అన్వేషించండి

Nellore: నెల్లూరు టు తిరుపతి, కమిషనర్ హరిత మళ్లీ హడలెత్తించారంతే

సదరు వీఆర్వో యూనిఫామ్ ఎందుకు వేసుకోలేదు అని ప్రశ్నించారు కమిషనర్. నా యూనిఫామ్ ని ఎలుకలు కొట్టేశాయి మేడం అంటూ వింత సమాధానమిచ్చారు వీఆర్వో ప్రసాద్. దీంతో కమిషనర్ కి కోపం వచ్చింది.

ఇటీవల ఏపీలో అధికారుల బదిలీలు జోరుగా సాగాయి. నెల్లూరు కమిషనర్ గా పని చేస్తున్న ఐఏఎస్ హరిత ఇటీవలే తిరుపతికి బదిలీపై వెళ్లారు. తిరుపతి కమిషనర్ గా ఆమె బాధ్యతలు తీసుకున్న తర్వాత వరుస మీటింగ్ లతో తన మార్క్ చూపించారు. నెల్లూరులో కూడా ఆమె స్ట్రిక్ ఆఫీసర్ అని పేరుతెచ్చుకున్నారు. ముఖ్యంగా సచివాలయ స్టాఫ్ పనితీరుపై ఆమె నిరంతరం నిఘా పెట్టేవారు. రోజుకొక సచివాలయాన్ని సందర్శించేవారు, అక్కడ జరుగుతున్న పనులను అడిగి తెలుసుకునేవారు. స్పందన కార్యక్రమంలో బాధితులిచ్చిన అర్జీలను కూడా వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకునేవారు. ఈ క్రమంలో ఆమె నెల్లూరునుంచి తిరుపతి వెళ్లినా కూడా అక్కడ తన హవా చూపించారు. తాజాగా ఓ వీఆర్వోపై సస్పెన్షన్ వేటు వేసి రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపారు. 

వీఆర్వో సస్పెన్షన్ అనేది సాధారణ విషయమే ఆయినా, దానికి గల కారణం తెలిస్తే మాత్రం విస్తుపోవాల్సిందే. వీఆర్వో యూనిఫామ్ వేసుకోలేదని ఆమె సస్పెండ్ చేశారు. తిరుపతి నగర పాలక సంస్థ పరిధిలో పనిచేస్తున్న వీఆర్వో ప్రసాద్, తలతిక్క సమాధానం చెప్పి సస్పెండ్ అయ్యారు. కొత్త కమిషనర్ విషయం తెలియక, లైట్ తీసుకున్న ప్రసాద్.. సస్పెన్షన్ వేటు పడే సరికి షాకయ్యారు. 

ఏపీ ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు యూనిఫామ్ అందించింది. యూనిఫామ్ క్లాత్ ని ఉచితంగా ఇచ్చిన ప్రభుత్వం వాటిని కుట్టించుకోవాలని ఉద్యోగులకు చెప్పింది. కొత్తగా రిక్రూట్ అయినవారంతా దాదాపుగా యూనిఫామ్ వేసుకుంటున్నారు. పాత స్టాఫ్.. అంటే అప్పటికే వీఆర్వోలు, పంచాయతీ సెక్రటరీలుగా పనిచేస్తున్నవారు మాత్రం ఇంకా యూనిఫామ్ జోలికి వెళ్లలేదు. గ్రామాల్లో పరిస్థితితో పోల్చి చూస్తే మున్సిపాల్టీలు, నగర కార్పొరేషన్ల పరిధిలో పనిచేసే వార్డు సచివాలయ స్టాఫ్ తప్పనిసరిగా యూనిఫామ్ లోనే విధులకు హాజరవుతున్నారు. నెల్లూరు నగర కార్పొరేషన్లో అన్ని వార్డుల సచివాలయ స్టాఫ్ యూనిఫామ్ తోనే వచ్చేవారు. ఇక్కడ అలాంటి సిస్టమ్ అలవాటైంది. అయితే తిరుపతిలో మాత్రం ఆ సిస్టమ్ ఇంకా అలవాటైనట్టు లేదు. కొత్త కమిషనర్ వచ్చినా కూడా యూనిఫామ్ ని ఉద్యోగులు లైట్ తీసుకున్నారు. మిగతా వారి సంగతేమో కానీ.. వీఆర్వో ప్రసాద్ మాత్రం యూనిఫామ్ లేకపోవడానికి విచిత్రమైన కారణం చెప్పి అడ్డంగా బుక్కయ్యారు. 

ఎలుకలు కొట్టేశాయంట..
నెల్లూరు నుంచి తిరుపతి బదిలీపై వెళ్లిన హరిత అక్కడి సమస్యలు తెలుసుకోడానికి జూమ్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఉదయాన్నే ఉద్యోగులంతా సచివాలయాలకు వచ్చిన తర్వాత తమ ఆఫీస్ లనుంచే ఈ మీటింగ్ లో పాల్గొన్నారు. వీఆర్వో ప్రసాద్ మాత్రం సివిల్ డ్రస్ లో హాజరయ్యారు. సదరు వీఆర్వో యూనిఫామ్ ఎందుకు వేసుకోలేదు అని ప్రశ్నించారు కమిషనర్. నా యూనిఫామ్ ని ఎలుకలు కొట్టేశాయి మేడం అంటూ వింత సమాధానమిచ్చారు వీఆర్వో ప్రసాద్. దీంతో కమిషనర్ కి కోపం వచ్చింది. అతని పర్ఫామెన్స్ కూడా తెలుసుకున్నారు. పనితీరు బాలేదని, యూనిఫామ్ విషయంలో చెప్పింది అబద్ధమని అనిపిస్తోందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సిల్లీ రీజన్స్ చెబుతావా అంటూ సస్పెన్షన్ వేటు వేశారు. ఈ వ్యవహారం తిరుపతిలో కలకలం రేపింది. ప్రభుత్వం ఉచితంగా యూనిఫామ్ ఇచ్చినా కొంతమంది దాన్ని ధరించడానికి ఇష్టపడటంలేదు. అయితే ఇప్పుడిలా ఏకంగా సస్పెన్షన్ వేటు పడే సరికి ఉద్యోగుల్లో కలకలం రేగింది. సదరు వీఆర్వో వివరణ ఇచ్చుకున్నారా, లేక కమిషనర్ కనికరించి వదిలేస్తారా అనేది తేలాల్సి ఉంది. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Arpitha Mohithe: తెలుగు బుల్లితెర వారసురాలు.. అర్పిత గురించి మీకు తెలియని విషయాలు!
తెలుగు బుల్లితెర వారసురాలు.. అర్పిత గురించి మీకు తెలియని విషయాలు!
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Embed widget