News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Nupur Sharma Issue: వాళ్లపై దేశ ద్రోహం కేసు పెట్టాల్సిందే, వైసీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు

మత సామరస్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ పై నామమాత్రపు చర్యలు తీసకోవడం కాకుండా, దేశద్రోహం నేరం క్రింద కేసులు నమోదు చేయాలని వైసీపీ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.

FOLLOW US: 
Share:

మత సామరస్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ పై నామమాత్రపు చర్యలు తీసుకోవడం కాకుండా, దేశద్రోహం నేరం క్రింద కేసులు నమోదు చేసి, జైలుకి పంపించాలని డిమాండ్ చేశారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. హిందు, ముస్లిం, క్రిస్టియన్, సిక్కు.. ఇలా ఏ మత మనోభావాల పట్ల, ఆచారాల పట్ల సంకుచిత, అనుచిత వ్యాఖ్యలు చేసే వ్యక్తులకు.. టెర్రరిస్ట్ లకు వేసే శిక్ష వేయాలని కోరారు. అలా చేస్తేనే.. ఇలాంటి ఘటనలు పునరావృతం కావని అన్నారు. 

మహమ్మద్ ప్రవక్త, ఇస్లాం ధర్మంపై బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ చేసిన అనుచిత వ్యాఖ్యలని ముస్లిం సమాజంపై దాడి, భారతీయ సమాజాన్ని విచ్చిన్నం చేసే ప్రయత్నంగా భావిస్తున్నామని అన్నారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ మహమ్మద్ ప్రవక్త, ఇస్లాంపై చేసిన వ్యాఖ్యలు అనుచితమే కాకుండా.. దారుణం, దుర్మార్గం అని కూడా అన్నారాయన. ఆ వ్యాఖ్యల్ని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తన్నానని, ఖండిస్తున్నానని చెప్పారు. నెల్లూరులోని తన కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించిన రూరల్ ఎమ్మెల్యే.. నుపుర్ శర్మ వ్యాఖ్యలను సమాజం హర్షించదని చెప్పారు. 

విభిన్న కులాలు, విభిన్న మతాలు, విభిన్న జాతులు కలిసి వసుదైక కుటుంబంగా భారత దేశం విరాజిల్లుతోందని చెప్పారు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి. భారతీయ సమాజంలో ఇలాంటి వ్యాఖ్యలు ప్రజల మధ్య  చిచ్చు పెడతాయని చెప్పారు ప్రజా జీవానికి విఘాతం కలిగించేలా పనిచేస్తాయని అన్నారు. మత సామారస్యాన్ని దెబ్బతీస్తాయని చెప్పారు. 

ఇప్పటికే నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ పై బీజేపీ సస్పెన్షన్ వేటు వేసింది. అయితే ఇది కేవలం సస్పెన్షన్ తో సరిపెట్టేది కాదని, వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి. జాతి విచ్ఛిన్నం, దేశద్రోహం, మత సామరస్యానికి విఘాతం కలిగించే చర్యలుగా వారి వ్యాఖ్యలను భావించాల్సి ఉంటుందని చెప్పారు. దేశద్రోహం నేరం క్రింద కేసులు నమోదు చేసి జైలుకి పంపించాలని కోరారు. 

మత విద్వేష వ్యాఖ్యలు చేసే వారికి, టెర్రరిస్ట్ లకు తేడా లేదని అన్నారు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి. టెర్రరిస్టులమీద ఎలాంటి చట్టాలు ప్రయోగిస్తున్నామో.. అలాంటి చట్టాలనే మత విద్వేష వ్యాఖ్యలు చేసే వారిపై ప్రయోగించాలని, అలాంటి చట్టాల ఆధారంగా వారిని శిక్షించాలని చెప్పారు. అప్పుడే ఇలాంటి ఘటనలు పునరావృతం కావని అన్నారు. 

ఇప్పటికే పలువురు నాయకులు నుపుర్ శ్రమ వివాదంపై స్పందించారు. ముఖ్యంగా తెలంగాణలో మైనార్టీ ప్రజలు కూడా వీధుల్లోకి వచ్చి తమ నిరసన తెలియజేశారు. కాంగ్రెస్ నేతలు పలువురు తీవ్రంగా స్పందించారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న టీఆర్ఎస్ కూడా ఈ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించింది. ఇప్పుడు ఏపీ నుంచు వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా ఈ విషయంపై స్పందించారు.

Published at : 12 Jun 2022 05:08 PM (IST) Tags: Nellore news Nellore Update Kotamreddy Sridhar Reddy nellore ysrcp rural mla Nupur sharma Naveen Jindal

ఇవి కూడా చూడండి

Top Headlines Today: యశోదలో చేరిన మాజీ సీఎం కేసీఆర్- రేపటి నుంచి తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం

Top Headlines Today: యశోదలో చేరిన మాజీ సీఎం కేసీఆర్- రేపటి నుంచి తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం

APPSC Group 2 Recruitment: ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల, 897 ఖాళీల భర్తీకి డిసెంబరు 21 నుంచి దరఖాస్తులు

APPSC Group 2 Recruitment: ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల, 897 ఖాళీల భర్తీకి డిసెంబరు 21 నుంచి దరఖాస్తులు

SI Exam Results: ఎస్‌ఐ పరీక్ష తుది ఫలితాలు విడుదల, ఫైనల్ ఆన్సర్ 'కీ' అందుబాటులో

SI Exam Results: ఎస్‌ఐ పరీక్ష తుది ఫలితాలు విడుదల, ఫైనల్ ఆన్సర్ 'కీ' అందుబాటులో

AP High Court: ఎస్‌ఐ ఫలితాల వెల్లడికి లైన్ క్లియర్, 'స్టే' ఎత్తివేసిన హైకోర్టు

AP High Court: ఎస్‌ఐ ఫలితాల వెల్లడికి లైన్ క్లియర్, 'స్టే' ఎత్తివేసిన హైకోర్టు

Breaking News Live Telugu Updates: చంద్రబాబుతో పవన్ కల్యాణ్ సమావేశం- హాజరైన లోకేష్, మనోహర్

Breaking News Live Telugu Updates: చంద్రబాబుతో పవన్ కల్యాణ్ సమావేశం- హాజరైన లోకేష్, మనోహర్

టాప్ స్టోరీస్

Telangana News: రేవంత్ అన్నంత పని చేస్తున్నారా? అప్పట్లో అదో పెద్ద దుమారం! తొలిరోజు ఆయనే అసలు టార్గెట్!

Telangana News: రేవంత్ అన్నంత పని చేస్తున్నారా? అప్పట్లో అదో పెద్ద దుమారం! తొలిరోజు ఆయనే అసలు టార్గెట్!

Extra Ordinary Man X Review - 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' ఆడియన్స్ రివ్యూ: 'దిల్' రాజునూ వాడేసిన నితిన్ - ట్విట్టర్ టాక్ ఎలా ఉందంటే?

Extra Ordinary Man X Review - 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' ఆడియన్స్ రివ్యూ: 'దిల్' రాజునూ వాడేసిన నితిన్ - ట్విట్టర్ టాక్ ఎలా ఉందంటే?

Vizag Pawan Kalyan : ఏపీ భవిష్యత్ కోసమే టీడీపీ, జనసేన కూటమి - విశాఖలో పవన్ కీలక వ్యాఖ్యలు !

Vizag Pawan Kalyan :  ఏపీ భవిష్యత్ కోసమే టీడీపీ, జనసేన కూటమి - విశాఖలో పవన్ కీలక వ్యాఖ్యలు !

Vadhuvu Web Series Review - వధువు వెబ్ సిరీస్ రివ్యూ: అవికా గోర్‌కి పెళ్లి - ఎందుకు మళ్ళీ మళ్ళీ?

Vadhuvu Web Series Review - వధువు వెబ్ సిరీస్ రివ్యూ: అవికా గోర్‌కి పెళ్లి - ఎందుకు మళ్ళీ మళ్ళీ?