అన్వేషించండి

స్పేష్ షటిల్ ప్రయోగాల కోసం షార్‌లో రన్ వే

కొత్త ప్రయోగ వేదిక నిర్మాణానికి 3వేల కోట్లు అవసరం, అయితే ఇప్పుడున్న రెండో లాంచింగ్ ప్యాడ్ ను భారీ ప్రయోగాలకు అనుగుణంగా మలచుకోవాలంటే రూ.400 కోట్ల ఖర్చుచేస్తే సరిపోతుందని శాస్త్రవేత్తలు అంచనాకు వచ్చారు.

స్పేస్ షటిల్ ప్రయోగాల భారత్ లో ఇంకా ఊపందుకోలేదు. 2016లో RLV-TD తో ప్రయోగం చేసినా ఆ తర్వాత పూర్తి స్థాయిలో ఈ ప్రయోగాలు ఊపందుకోలేదు. ఇప్పుడు స్పేష్ షటిల్ ప్రయోగాల కోసం రన్ వే నిర్మించేందుకు శ్రీహరి కోటలోని షార్ అంతరిక్ష కేంద్రం సన్నాహాలు మొదలు పెట్టింది. భవిష్యత్తులో షార్‌లో స్పేస్‌ షటిల్‌ ప్రయోగాలు చేపట్టేలా ప్రణాళికలు రూపొందించారు శాస్త్రవేత్తలు. అందుకు తగ్గట్లు ఏర్పాట్లు జరుగుతున్నాయి. షార్‌ లోని సముద్ర తీరంలో 3 నుంచి 4 కి.మీ మేర రన్‌ వే ఏర్పాటు చేయబోతున్నారు. దీనిపై ఇప్పటికే ఉన్నతస్థాయి వర్గాలు సాధ్యాసాధ్యాలను పరిశీలించాయి. రక్షణ శాఖకు సైతం ఉపయోగపడేలా రన్‌ వే ను నిర్మించబోతున్నారు. స్పేస్ షటిల్ ప్రయోగాలతోపాటు, రక్షణ శాఖ అవసరాలను కూడా ఈ రన్ వే తీర్చే అవకాశాలున్నాయి. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని రన్ వే నిర్మించాలనుకుంటున్నారు అధికారులు. స్పేస్ షటిల్ ప్రయోగాలు భవిష్యత్తులో ఊపందుకునే అవకాశాలున్నాయి. దీని కోసం ముందుగానే రన్ వే నిర్మిస్తున్నారు.

భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీష్ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లో రెండో ప్రయోగ వేదిక విస్తరణపై ఇస్రో శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. త్వరలో గగన్‌ యాన్‌, చంద్రయాన్‌-3, ఆదిత్య-ఎల్‌ 1 వంటి భారీ రాకెట్‌ ప్రయోగాలను ఇస్రో చేపట్టాల్సి ఉంది. ఇలాంటి ప్రయోగాల కోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న రెండు ప్రయోగ వేదికలు సరిపోవు, వీటి కోసం ప్రత్యేక వేదిక కావాలని ఆలోచన చేస్తున్నారు అధికారులు. అయితే ప్రత్యేక లాంచ్ ప్యాడ్ నిర్మించాలంటే దానికి 3వేల కోట్ల రూపాయలకుపైగా నిధులు కావాల్సి ఉంటుంది.

ప్రస్తుతం షార్ లో రెండు లాంచింగ్ ప్యాడ్ లు ఉన్నాయి. వీటికి తోడు అదనంగా మూడో లాంచింగ్ ప్యాడ్ నిర్మించాలంటే 3వేల కోట్లు నిధులు కావాలి, దానికి అదనపు సమయం కూడా పడుతుంది. కొత్త లాంచింగ్ ప్యాడ్ ఏర్పాటు చేయాలంటే ఐదేళ్లకుపైగా సమయం పడుతుంది. అందుకే ఈప్రతిపాదన విరమించుకున్నారు శాస్త్రవేత్తలు. ప్రస్తుతం ఉన్న రెండో వేదికనే దానికి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసేందుకు సిద్ధమయ్యారు. దీనిపై నుంచే గగన్‌ యాన్‌, చంద్రయాన్‌-3, ఆదిత్య-ఎల్‌ 1 వంటి రాకెట్‌ ప్రయోగాలు చేయాలని భావిస్తున్నారు.

మార్పులు, చేర్పులు ఇలా..

కొత్త ప్రయోగ వేదిక నిర్మాణానికి 3వేల కోట్లు అవసరం, అయితే ఇప్పుడున్న రెండో లాంచింగ్ ప్యాడ్ ను భారీ ప్రయోగాలకు అనుగుణంగా మలచుకోవాలంటే రూ.400 కోట్ల ఖర్చుచేస్తే సరిపోతుందని శాస్త్రవేత్తలు అంచనాకు వచ్చారు. దీంతో ఆధునీకరణ పనులు చేపట్టబోతున్నారు. ప్రస్తుతం జి.ఎస్.ఎల్.వి మార్క్‌3 వాహకనౌకలో ఎల్‌110 మోటర్లు ఉపయోగిస్తున్నారు. దీని తర్వాత జరిగే ఎల్.వి.ఎం., జి.ఎస్.ఎల్.వి వాహకనౌకలకు సెమీ క్రయోజనిక్ ఇంజిన్లు ఉపయోగిస్తారు. వీటిని దృష్టిలో ఉంచుకుని సెమీ క్రయో స్టోరేజ్‌ తోపాటు అవసరమైన వసతులు రెండో లాంచింగ్ ప్యాడ్ వద్ద ఏర్పాటు చేస్తున్నారు. కేవలం దీనికోసమే రూ.300 కోట్లు ఖర్చు చేస్తున్నారు.

బెంగళూరులో గగన్ యాన్ పనులు..

గగన్‌ యాన్‌ ప్రయోగాలకు అవసరమైన పనులు బెంగళూరులో జరుగుతున్నాయి. దీనికోసం 100 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత అవసరాలను దృష్టిలో ఉంచుకుని రెండో లాంచింగ్ ప్యాడ్ లోనే మార్పులు చేస్తున్నామని షార్‌ ఉన్నతాధికారులు వెల్లడించారు.

టాప్ హెడ్ లైన్స్

BPCL Refinery Project: ఏపీలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు.. లక్ష కోట్లతో బీపీసీఎల్‌ రిఫైనరీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్
ఏపీలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు.. లక్ష కోట్లతో బీపీసీఎల్‌ రిఫైనరీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్
CM Chandrababu: వైసీపీ 880 కి.మీ రోడ్లు.. రెండేళ్లలో కూటమి 6,500 కి.మీ- పవన్ కళ్యాణ్‌పై సీఎం చంద్రబాబు ప్రశంసలు
వైసీపీ 880 కి.మీ రోడ్లు.. రెండేళ్లలో కూటమి 6,500 కి.మీ- పవన్ కళ్యాణ్‌పై సీఎం చంద్రబాబు ప్రశంసలు
AP TET Results: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. స్కోర్ కార్డ్ ఇలా డౌన్ లోడ్ చేసుకోండి
ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. స్కోర్ కార్డ్ ఇలా డౌన్ లోడ్ చేసుకోండి
AP Municipal Corporations: ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ల వార్డుల పునర్విభజన షెడ్యూల్ విడుదల
ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ల వార్డుల పునర్విభజన షెడ్యూల్ విడుదల

వీడియోలు

India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Medicine Nobel Prize: మెడిసిన్ విభాగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. ఒక్కో విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే 
మెడిసిన్ విభాగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. ఒక్కో విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే 
Supreme Court Notices To Gyanesh Kumar: సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
Telangana Finances: బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
Hyderabad Tank Bund Accident: ట్యాంక్ బండ్‌పై పెను విషాదం.. పుట్టినరోజు నాడే ఆరేళ్ల చిన్నారి మృతి
ట్యాంక్ బండ్‌పై పెను విషాదం.. పుట్టినరోజు నాడే ఆరేళ్ల చిన్నారి మృతి
Harish Rao Siddipet : సిరిసిల్ల తర్వాత సిద్ధిపేటపై రేవంత్ కన్ను - హరీష్ రావు కోటలో కాంగ్రెస్ రణభేరి ఫలిస్తుందా?
సిరిసిల్ల తర్వాత సిద్ధిపేటపై రేవంత్ కన్ను - హరీష్ రావు కోటలో కాంగ్రెస్ రణభేరి ఫలిస్తుందా?
YSRCP Local Elections Strategy: స్థానిక ఎన్నికల్లో జగన్ మార్క్ క్లాస్ - కూటమి విభేదాలపై వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అటాక్ -
స్థానిక ఎన్నికల్లో జగన్ మార్క్ క్లాస్ - కూటమి విభేదాలపై వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అటాక్ -
కియా కార్ల దసరా సేల్‌.. రూ.1.70 లక్షల వరకు ప్రయోజనాలు.. అక్టోబర్ ఆఫర్ల పూర్తి లిస్ట్
కియా కార్లపై దసరా ఆఫర్లు.. ఈ పండుగ టైమ్‌లో రూ.1.70 లక్షల వరకు ఆదా!
MLA Chintamaneni Prabhakar: వెదురుపావులూరు టోల్ ప్లాజా ఘటనలో ఎమ్మెల్యే చింతమనేని ఏ సంబంధం లేదు, అసలేం జరిగిందంటే
వెదురుపావులూరు టోల్ ప్లాజా ఘటనలో ఎమ్మెల్యే చింతమనేని ఏ సంబంధం లేదు, అసలేం జరిగిందంటే
Embed widget