అన్వేషించండి

Nellore arogya Idly : నెల్లూరులో 8 రకాల ఇడ్లీలు, రుచి చూసేందుకు వెళ్లాల్సిందే?

Nellore arogya Idly : సాదా దోశ, రవ్వదోశ, మసాలా దోశ, కారం దోశ, నెయ్యి దోశ, ఇలా చాలా రకాలుంటాయి. కానీ ఇడ్లీలో ఇన్ని రకాలు మీరెప్పుడైనా చూశారా, పోనీ విన్నారా? ఇడ్లీలో ఎన్నిరకాలుంటాయో తెలియాలంటే మాత్రం నెల్లూరు రావాల్సిందే. న

Nellore arogya Idly : దోశల్లో రకరకాలు ఉంటాయి. సాదా దోశ, రవ్వదోశ, మసాలా దోశ, కారం దోశ, నెయ్యి దోశ, ఇలా చాలా రకాలుంటాయి. కానీ ఇడ్లీలో రకాలు మీరెప్పుడైనా చూశారా, పోనీ విన్నారా ? అసలు ఇడ్లీలో ఎన్నిరకాలుంటాయో తెలియాలంటే మాత్రం నెల్లూరు రావాల్సిందే. నెల్లూరులోని ఆరోగ్య ఇడ్లీస్ హోటల్ కి వెళ్లాల్సిందే. 

8 రకాల ఇడ్లీలు

ఇడ్లీ చాలా డెడ్లీ టిఫిన్ అని పెదవి విరుస్తారు చాలా మంది. కానీ ఆరోగ్యం అనే కాన్సెప్ట్ ని మిక్స్ చేసి ఇడ్లీ తయారు చేస్తే కచ్చితంగా అందరికీ నోరూరుతుంది. ఇలాంటి ఇడ్లీనే ఇప్పుడు నెల్లూరులో అందుబాటులో ఉంది. నెల్లూరు నగరంలోని చిల్డ్రన్స్ పార్క్ సెంటర్లో ఆరోగ్య ఇడ్లీస్ పేరుతో ఓ హోటల్ ఉంది. అందులో 8 రకాల ఇడ్లీలు అందుబాటులో ఉంటాయి. ప్లెయిన్ ఇడ్లీ, రాగి ఇడ్లీ, జొన్న ఇడ్లీ, నవధాన్యాల ఇడ్లీ, నల్లబియ్యం ఇడ్లీ.. ఇలా దాదాపు 8 రకాల ఇడ్లీ తయారు చేస్తుంటారు. 

Nellore arogya Idly : నెల్లూరులో 8 రకాల ఇడ్లీలు, రుచి చూసేందుకు వెళ్లాల్సిందే?

ఇడ్లీ లేబరేటరీ

కరోనా తర్వాత ప్రజల్లో ఆరోగ్యంపై శ్రద్ధ పెరగడం వల్లే తనకు ఈ ఆలోచన వచ్చిందని చెబుతున్నాడు హోటల్ నిర్వాహకుడు భరత్. నల్లబియ్యం ఇడ్లీ డయాబెటిక్ రోగులకు ఉపయోగపడుతుందని, రాగి ఇడ్లీతో బోన్ డెన్సిటీ పెరుగుతుందని, పిల్లలు వెజిటబుల్ ఇడ్లీని ఇష్టపడతారని చెబుతున్నారు. యూత్ కోసం ఇదే వెరైటీలతో దోశలు కూడా వేస్తున్నామని చెబుతున్నారు. రాగి దోశ, జొన్నదోశ, ఇలా రకరకాల ఎక్స్పెర్మెంట్లు చేస్తున్నారు భరత్. ముందుగా ఇంటిలో ఈ ప్రయోగాలు చేసి, ఆ తర్వాత హోటల్ లో దాన్ని అమలు చేస్తున్నారట. అంటే ఒక రకంగా ఇది ఇడ్లీ లేబరేటరీ అని చెప్పొచ్చు. 

Nellore arogya Idly : నెల్లూరులో 8 రకాల ఇడ్లీలు, రుచి చూసేందుకు వెళ్లాల్సిందే?

ధర తక్కువే!

వెరైటీ ఇడ్లీ అయినా కూడా దాని రేటు 15 రూపాయలు మాత్రమే తీసుకుంటున్నారు. దాదాపుగా వచ్చిన కస్టమర్లే తిరిగి రిపీట్ అవుతుంటారని, ఒకసారి అలవాటు పడితే కచ్చితంగా తిరిగి తమ వద్దకే వస్తుంటారని చెబుతున్నారు. ఇడ్లీలోకి పల్లీ చట్నీ, అల్లం చట్నీ, టమోటా చట్నీ, మినీ ఇడ్లీలో నెయ్యి వేసి ఇస్తారు. జొమాటో, స్విగ్గీ నుంచి కూడా ఆర్డర్లు వస్తుంటాయి. అసలు ఇడ్లీలో ఇన్ని రకాలుంటాయా అని ఆశ్చర్యపోకండి.  ఇదేదో వెరైటీకోసం చేసిన ప్రయత్నం కాదు, ప్రతి నిత్యం అన్ని రకాల ఇడ్లీలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. వాటితో ఆరోగ్యం ఎలా మెరుగుపరుచుకోవాలో చెబుతున్నారు హోటల్ నిర్వాహకులు. పోనీ రెసిపీ తెలుసుకుని మీరే ఇంట్లో తయారు చేసుకోవాలనుకుంటున్నారా..? దానికైనా ఈ హోటల్ కి ఓసారి వచ్చి వెళ్లాల్సిందే. 

టాప్ హెడ్ లైన్స్

Leopard In Tirumala: తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
Allu Arjun Political Party Rumors: ఐకాన్ స్టార్ టు పొలిటికల్ స్టార్? అల్లు అర్జున్ నయా పార్టీ ప్రచారం వెనుక అసలు నిజమెంత?
ఐకాన్ స్టార్ టు పొలిటికల్ స్టార్? అల్లు అర్జున్ నయా పార్టీ ప్రచారం వెనుక అసలు నిజమెంత?
Deputy CM Pawan Dissatisfaction: డిప్యూటీ సీఎం అప్‌సెట్.. ?ఆ పోలీస్ బాస్‌తో ఏం చెప్పారు..?
డిప్యూటీ సీఎం అప్‌సెట్.. ?ఆ పోలీస్ బాస్‌తో ఏం చెప్పారు..?
Breaking News: 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Leopard In Tirumala: తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
Telangana Political Mind Games: విపక్షాలపై రేవంత్ మార్క్ మైండ్ గేమ్ - ప్రశాంతంగా పాలన చేసుకోనివ్వాల్సిందేనా ?
విపక్షాలపై రేవంత్ మార్క్ మైండ్ గేమ్ - ప్రశాంతంగా పాలన చేసుకోనివ్వాల్సిందేనా ?
Thamizh Murugan Vs God of War: ధనుష్ 'తమిళ్ మురుగన్'... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకు కౌంటరా?
ధనుష్ 'తమిళ్ మురుగన్'... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకు కౌంటరా?
Lenin Collection Day 1: లెనిన్ కలెక్షన్లు... ఫస్ట్ డే అదరగొట్టిన అయ్యగారు - ఎన్ని కోట్లు వచ్చాయంటే?
లెనిన్ కలెక్షన్లు... ఫస్ట్ డే అదరగొట్టిన అయ్యగారు - ఎన్ని కోట్లు వచ్చాయంటే?
విష్ణు సహస్రనామ పఠనం: అద్భుత ప్రయోజనాలు, శక్తి రహస్యాలు!
విష్ణు సహస్రనామ పఠనం: అద్భుత ప్రయోజనాలు, శక్తి రహస్యాలు!
Cancer Risk: అర గంట కంటే ఎక్కువ సేపు కంటిన్యూగా కూర్చుంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్‌! ఆందోళన కలిగిస్తున్న కొత్త పరిశోధన !
అర గంట కంటే ఎక్కువ సేపు కంటిన్యూగా కూర్చుంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్‌! ఆందోళన కలిగిస్తున్న కొత్త పరిశోధన !
CM Revanth Reddy Khammam Sabha: కాచుకో కేసీఆర్! 2029లో 182 సీట్లు.. 117 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం - సీఎం రేవంత్ రెడ్డి సంచలన జోస్యం!
కాచుకో కేసీఆర్! 2029లో 182 సీట్లు.. 117 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం - సీఎం రేవంత్ రెడ్డి సంచలన జోస్యం!
Akhil Akkineni : తండ్రి కాళ్లపై పడిన హీరో అఖిల్ - అయ్యగారితో కింగ్ ఎమోషనల్ మూమెంట్
తండ్రి కాళ్లపై పడిన హీరో అఖిల్ - అయ్యగారితో కింగ్ ఎమోషనల్ మూమెంట్
Embed widget