నిర్ణయాలు..  స్టార్ ఆటగాళ్లకు ఉద్వాసన
ఐపీఎల్ రిటెన్షన్ గడువు రోజున ఫ్రాంచైజీల సంచలన నిర్ణయాలు..  స్టార్ ఆటగాళ్లకు ఉద్వాసన
CM Chandrababu: ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
MLA Anirudh Reddy: రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతిపరులు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతిపరులు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
హై-వోల్టేజ్‌తో తిరిగొచ్చిన Ultraviolette X-47 Venom.. పాత X-47 మోడల్‌తో పోలిస్తే కొత్తగా ఏం మారింది?
హై-వోల్టేజ్ బైక్‌ 'అల్ట్రావయొలెట్ X-47 వెనమ్‌' vs 'X-47'.. ధర, ఫీచర్లలో తేడాలేంటి?
Bigg Boss Season 10 Today November 17th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: శివకి ఇచ్చి పడేసిన రాంప్రసాద్! ఓ వైపు స్నేహం.. మరోవైపు వెన్నుపోటు!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: శివకి ఇచ్చి పడేసిన రాంప్రసాద్! ఓ వైపు స్నేహం.. మరోవైపు వెన్నుపోటు!
బాబా వాంగ 2026 అంచనాలు: ఇయర్ ఎండ్ మీ రాశికి సంక్షోభమా, సంపదా?
బాబా వాంగ 2026 అంచనాలు: ఇయర్ ఎండ్ మీ రాశికి సంక్షోభమా, సంపదా?
Ranu Bombai Ki Ranu Lyrics : రాను ముంబయికి రాను న్యూ రికార్డ్ - 100 కోట్లకు చేరువలో రాము రాథోడ్ ఫోక్ సాంగ్... హుషారెత్తించే లిరిక్స్
రాను ముంబయికి రాను న్యూ రికార్డ్ - 100 కోట్లకు చేరువలో రాము రాథోడ్ ఫోక్ సాంగ్... హుషారెత్తించే లిరిక్స్
ONGC Gas Leak: అదుపులోకి మామిడికుదురు గ్యాస్ బ్లో అవుట్‌.. లీకేజీ ఆగిందని ఓఎన్‌జీసీ ప్రకటన!
అదుపులోకి మామిడికుదురు గ్యాస్ బ్లో అవుట్‌.. లీకేజీ ఆగిందని ఓఎన్‌జీసీ ప్రకటన!
Embed widget