అన్వేషించండి

Nellor News : విక్టర్ ప్రసాద్ ని పదవినుంచి తొలగించాల్సిందే, ఆర్య వైశ్య సంఘం ఆందోళన

రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్, మహాత్మా గాంధీ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం నిరసనలు చేపట్టింది. నెల్లూరు జిల్లో ఆర్యవైశ్య సంఘం నేతలు నిరసన చేపట్టారు.

విక్టర్ ప్రసాద్ వ్యవహారం రోజు రోజుకీ ప్రభుత్వానికి తలనొప్పిలా మారేలా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఆర్యవైశ్యులు విక్టర్ ప్రసాద్ పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. దేశ స్వాతంత్రం కోసం పోరాడిన గాంధీ మహాత్ముడిపై అనుచిత వాఖ్యలు చేసిన ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ విక్టర్‌ ప్రసాద్‌ ను వెంటనే పదవి నుంచి తొలగించాలని ఆర్యవైశ్య ప్రముఖులు డిమాండ్‌ చేశారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఈ ఆందోళనలు మిన్నంటాయి.

కావలి ట్రంకు రోడ్డులోని పొట్టి శ్రీరాములు విగ్రహం నుంచి గాంధీ విగ్రహం వరకు కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు ఆర్యవైశ్య సంఘం నేతలు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ఆయన మనస్సును నొప్పించే విధంగా విక్టర్‌ ప్రసాద్‌ గాంధీపై అనుచిత వాఖ్యలు చేయటం బాధాకరమని అన్నారు. వెంటనే ఆయనను ఆ పదవి నుంచి తొలగించాలన్నారు. ఉన్నత మైన పదవిలో ఉన్న ఆయన గాంధీపై చేసిన వాఖ్యలకు భారతదేశం బాధపడుతోందన్నారు. ఆయనపై చర్యలు తీసుకోకపోతే ఆర్యవైశ్య సంఘంతోపాటు గాంధేయవాదులతో కలిసి ఉద్యమం చేపడతామని చెప్పారు.

రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్, మహాత్మా గాంధీ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం నిరసనలు చేపట్టింది. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. పట్టణం లో నల్ల బ్యాడ్జిలతో ర్యాలీ చేశారు. మహాత్మా గాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేసి శుద్ధి చేశారు. విక్టర్ ప్రసాద్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలనన్నారు. ఆయన్ను వెంటనే ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవి నుంచి తొలగించి అరెస్ట్ చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


Nellor News : విక్టర్ ప్రసాద్ ని పదవినుంచి తొలగించాల్సిందే, ఆర్య వైశ్య సంఘం ఆందోళన

టీడీపీ ఆందోళనలు..

గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను విక్టర్ ప్రసాద్‌ ను వెంటనే ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవి నుంచి తొలగించాలని టీడీపీ నేత మాజీ మంత్రి జవహర్ డిమాండ్ చేశారు. విక్టర్ లాంటి దేశద్రోహులకు జగన్ పాలుపోసి పెంచుతున్నారని ఇప్పుడు గాంధీని కించపరిచిన వ్యక్తులు రేపు అంబేద్కర్‌ నూ కించపరుస్తారని జవహర్ విమర్శించారు. గాంధీజీని కొన్ని కులాలకు పరిమితం చేసే కుట్రగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని అన్నారు. విక్టర్ ప్రసాద్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గాంధీని నీచుడు, దుర్మార్గుడు అంటూ విక్టర్ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై వైశ్యులు స్పందించాలన్నారు.

విక్టర్‌ ప్రసాద్‌ చేసిన వ్యాఖ్యలు పెను వివాదంగా మారే అవకాశం ఉండటంతో మంత్రి మేరుగ నాగార్జున స్పందించారు. విక్టర్ ప్రసాద్ వ్యాఖ్యలతో వైసీపీకి గానీ, ప్రభుత్వానికి గానీ ఎలాంటి సంబంధం లేదన్నారు. విక్టర్ ప్రసాద్ ఎప్పుడూ తమ పార్టీలో లేరని చెప్పారు. ఎస్సీ హక్కుల కోసం పోరాటం చేస్తున్న విక్టర్ ప్రసాద్‌పై ఇతర కులాల హక్కులకు ఇబ్బంది కలిగించకుండా వ్యవహరించాల్సిన బాధ్యత ఉందన్నారు. గాంధీజీపై విక్టర్‌ చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు...

టాప్ హెడ్ లైన్స్

AP Local Elections TDP Janasena Seat Sharing: స్థానిక ఎన్నికల్లో బాబు-పవన్ పొత్తు - అగ్రనేతల లెక్కలు ఓకే.. మరి క్షేత్రస్థాయి కేడర్ సమన్వయం సాధ్యమేనా?
స్థానిక ఎన్నికల్లో బాబు-పవన్ పొత్తు - అగ్రనేతల లెక్కలు ఓకే.. మరి క్షేత్రస్థాయి కేడర్ సమన్వయం సాధ్యమేనా?
Andhra Pradesh Politics: స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జనసేన ఏం కోరుతోంది!
స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జనసేన ఏం కోరుతోంది!
Indrakeeladari Arrangements: ఇంద్రకీలాద్రి శరన్నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు.. విజయవాడ ఉత్సవ్ కు తమిళనాడు సీఎం విజయ్‌కు ఆహ్వానం
ఇంద్రకీలాద్రి శరన్నవరాత్రి ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. తమిళనాడు సీఎం విజయ్‌కు ఆహ్వానం
Tirumala: బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Elevated Corridor: కేబీఆర్ పార్క్ ప్రాజెక్టు రద్దు.. రూ.1090 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం
కేబీఆర్ పార్క్ ప్రాజెక్టు రద్దు.. రూ.1090 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం
Andhra Pradesh Politics: స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జనసేన ఏం కోరుతోంది!
స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జనసేన ఏం కోరుతోంది!
Tirumala: బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Vijayawada Crime News: పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
Smriti Mandhana Captaincy Era:  భారత మహిళల క్రికెట్ కొత్త బాస్ గా స్మృతి మంధాన, ఆర్సీబీ డబుల్ ట్రోఫీ నాయకి చేతుల్లోకి పగ్గాలు
భారత మహిళల క్రికెట్ కొత్త బాస్ గా స్మృతి మంధాన, ఆర్సీబీ డబుల్ ట్రోఫీ నాయకి చేతుల్లోకి పగ్గాలు
Leftover Rice Dosa : రాత్రి అన్నం మిగిలిపోయిందా? పారేయకండి.. ఉదయాన్నే ఇలా దోశలు వేసుకోండి
రాత్రి అన్నం మిగిలిపోయిందా? పారేయకండి.. ఉదయాన్నే ఇలా దోశలు వేసుకోండి
Election Commission Powers: ప్రధానమంత్రిపై చర్యలు తీసుకునే అధికారాలు ఈసీకి ఉన్నాయా?... ఎన్నికల సంఘం ప్రత్యేకతలు ఇవే!
ప్రధానమంత్రిపై చర్యలు తీసుకునే అధికారాలు ఈసీకి ఉన్నాయా?... ఎన్నికల సంఘం ప్రత్యేకతలు ఇవే!
Honda తీసుకొచ్చిన 2 అడ్వెంచర్ బైక్స్ XR300L, XR300 Rally.. ధర, ఫీచర్లు చూసి కొనేయండి
Honda తీసుకొచ్చిన 2 అడ్వెంచర్ బైక్స్ XR300L, XR300 Rally.. ధర, ఫీచర్లు చూసి కొనేయండి
Embed widget