అన్వేషించండి

Narayana News: టీడీపీలో వేమిరెడ్డి చేరేది అప్పుడే! మాజీ మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు

P Narayana News: వైసీపీకి రాజీనామా చేసిన రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత పి.నారాయణ కలిశారు.

Vemireddy Prabhakar Reddy: టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాలతో తాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో భేటీ అయ్యానని చెప్పారు మాజీ మంత్రి నారాయణ. టీడీపీ నేతలతో కలిసి ఆయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కలిశారు. ఆయన్ను టీడీపీలోకి ఆహ్వానించారు. టీడీపీలో చేరేందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్టు చెప్పారు నారాయణ. త్వరలోనే వేమిరెడ్డి టీడీపీలో చేరతారని అన్నారు. తేదీ త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. వేమిరెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పడంతో నెల్లూరు టీడీపీ నేతలు సంతోషంగా ఉన్నారు. ఇప్పటి వరకు నెల్లూరు ఎంపీ అభ్యర్థిని టీడీపీ ప్రకటించలేదు. ఆ స్థానాన్ని వేమిరెడ్డితో భర్తీ చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. టీడీపీ నేతలను ఆహ్వానిస్తూ వేమిరెడ్డి కూడా బిజీ అయిపోయారు. అయితే ఆయన మాత్రం టీడీపీలో చేరే విషయంపై నేరుగా స్పందించలేదు.

నిన్న సోమిరెడ్డి కూడా..
వైసీపీకి రాజీనామా చేసిన రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా నిన్న కలిశారు. టీడీపీలో చేరాల్సిందిగా ఆయనను ఆహ్వానించారు. పార్టీ అధిష్టానం సూచన మేరకు వేమిరెడ్డిని సోమిరెడ్డి కలిసి టీడీపీలోకి ఆహ్వానించినట్లు తెలిసింది. అయితే, ఫిబ్రవరి 21న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు టీటీడీ బోర్డు మెంబర్‌గా ఉన్న ఆయన భార్య వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వైసీపీకి రాజీనామా ఇచ్చారు. ఈ మేరకు ఇద్దరూ రాజీనామా లేఖను వైసీపీ అధిష్టానానికి పంపించారు. వ్యక్తిగత కారణాల వల్ల పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్ష పదవికి, వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో ప్రభాకర్ రెడ్డి తెలిపారు. తన రాజీనామాను తక్షణమే ఆమోదించాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు.

రాజ్యసభ పదవికి కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేశారు. ఈ  క్రమంలో సాయంత్రం ఆయనతో భేటీ అయిన సోమిరెడ్డి..టీడీపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ.. వేమిరెడ్డి దంపతులు వైసీపీకి రాజీనామా చేయడం మంచి పరిణామమని, వేమిరెడ్డి కుట్రలు, కుతంత్రాలు చేసే నేత కాదని అన్నారు. వైసీపీలో ఇమడలేకే వేమిరెడ్డి బయటకు వచ్చారని సోమిరెడ్డి తెలిపారు. ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి టీడీపీలో చేరాల్సిందిగా ఆహ్వానించినట్లు స్పష్టం చేశారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Viral News:
"గుండెల నిండా దమ్ముతో ఎదురించాలి, జెండా ఎగరేయాలి" జనసేన ఆవిర్భావం రోజున ఓ బామ్మ కామెంట్స్ వైరల్‌!
Autonomous shipbuilding: నెల్లూరులో డ్రైవర్లు అవసరం లేని నౌకల తయారీ కేంద్రం -అటానమస్ షిప్‌బిల్డింగ్ సెంటర్‌ ప్రత్యేకత ఇదే !
నెల్లూరులో డ్రైవర్లు అవసరం లేని నౌకల తయారీ కేంద్రం -అటానమస్ షిప్‌బిల్డింగ్ సెంటర్‌ ప్రత్యేకత ఇదే !
Iran War Effect AP Hotels: ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్! ఏపీలో స్విగ్గి, జోమోటో సేవలు బంద్? హోటల్ యాజమాన్యాల కీలక నిర్ణయాలు!
ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్! ఏపీలో స్విగ్గి, జోమోటో సేవలు బంద్? హోటల్ యాజమాన్యాల కీలక నిర్ణయాలు!
YS Jagan: ముఖ్యమంత్రిగానే భరించలేకపోతున్నాం, ఇక  ప్రధాని అయితే దేశం గతేంటీ?- చంద్రబాబుపై జగన్ కామెంట్స్ వైరల్ 
ముఖ్యమంత్రిగానే భరించలేకపోతున్నాం, ఇక  ప్రధాని అయితే దేశం గతేంటీ?- చంద్రబాబుపై జగన్ కామెంట్స్ వైరల్ 

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Election Commission: నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Seetha Payanam OTT : ఓటీటీలోకి సీతాపయనం - అర్జున్ కుమార్తె లవ్ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలోకి సీతాపయనం - అర్జున్ కుమార్తె లవ్ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Petrol Pump Scam: ఇప్పుడు 0 కాదు.. పెట్రోల్- డీజిల్ సాంద్రతతో మోసం చేస్తున్న పెట్రోల్ పంపులు!
ఇప్పుడు 0 కాదు.. పెట్రోల్- డీజిల్ సాంద్రతతో మోసం చేస్తున్న పెట్రోల్ పంపులు!
Lavanya Tripathi : టార్గెట్ చేసి వేధించారు - ఒంటరిగా రూంలో కూర్చుని ఏడ్చేశా... మెగా కోడలి లైఫ్‌లో షాకింగ్ ఘటన
టార్గెట్ చేసి వేధించారు - ఒంటరిగా రూంలో కూర్చుని ఏడ్చేశా... మెగా కోడలి లైఫ్‌లో షాకింగ్ ఘటన
Embed widget