అన్వేషించండి

RTC Driver: ఆర్టీసీ బస్సులో డీజే సాంగ్స్- అడిగిన ప్రయాణికులను దించేసిన డ్రైవర్, సంచలనంగా మారిన నెల్లూరు ఘటన

ఆర్టీసీ బస్‌లో ఫుల్‌ సౌండ్‌తో పాటలు పెట్టాడు ఆర్టీసీ డ్రైవర్. పాప అనారోగ్యంతో ఉంది... కాస్త తగ్గించమంటే వాళ్లను దించేసిన సంఘటన సంచలనంగా మారుతోంది.

ఇయర్ ఫోన్ లో పాటలు వింటే ఎవరికీ ఇబ్బంది ఉండదు. ఇంట్లో పెద్ద సౌండ్‌తో పాటలు పెట్టుకున్నా ఎవరూ ఏమీ అనరు. కానీ దానికి కూడా ఓ లిమిట్ ఉంటుంది. నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు నుంచి నెల్లూర వెళ్లే ఆర్టీసీ బస్సులో ఓ డ్రైవర్ మ్యూజిక్ ప్లేయర్‌లో పాటలు పెట్టాడు. ఆయన వరకు వినుకుంటే ఎవరికీ సమస్య ఉండేది కాదు. ఫుల్ వాల్యూమ్‌తో అందరి గూబలు గుయ్యమనిపించాడు.  

అదే బస్సులో ఓ పసిపాపతో ఓ ఫ్యామిలీ ప్రయాణిస్తోంది. పాపకు చెన్నైలోని ఓ ఆసుపత్రి తీసుకెళ్తున్నారు. ఆర్టీసీ డ్రైవర్ చేసిన పనికి పాప కాస్త ఇబ్బంది పడటం చూసిన ఆ కన్నవారిలో ఆందోళన మొదలైంది. అసలే మెదడుకు సంబంధిన సమస్యతో పాప చికిత్స పొందుతోంది. మరోసారి డాక్టర్‌కు చూపించేందుకు పాపను తీసుకెళ్తున్నారు. చిన్న సౌండ్‌కి కూడా అదిరి పడే పాప... బస్‌లో డీజే సౌండ్‌కు మరింత ఇబ్బంది పడింది. 

పాప ఇబ్బందిని చూసిన చిన్నారి  తండ్రి వెళ్లి డ్రైవర్‌తో మాట్లాడారు. సౌండ్‌తో అనారోగ్యంతో బాధపడుతున్న తమ బిడ్డ ఇబ్బంది పడుతుందని వివరించారు. సౌండ్ కాస్త తగ్గించమని వేడుకున్నాడు. డ్రైవర్ చాలా తేడాగా అసలు సౌండ్‌ తగ్గించేది లేదని తేల్చి చెప్పేశాడు. ఎంత రిక్వస్ట్ చేసినా చిరాకు పడ్డాడే తప్ప సౌండ్‌ మాత్రం తగ్గించలేదా ఆర్టీసీ డ్రైవర్

బస్‌లో చాలామంది ప్రయాణికులు ఉన్నప్పటికీ ఎవరూ రియాక్ట్ కాలేదు. ఇబ్బంది పడుతున్న వాళ్లు కూడా పాప తండ్రికి మద్దతుగా రాలేదు. చేసేది లేక తన సీట్లో వచ్చి కూర్చున్నాడు ఆ తండ్రి. కాసేపటికి ఆ సౌండ్‌తో అప్పటి వరకు ఇబ్బంది పడుతూ వచ్చిన పాప... ఏడుపు మొదలు పెట్టింది. గుక్కపెట్టి ఏడుస్తోంది. 

పాప ఏడుపు చూసైనా ఆర్టీసీ డ్రైవర్ కనికరిస్తాడులే అనుకొని మరోసారి వెళ్లాడు చిన్నారి తండ్రి. అప్పుడు కూడా డ్రైవర్ పట్టించుకోలేదు. ఈసారి కాస్త కోపంగానే అడిగాడాయన. అటు నుంచి కూడా డ్రైవర్ అదే స్థాయిలో రియాక్ట్ అయ్యారు. ఇదెక్కడి అన్యాయమని పాప తండ్రి అడిగారు. పాపకు ఆరోగ్యం బాగాలేదు.. సౌండ్ తగ్గించమంటే మానవత్వం లేకుండా ఇలాంటి సమాధానం చెప్పడమేంటని నిలదీశారు. 

అదేంటని ప్రశ్నించిన ఆ కుటుంబాన్ని మీకు దిక్కున్నచోట చెప్పుకోమన్నాడు ఆర్టీసీ డ్రైవర్. పాప అనారోగ్యంతో ఉంది, పెద్ద పెద్ద సౌండ్స్ వస్తుంటే ఏడుస్తుంది, కాస్త పాటలు ఆపండి అన్నా కూడా కనికరించలేదు. చివరకు పాప బాధ చూసి తట్టుకోలేక, డ్రైవర్‌తో వాదించలేక ఆ తల్లిదండ్రులు పాపతో కలిసి బస్‌ దిగిపోయారు. బస్‌ ఎక్కడో ఆపమంటే... వాసిలి గ్రామం వద్దకు తీసుకొచ్చి దించేశాడు డ్రైవర్.  

నెల్లూరు జిల్లాలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా సంచలనం రేపింది. బాధిత కుటుంబ సభ్యులు చిన్నారికి మెదడుకి సంబంధించిన చికిత్సకోసం ఆత్మకూరు నుంచి చెన్నై వెళ్లేందుకు నెల్లూరు బస్సులో బయల్దేరారు. నెల్లూరు నుంచి వారు రైలులో చెన్నై వెళ్లాల్సి ఉంది. అయితే బస్సులో డ్రైవర్‌తో గొడవ కారణంగా వారు మధ్యలోనే దిగిపోవాల్సి వచ్చింది. 

ఈ గొడవ కారణంగా వాళ్లు నెల్లూరు చేరుకోవడం లేట్ అయింది. దీంతో వాళ్లు చెన్నై వేళాల్సిన ట్రైన్‌ వెళ్లిపోయింది. ఇప్పుడు ఆ కన్నవారు తమ బిడ్డ ఆరోగ్య పరిస్థితి చూసి కంగారు పడుతున్నారు. పాపకు వ్యాధి తిరగబెట్టిందని త్వరగా చెన్నై తీసుకెళ్లకుంటే ప్రమాదమని ఆందోళన చెందుతున్నారు. 

దీనంతటికి కారణమైన ఆర్టీసీ డ్రైవర్‌పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు బాధితులు. డ్రైవర్ వ్యవహారం సరిగా లేదన.ి.. ఆత్మకూరు బస్ డిపో మేనేజర్‌కు లిఖిత పూరకంగా ఫిర్యాదు చేశారు. 

టాప్ హెడ్ లైన్స్

AP Special TET 2026 Notification: ఏపీలో టీచర్లకు గుడ్ న్యూస్.. స్పెషల్ టెట్ నోటిఫికేషన్ విడుదల- ముఖ్యమైన తేదీలివే
ఏపీలో టీచర్లకు గుడ్ న్యూస్.. స్పెషల్ టెట్ నోటిఫికేషన్ విడుదల- ముఖ్యమైన తేదీలివే
Telangana Assembly Session: సెప్టెంబర్ 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. ఛాన్స్ కోసం చూస్తున్న విపక్షాలు!
సెప్టెంబర్ 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. ఛాన్స్ కోసం చూస్తున్న విపక్షాలు!
Dhruv Jurel Mentality: మాంబా మెంటాలిటీతో జురెల్ సూపర్ సెంచరీ.. జై జవాన్, జై కిసాన్ టాటుకు అర్థం చెప్పిన ధ్రువ్!
మాంబా మెంటాలిటీతో జురెల్ సూపర్ సెంచరీ.. జై జవాన్, జై కిసాన్ టాటుకు అర్థం చెప్పిన ధ్రువ్!
Investment Fraud: తిరుపతి డీఎస్పీ పేరుతో కోట్లలో వసూళ్లు చేసిన గ్యాంగ్.. నిందితుడి అరెస్ట్
తిరుపతి డీఎస్పీ పేరుతో కోట్లలో వసూళ్లు చేసిన గ్యాంగ్.. నిందితుడి అరెస్ట్

వీడియోలు

IND vs SL 2nd Test Day 1 | కోహ్లీ రికార్డ్‌ను బద్దలు కొట్టిన శుభ్‌మన్ గిల్
Yashasvi Jaiswal Fight With Asitha Fernando | అసిథ ఫెర్నాండోతో జైస్వాల్ గొడవ
Serial Actor Charishma Shreekhar Profile | అమ్మోరు' సీరియల్ నటి సక్సెస్ స్టోరీ ఇదే
Anasuya Bharadwaj Emotional Comments | సమాజంపై అనసూయ ఎమోషనల్ వీడియో
Gundenininda Gudigantalu Serial August 24 | రోహిణి, మనోజ్ రూమ్‌కి తాళం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Special TET 2026 Notification: ఏపీలో టీచర్లకు గుడ్ న్యూస్.. స్పెషల్ టెట్ నోటిఫికేషన్ విడుదల- ముఖ్యమైన తేదీలివే
ఏపీలో టీచర్లకు గుడ్ న్యూస్.. స్పెషల్ టెట్ నోటిఫికేషన్ విడుదల- ముఖ్యమైన తేదీలివే
Telangana Assembly Session: సెప్టెంబర్ 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. ఛాన్స్ కోసం చూస్తున్న విపక్షాలు!
సెప్టెంబర్ 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. ఛాన్స్ కోసం చూస్తున్న విపక్షాలు!
Dhruv Jurel Mentality: మాంబా మెంటాలిటీతో జురెల్ సూపర్ సెంచరీ.. జై జవాన్, జై కిసాన్ టాటుకు అర్థం చెప్పిన ధ్రువ్!
మాంబా మెంటాలిటీతో జురెల్ సూపర్ సెంచరీ.. జై జవాన్, జై కిసాన్ టాటుకు అర్థం చెప్పిన ధ్రువ్!
Investment Fraud: తిరుపతి డీఎస్పీ పేరుతో కోట్లలో వసూళ్లు చేసిన గ్యాంగ్.. నిందితుడి అరెస్ట్
తిరుపతి డీఎస్పీ పేరుతో కోట్లలో వసూళ్లు చేసిన గ్యాంగ్.. నిందితుడి అరెస్ట్
Grey Hair : జుట్టు చిన్న వయసులోనే తెల్లబడిపోతుందా? కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
జుట్టు చిన్న వయసులోనే తెల్లబడిపోతుందా? కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
AE Nookaraju Family Suicide Case: సౌజన్య, సాధిక్ రిలేషన్‌లో ఉన్నారు.. మతం మారాలని ఒత్తిడి చేశాడు: కాకినాడ ఎస్పీ
సౌజన్య, సాధిక్ రిలేషన్‌లో ఉన్నారు.. మతం మారాలని ఒత్తిడి చేశాడు: కాకినాడ ఎస్పీ
CM Revanth Reddy: కేంద్రం వివక్షను విదేశాల్లో లేవనెత్తితే దోశద్రోహి అని ముద్ర పడేది: సీఎం రేవంత్ రెడ్డి
కేంద్రం వివక్షను విదేశాల్లో లేవనెత్తితే దోశద్రోహి అని ముద్ర పడేది: సీఎం రేవంత్ రెడ్డి
AP Local Body Elections: ఏపీలో స్థానిక ఎన్నికల షెడ్యూల్- వారిపై కేసులు నమోదు చేస్తామని వార్నింగ్
ఏపీలో స్థానిక ఎన్నికల షెడ్యూల్- వారిపై కేసులు నమోదు చేస్తామని వార్నింగ్
Embed widget