NTR Jayanti: 40 ఏళ్లకే ఎన్టీఆర్ అద్భుతాలు చేశారు- ఆయనలా ఇంకొకరు లేరు, రారు: చంద్రబాబు
సామాన్య కుటుంబంలో పుట్టి అద్భుతాలు చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని.. డైరెక్టర్‌గా, ప్రోడ్యూసర్, యాక్టర్‌గా రికార్డు సృష్టించారన్నారు టీడీపీ చీఫ్ చంద్రబాబు. అద్దంకిలో ఎన్టీఆర్‌కు ఆయన నివాళి అర్పించారు.
ప్రకాశం జిల్లా అద్దంకి బస్టాండ్ సెంటర్‌లో ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నివాళి అర్పించారు. ఆయనతోపాటు తెలుగుదేశం లీడర్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నందమూరు తారక రామారావు తెలుగు జాతి వెలుగు అని.. ఆయన సాధించిన విజయాలు వేరెవ్వరికీ సాధ్యం కావన్నారు. సామాన్య కుటుంబంలో పుట్టి అద్భుతాలు చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని.. డైరెక్టర్‌గా, ప్రోడ్యూసర్, యాక్టర్‌గా రికార్డు సృష్టించారన్నారు.
తెలుగువారి పౌరుషంగా ఎదిగిన ఎన్టీఆర్ 40 ఏళ్లకే 300 సినిమాల్లో నటించి రికార్డు బ్రేక్ చేశారన్నారు చంద్రబాబు. ఆయన రాజకీయాల్లోకి వచ్చింది అధికారం కోసం కాదని... ప్రజల కోసమని నిరూపించారన్నారు. పేదలకు ఏం కావాలో ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నారన్నారు. ఆయన పెద్ద సంస్కారణ వాదని... ముందు చూపు ఉన్న నాయకుడని కితాబిచ్చారు. ఏం చేసినా భావితరాల కోసం చేశారన్నారు.
దేశ రాజకీయాలలో సంక్షేమ శకానికి నాంది పలికి, సమ సమాజానికి బీజం వేసిన మహానుభావుడు ఎన్టీఆర్. ముఖ్యంగా తెలుగు జాతికి ఆ మహానుభావుడు చేసిన సేవలు చిరస్మరణీయం. అందుకు నివాళిగా సంవత్సర కాలం పాటు ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను జరుపుకోవడానికి సంకల్పించాం.(2/3)
— N Chandrababu Naidu (@ncbn) May 28, 2022
అదే స్ఫూర్తితో తెలుగుదేశం పని చేస్తుందన్న చంద్రబాబు... వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం, ఒంగోలు అభివృద్ధి అన్ని తెలుగుదేశం హయాంలోనే జరిగిందన్నారు. దామచర్ల జనార్దన్ నాయకుడిగా ఉండటం వల్లే ఇవన్నీ సాధ్యమయ్యాయన్నారు చంద్రబాబు. తెలుగుదేశం పార్టీ సభలకు జనాలను రానివ్వకుండా వైసీపీ లీడర్లు అడ్డుకుంటున్నారని... కావాలనే బస్సులు ఇవ్వలేదన్నారు. మహానాడుకు పోటీగా బస్సు యాత్రలు చేస్తున్నారన్నారని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం సభల్లో జనాలు ఉంటే.. వైఎస్‌ఆర్‌సీపీ యాత్రలో బస్సులు మాత్రమే ఉన్నాయన్నారు.
ఎన్టీఆర్ చరిత్రను చూస్తే ఒక మనిషి తన జీవితంలో ఇన్ని సాధించగలడా అని ఆశ్చర్యం వేస్తుంది. ఎన్టీఆర్ గారిని సినీ రంగంలో వెండితెర వేలుపుగా, రాజకీయ రంగంలో పేదలపాలిటి దేవుడిగా కొలిచారు ప్రజలు. రెండు రంగాలలోనూ దైవత్వాన్ని కనబరిచిన అరుదైన చరిత్ర ఎన్టీఆర్ గారి సొంతం.(1/3)#NTRJayanthi pic.twitter.com/vhBjXD8Ive
— N Chandrababu Naidu (@ncbn) May 28, 2022
వైసీపీ లీడర్లు చెబితే ఆగిపోవడానికి ప్రజలు వారికి బానిసలా అని ప్రశ్నించారు చంద్రబాబు. వైసీపీ నేతలు, జగన్ గుండెలు అదిరేలా సాయంత్రం సభకు రావాలని చంద్రబాబు పిలుపునిచ్చా. తెలుగు జాతి ఉన్నంత వరకు ప్రజల గుండెల్లో చిరస్మరనీయంగా ఉండే నాయకుడు ఎన్టీఆర్ అన్నారు. ఒక్కసారి ఆయన్ని స్మరించు ఏ పని మొదలు పెట్టినా విజయం వరిస్తుందన్నారు.