అన్వేషించండి

Nellore Software Engineer : ఇటు వ్యవసాయం, అటు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం- లాక్ డౌన్ విచిత్రం

నెల్లూరు జిల్లా ముస్తాపురంకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ నరసింహ, లాక్ డౌన్ కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ రూపంలో జాబ్ చేస్తున్నారు. ఇంటికొచ్చిన తర్వాత తండ్రి చేస్తున్న వ్యవసాయాన్ని తాను కొనసాగిస్తున్నారు.

ఓవైపు ల్యాప్ టాప్‌లో వర్క్ చేసుకుంటూ, మరోవైపు పొలం పనులు చేస్తున్న హీరోని మనం మహర్షి సినిమాలో చూశాం. ఇటీవల కరోనా కాలంలో వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ రావడంతో పల్లెటూళ్లకు వచ్చిన రైతు బిడ్డలు కూడా ఇలా పొలంబాట పట్టారు. ఓవైపు ఆఫీస్ పని చేసుకుంటూనే, మరోవైపు పొలం పని చేస్తున్నారు. అయితే వీరంతా ఆధునిక వ్యవసాయ పద్ధతుల్ని అవపోసన పట్టారు. పొగాకు పండే ఆ చేలలో ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు వేశారు. అంతర పంటగా బొప్పాయి సాగు చేస్తున్నారు. 

నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం ముస్తాపురంకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ నరసింహ. బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న నరసింహ కరోనా లాక్ డౌన్ కారణంగా ఇంటికి వచ్చేశారు. ఇక్కడినుంచే వర్క్ ఫ్రమ్ హోమ్ రూపంలో జాబ్ చేస్తున్నారు. అయితే ఇంటికొచ్చిన తర్వాత తండ్రి చేస్తున్న వ్యవసాయాన్ని తాను కొనసాగించాలనుకున్నారు. కౌలుకి ఇచ్చిన పొలాన్ని తిరిగి తామే తీసుకుని డ్రాగన్ ఫ్రూట్ వేశారు. ఆధునిక వ్యవసాయ పద్ధతుల్ని ఇంటర్నెట్ లో శోధించి వివరాలు సేకరించి డ్రాగన్ ఫ్రూట్ తోటని వేశారు. 

అంతర పంటగా బొప్పాయిని సాగు చేస్తున్నారు నరసింహ. తండ్రి, తమ్ముడి సాయంతో తాను ఇలా పొలంబాట పట్టానని, రైతు బిడ్డగా ఆ రక్తం తనలో ఉండటం వల్లే తనను మట్టివాసన రారమ్మని పిలిచిందని అంటున్నారాయన. ఆధునిక పద్దతుల్లో వ్యవసాయం చేస్తే కచ్చితంగా లాభాలబాట పట్టొచ్చని, అయితే మెళకువులు తెలుసుకోవాలని, సాంకేతికత వంటబట్టించుకోవాలని చెబుతున్నారు. 


Nellore Software Engineer : ఇటు వ్యవసాయం, అటు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం- లాక్ డౌన్ విచిత్రం

ఉదయం ముస్తాపురంలోని తన ఇంటిలో ల్యాప్ టాప్ ఓపెన్ చేసి ఉద్యోగ విధుల్లో నిమగ్నమవుతారు నరసింహ. ఆ తర్వాత కారులో పొలానికి వస్తారు. డ్రాగన్ ఫ్రూట్ పంటను నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలని చెబుతారాయన. తిరిగి కారులో ఇంటికి వెళ్లి.. మళ్లీ విధుల్లో నిమగ్నమవుతారు. ఇలా తన వర్క్ షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నారు నరసింహ. 


Nellore Software Engineer : ఇటు వ్యవసాయం, అటు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం- లాక్ డౌన్ విచిత్రం

ప్రభుత్వం నుంచి ప్రస్తుతానికి తామెలాంటి సాయం ఆశించలేదని, డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మొక్కలకు నీరు పెడుతున్నామని చెప్పారు. అంతరపంటగా బొప్పాయి సాగు చేస్తున్నామని, డ్రాగన్ ఫ్రూట్ సాగుపై పై ఇప్పుడిప్పుడే ఇక్కడ అవగాహన పెరుగుతోందని, మార్కెటింగ్ పద్ధతులు కూడా తెలుసుకున్నామని అన్నారు. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ జీవితం అంటే.. పట్టణాల్లో ఉంటే పని, నిద్ర, షాపింగ్.. ఇలా జరిగిపోతుంటుందని.. పల్లెటూళ్లకు వచ్చిన తర్వాత తమకు ఖాళీ సమయాన్ని ఇలా సద్వినియోగం చేసుకునే అవకాశం లభించిందని చెబుతున్నారు నరసింహ. ఆఫీస్ లకు వెళ్లే అవకాశం వచ్చినా.. వారానికోసారి తాము సొంత ఊరుకి వచ్చి వెళ్తుంటామని.. వ్యవసాయాన్ని మాత్రం కొనసాగిస్తామని చెబుతున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Somireddy Chandramohan Reddy: ప్రధానుల కేసులే మూడేళ్లలో తేల్చారు- జగన్ కేసుల్లో రోజువారీ కాదు.. రోజంతా విచారణ జరగాలి
ప్రధానుల కేసులే మూడేళ్లలో తేల్చారు- జగన్ కేసుల్లో రోజువారీ కాదు.. రోజంతా విచారణ జరగాలి
AP Cabinet Decisions: ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
BPCL Refinery Project: ఏపీలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు.. లక్ష కోట్లతో బీపీసీఎల్‌ రిఫైనరీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్
ఏపీలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు.. లక్ష కోట్లతో బీపీసీఎల్‌ రిఫైనరీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్
CM Chandrababu: వైసీపీ 880 కి.మీ రోడ్లు.. రెండేళ్లలో కూటమి 6,500 కి.మీ- పవన్ కళ్యాణ్‌పై సీఎం చంద్రబాబు ప్రశంసలు
వైసీపీ 880 కి.మీ రోడ్లు.. రెండేళ్లలో కూటమి 6,500 కి.మీ- పవన్ కళ్యాణ్‌పై సీఎం చంద్రబాబు ప్రశంసలు

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
Tiger Rescue Operation: దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
IndiGo Flight Emergency Landing: విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
Abhishek World Record: సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
Maremma OTT : మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
Supreme Court On CJP Protest: శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
RT78 Movie : వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
Embed widget