By: ABP Desam | Updated at : 18 Jun 2022 06:45 PM (IST)
ఆత్మకూరులో మీడియాతో మాట్లాడుతున్న పురంధేశ్వరి
ఏపీలో బీజేపీ నేతలు అధికార వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంపై దాడి ముమ్మరం చేశారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర మాజీ మంత్రి పురంద్రీశ్వరి వైసీపీపై హాట్ కామెంట్స్ చేశారు.
ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ పాలనతో రాష్ట్రం అధోగతి పాలైందన్నారు బీజేపీ సీనియర్ లీడర్, మాజీ మంత్రి పురేంధేశ్వరి. రాష్ట్రాన్నిఅభివృద్ధి చేయడంలో ప్రజలను మెప్పించడంలో జగన్ పూర్తి విఫలమయ్యారన్ననారు. ఆత్మకూరు రోడ్ల దుస్థితిని వివరించిన ఆమె... ప్రసవవేధనతో ఉన్న మహిళను ఆత్మకూరు రోడ్లపై తీసుకెళ్తే... ఆస్పత్రికి వెళ్లేలోపే ప్రసవం అయిపోయేలా ఉన్నాయి అంటూ వైసీపీ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. ఆత్మకూరులో బీజేపీ విజయం ఖాయమని చెప్పారు పురంధేశ్వరి. బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్‌కి మద్దతుగా ఆమె ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏపీలో వైఎస్‌ఆర్‌సీపీ పాలనపై విరుచుకుపడ్డారు.
ప్రజల విశ్వాసాన్ని ఏపీ సీఎం జగన్ వమ్ము చేశారని అన్నారు. నెల్లూరు జిల్లాలో పుష్కలంగా జలవనరులున్నాయని, సోమశిల వంటి ప్రాజెక్ట్ ఉందని, దీనికితోడు పెన్నా పరివాహక ప్రాంతమంతా సస్యశ్యామలంగా ఉండాల్సిందని అన్నారు. కానీ వైసీపీ అస్తవ్యస్త విధానాలతో.. జిల్లాలోనే వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ఉన్నా కూడా రైతులు అనధికారికంగా క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితి ఏర్పడిందన్నారు పురంద్రీశ్వరి.
తుపాను వల్ల నష్ట పోయిన రైతులకు నష్టపరిహారం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. సంగం బ్యారేజ్ నిర్మాణ పనులు, సోమశిల ప్రాజెక్టు మరమ్మతులు పూర్తి చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో ఉందని చెప్పారు. గౌతమ్ రెడ్డి హయాంలో కూడా ఆత్మకూరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరగలేదని, ఈ నియోజక వర్గానికి వచ్చిన పరిశ్రమల్ని కూడా కడప జిల్లాకు తీసుకెళ్ళారని చెప్పారు. అభివృద్ధి ఆంధ్రా కాదు అప్పులు ఆంధ్రాగా మన రాష్ట్రం తయారైంది. పెట్టుబడిదారులు భయపడే పరిస్థితి ఉందన్నారు పురంధ్రీశ్వరి. అంతర్జాతీయ మీడియాలో సైతం ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చిస్తున్నారని ఎద్దేవా చేశారు.
ఇక ఆత్మకూరు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా బీజేపీ నేతలు వరుస పర్యటనలతో బిజీగా ఉన్నారు. 19వ తేదీన ప్రచారంలో జయప్రద పాల్గొంటారు. 19, 20వ తేదీల్లో సత్యకుమార్, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్, 20వ తేదిన ఆత్మకూరు ఉప ఎన్నిక ప్రచార కార్యక్రమానికి కేంద్ర మంత్రి ఎల్.మురగన్ హాజరవుతారని బీజేపీ నేతలు తెలిపారు.
తీవ్ర తుపానుగా మారుతున్న మిగ్‌జాం - తీరం దాటేది ఏపీలోనే!
Cyclone Michaung: తుపాను సహాయక చర్యలపై సీఎం జగన్ సమీక్ష- ప్రజలకు ఇబ్బంది రావద్దని చంద్రబాబు సూచన
Cyclone Effect in Nellore: నెల్లూరులో భారీ వర్షాలు, చెరువులను తలపిస్తున్న రహదారులు
YS Jagan Review Cyclone Michaung: 140 రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవులు- తుపాను ప్రభావంపై సీఎం జగన్ సమీక్ష
Mobiles hunt by Nellore Police: నెల్లూరులో మొబైల్ హంట్, రూ.1.25 కోట్ల విలువైన సెల్ ఫోన్లు రికవరీ
కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు - తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఎవరు.?
Cyclone Michaung: సైక్లోన్ మిగ్జాం విధ్వంసం మొదలు, తమిళనాడుని ముంచెత్తుతున్న వర్షాలు - ప్రభుత్వం అలెర్ట్
Naa Saami Ranga: ‘నా సామిరంగ’ హీరోయిన్ రివీల్ - నాగార్జునతో నటించే ఛాన్స్ కొట్టేసిన కన్నడ బ్యూటీ
Allu Aravind: అది ఆయన ఫెయిల్యూర్, మా కుటుంబంలో ఎవరికీ పీఆర్వో కాదు: ‘సంతోషం’ వివాదంపై అల్లు అరవింద్ కామెంట్స్
/body>