(Source: ECI/ABP News/ABP Majha)
Nellore News : ఇద్దరు రెడ్లు పోతే మరో 10 మంది వస్తారు- ఆనం, కోటంరెడ్డిపై విజయ్ కుమార్ రెడ్డి ఫైర్
Nellore News : ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డిలకు ధైర్యం ఉంటే రాజీనామా చేసి తిరిగి ఎన్నికల్లో గెలవాలని ఆనం విజయ కుమార్ రెడ్డి సవాల్ చేశారు.
Nellore News : వైసీపీ నుంచి ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు బయటకు వెళ్లేందుకు ముందుగా ప్లాన్ చేసుకున్నారని, అందుకే ట్యాపింగ్ ఆరోపణలు చేశారని మాజీ డీసీసీబీ ఛైర్మన్ ఆనం విజయ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఆనం రామనారాయణ రెడ్డి తనకు అన్నే అయినా ఆయన చేసింది తప్పేనని చెప్పారు విజయ్ కుమార్ రెడ్డి. అందుకే వెంకటగిరిలో ఇన్ ఛార్జ్ ను పెట్టాల్సి వచ్చిందని చెప్పారు. ఇన్ ఛార్జ్ లు రాజ్యాంగేతర శక్తులు కాదని, ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న రామనారాయణ రెడ్డే రాజ్యాంగేతర శక్తి అని చెప్పారు. నెల్లూరు రూరల్ లో రౌడీరాజ్యం ఉందని, ఎమ్మెల్యే రౌడీలను ప్రోత్సహించారని విజయకుమార్ రెడ్డి ఆరోపించారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, తన సోదరుడు రామనారాయణ రెడ్డిపై విజయ్ కుమార్ రెడ్డి విమర్శలు చేశారు.
"ఆ ఇద్దరు పార్టీని వీడాలని నిర్ణయించుకుని పార్టీపై బురద జల్లుతున్నారు. ఎమ్మెల్యేలుగా వాళ్లకు సీఎం జగన్ ను కలిసి అవకాశం ఉంది, కానీ వాళ్లు అలా చేయలేదు. సీఎంవో ఎక్కడికైనా వెళ్లగలరు. కోటంరెడ్డి ప్రవర్తన వల్లే మా మధ్య సంబంధాలు చెడిపోయాయి. అధిష్టానం ఆదేశాలతో కోటంరెడ్డిని గెలిపించడానికి శాయశక్తులా పనిచేశాం. ఎన్నికల్లో గెలిచాక కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మార్పువచ్చింది. తాను ఎమ్మెల్యేగా గెలవడానికి సాయంచేసిన వాళ్లందరినీ కోటంరెడ్డి పక్కన పెట్టారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లకు ప్రాధాన్యత ఇచ్చారు. భవిష్యత్ లో నేను ఆయనకు పోటీ వస్తానని నన్ను పక్కన పెట్టారు. కోటంరెడ్డి రౌడీ రాజ్యం చేశారు. వైసీపీ నుంచి కోటంరెడ్డి బయటకు వెళ్లిపోతే సంతోషించే వాళ్లే ఎక్కువ. ఎంత మందికి సహాయం చేసిన ఏదొక స్వార్థం చేసిన వ్యక్తి. మంత్రి, ఇన్ ఛార్జ్ లు కార్పొరేటర్లు, సర్పంచ్ లతో మాట్లాడతారు. శ్రీధర్ రెడ్డి, రామనారాయణ రెడ్డి లకు నిజంగా దమ్ముంటే రాజీనామా చేసి తిరిగి వాళ్ల బొమ్మలతో గెలవండి." - మాజీ డీసీసీబీ ఛైర్మన్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి
కోటంరెడ్డికి సీనియర్లు కౌంటర్
ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఆరోపణలు చేస్తూండటంతో సీనియర్ నేతలు ఎదురుదాడి ప్రారంభించారు. పలువురు మాజీ మంత్రులు సీఎం జగన్ ను క్యాంప్ కార్యాలయంలో కలిశారు. ట్యాపింగ్ అంశం పై కోటంరెడ్డికి మాజీ మంత్రులు కౌంటర్ ఇచ్చారు.. చంద్రబాబు మంత్రి పదవిని ఆఫర్ చేసి ఉంటారని అందుకే కోటం రెడ్డి టీడీపీలో చేరతానని ప్రకటన చేసినట్లుగా ఉందని కొడాలి అనుమానం వ్యక్తం చేశారు. కోటంరెడ్డికి మంత్రి పదవి ఇవ్వడం సాధ్యం కాదని సీఎం జగన్ చెప్పి ఉండవచ్చని, అయితే కోటంరెడ్డి కన్నా సీనియర్లు చాలా మంది ఉన్నారని నాని అన్నారు. మంత్రి పదవి ఆశించి నా దగ్గరకు రావద్దని జగన్ చెబుతున్నారని, ఎమ్మెల్యే సీట్ ఇస్తా పోటీ చెయ్ అని సీఎం జగన్ స్పష్టంగా చెబుతున్నారని చెప్పారు. సామాజిక వర్గ సమీకరణాలు కూడా ముఖ్యమని అన్నారు. శ్రీకాంత్ రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇలా కొంత మంది నేతలు ఉన్నారని, బాలినేని మంత్రి పదవి వదులుకున్న విషయాన్ని కొడాలి గుర్తు చేశారు. సీఎం జగన్ ఫోన్ ట్యాపింగ్ చేసి చెత్త మాటలు వినాల్సిన అవసరం లేదన్నారు. వైసీపీ ప్రతిపక్షం లో ఉండగా 23 మంది పకోడీలు వెళ్లిపోయారు ఏమయ్యిందని నాని ప్రశ్నించారు. ఎస్సి ఎస్టీ బిసి లకు ఎన్ని పడవులు వచ్చాయి... అన్ని అగ్ర కులాలకు ఇస్తే ఎలా అన్న విషయాన్ని జగన్ ఆలోచించారని చెప్పారు. ఉండే వాళ్ళు ఉంటారు పోయే వాళ్ళు పోతారని, చంద్రబాబు గాలి కబుర్లు చెప్పారని ఓడించిన నేతలు ఇప్పుడు మరలా అక్కడికే వెళుతున్నారని వ్యాఖ్యానించారు.