అన్వేషించండి

Mekapati Vikram Nomination: ఆత్మకూరు ఉప ఎన్నికల కోసం విక్రమ్ రెడ్డి నామినేషన్, గెలుపుపై ధీమా

Atmakur Bypol: ఆత్మకూరు ఉప ఎన్నికల్లో అధికార వైసీపీ అభ్యర్థిగా మేకపాటి విక్రమ్ రెడ్డి నామినేష్ దాఖలు చేశారు. అట్టహాసంగా ఈ కార్యక్రమం జరిగింది.

Mekapati Vikram Reddy Files Nomination: ఆత్మకూరు ఉప ఎన్నికల్లో అధికార వైసీపీ అభ్యర్థిగా మేకపాటి విక్రమ్ రెడ్డి నామినేష్ దాఖలు చేశారు. అట్టహాసంగా ఈ కార్యక్రమం జరిగింది. నెల్లూరులోని తన ఇంటిలో పూజా కార్యక్రమం నిర్వహించిన అనంతరం తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుని విక్రమ్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి బయలుదేరారు. దివంగత నేత గౌతమ్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం తన రాజకీయ ప్రస్థానంలో తొలి అడుగు వేశారు తమ్ముడు విక్రమ్ రెడ్డి. పెద్ద కొడుకు హఠాన్మరణం, చిన్న కొడుకు రాజకీయ అరంగేట్రంతో వారి తల్లి తీవ్ర భావోద్వాగానికి గురయ్యారు.Mekapati Vikram Nomination: ఆత్మకూరు ఉప ఎన్నికల కోసం విక్రమ్ రెడ్డి నామినేషన్, గెలుపుపై ధీమా

అనంతరం జిల్లా మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఇతర కీలక నేతలు వారి వెంట రాగా.. ఆత్మకూరు బయలుదేరారు. ఆత్మకూరు వద్ద ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం, తిరిగి మసీదులో ప్రార్థనలు జరిపారు. అక్కడినుంచి ఆర్డీవో ఆఫీస్ కి చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు. ఆత్మకూరు పట్టణంలో ఓపెన్ టాప్ జీప్ లో ఊరేగింపుగా వెళ్లారు విక్రమ్ రెడ్డి.

ఆత్మకూరులోనీ ఆర్డీవో ఆఫీస్ లో ఆయన నామినేషన్ దాఖలు చేశారు. బుధవారం ఆయనకు సీఎం జగన్ బీ-ఫామ్ అందజేశారు. వైసీపీ అభ్యర్థిగా ఈరోజు విక్రమ్ రెడ్డి నామినేషన్ వేశారు. ఆర్వో హరేందిర ప్రసాద్ కి ఆయన నామినేషన్ పత్రాలు అందజేశారు. ఎంపీ, మంత్రి, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

విజయం మాదే.. 
ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు మేకపాటి విక్రమ్ రెడ్డి. ఇప్పటికే ఆయన గడప గడపకు వైసీపీ కార్యక్రమం ద్వారా సగం నియోజకవర్గాన్ని కవర్ చేశారు. పరిచయ కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్లారు. అన్న గౌతమ్ రెడ్డిపై ఉన్న అభిమానంతోపాటు, వైసీపీ అందిస్తున్న సంక్షేమ పథకాలు కూడా తన విజయానికి దోహదపడతాయని చెప్పారు విక్రమ్ రెడ్డి. మరోవైపు విక్రమ్ రెడ్డికి పోటీగా ప్రధాన పార్టీలేవీ ఇంకా తమ అభ్యర్థులను నిలబెట్టలేదు. కనీసం ప్రచారంలో కూడా వారు ముందు లేరు. దీంతో వార్ వన్ సైడేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 

ఆత్మకూరు  ఉప ఎన్నికల షెడ్యూల్ 

నామినేషన్ల ప్రారంభం  మే 30, 2022

నామినేషన్ల చివరి తేదీ  జూన్ 6, 2022

ఎన్నికల తేదీ    23 జూన్, 2022

కౌంటింగ్, ఫలితాల ప్రకటన  26 జూన్, 2022....

టాప్ హెడ్ లైన్స్

Breaking News:ఏపీ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోంది--కళ్లు నెత్తికెక్కే ఓడిపోయాం- కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఏపీ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోంది--కళ్లు నెత్తికెక్కే ఓడిపోయాం- కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan: సొంత ఖర్చులతోనే పవన్ కల్యాణ్ సర్జరీలు! డిప్యూటీ సీఎం ఆఫీస్ కీలక ప్రకటన!
సొంత ఖర్చులతోనే పవన్ కల్యాణ్ సర్జరీలు! డిప్యూటీ సీఎం ఆఫీస్ కీలక ప్రకటన!
Chandrababu Naidu CID Case Quashed: అమరావతి అసైన్డ్‌ భూముల కేసు కొట్టివేత! సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసు కొట్టివేత! సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట!
Andhra Pradesh RTGS: భార్య బైక్ కొట్టేసిన భర్త! పట్టించిన చంద్రబాబు టెక్నాలజీ! ఒక్క దెబ్బకు 80 కేసులు ఛేదించిన పోలీసులు!
భార్య బైక్ కొట్టేసిన భర్త! పట్టించిన చంద్రబాబు టెక్నాలజీ! ఒక్క దెబ్బకు 80 కేసులు ఛేదించిన పోలీసులు!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IRCTC New Website: IRCTC కొత్త వెబ్‌సైట్ వచ్చేసింది! చాలా వేగంగా రైలు టిక్కెట్ బుకింగ్! తీసుకొచ్చిన మార్పులివే!
IRCTC కొత్త వెబ్‌సైట్ వచ్చేసింది! చాలా వేగంగా రైలు టిక్కెట్ బుకింగ్! తీసుకొచ్చిన మార్పులివే!
India UK CETA Trade Agreement: తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
Pawan Kalyan Doctor: పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
IND VS ENG 2nd ODI Clash: ఇండియాకు గిల్ ఫిట్‌నెస్ టెన్షన్.. రోహిత్ ఫామ్ పై పెరిగిన ప్రెజర్, ఇంగ్లాండ్‌తో సిరీస్ డిసైడర్ పోరుకు టీమిండియా రెడీ! సిరీస్ పై క‌న్ను
ఇండియాకు గిల్ ఫిట్‌నెస్ టెన్షన్.. రోహిత్ ఫామ్ పై పెరిగిన ప్రెజర్, ఇంగ్లాండ్‌తో సిరీస్ డిసైడర్ పోరుకు టీమిండియా రెడీ! సిరీస్ పై క‌న్ను
Telangana Gurukulam Funds Scam: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై పదివేల కోట్ల స్కామ్ ఆరోపణలు - జైలుకెళ్లడానికి సిద్ధమన్న మాజీ ఐపీఎస్
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై పదివేల కోట్ల స్కామ్ ఆరోపణలు - జైలుకెళ్లడానికి సిద్ధమన్న మాజీ ఐపీఎస్
ICC Major In World Cups: వన్డే, టీ20 వరల్డ్ కప్ ల ఫార్మాట్ లో ఐసీసీ మైండ్ బ్లాకింగ్ చేంజెస్..
వన్డే, టీ20 వరల్డ్ కప్ ల ఫార్మాట్ లో ఐసీసీ మైండ్ బ్లాకింగ్ చేంజెస్..
CM Chandrababu Naidu Speech: ప్రతి వర్షపు చుక్కను భూగర్భ జలంగా మార్చుకోవాలి - సీఎం చంద్రబాబు పిలుపు
ప్రతి వర్షపు చుక్కను భూగర్భ జలంగా మార్చుకోవాలి - సీఎం చంద్రబాబు పిలుపు
Jana Nayagan Release Date : జన నాయగన్ అఫీషియల్ రిలీజ్ డేట్ - ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారుగా...
జన నాయగన్ అఫీషియల్ రిలీజ్ డేట్ - ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారుగా...
Embed widget