అన్వేషించండి

ప్రభుత్వ తప్పులను ప్రశ్నించినందుకే చంద్రబాబును జైలుకు పంపారు : నారా లోకేశ్

నాలుగున్నర సంవత్సరాలుగా ప్రభుత్వం చేసిన తప్పులను ప్రశ్నించినందుకే చంద్రబాబును జైలుకు పంపారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు.

నాలుగున్నర సంవత్సరాలుగా ప్రభుత్వం చేసిన తప్పులను బయటకు తీసుకొచ్చినందుకే చంద్రబాబును జైలుకు పంపారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు.  స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్టయి రాజమహేంద్రవరం జైల్లో ఉన్న చంద్రబాబును కుటుంబ సభ్యులు భువనేశ్వరి, బ్రాహ్మణితో కలిసి లోకేశ్‌ ములాఖత్‌ అయ్యారు. ప్రజల తరపున నిరంతరం పోరాటం చేసినందుకు దొంగ కేసు బనాయించి 28 రోజులుగా జుడిషియల్ రిమాండ్ కు పంపారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు, నిరుద్యోగ యువతి యువకుల తరపున పోరాటం చేసినందుకే చంద్రబాబును జైలుకు పంపారన్నారు. టీడీపీ-జనసేన కలిసి సంయుక్తంగా కార్యాచరణ కమిటీ ఏర్పాటు చేస్తామని, కమిటీ సూచనలతో ముందుకెళ్తామని చెప్పారు. టీడీపీ పోరాటం ఆగలేదన్న లోకేశ్, 175 స్థానాల్లో నిరసన చేపడతామన్నారు. గడప గడపకు ‘బాబుతో నేను’ కార్యక్రమాన్ని చేపడతామని తెలిపారు. పాదయాత్ర, ఇతర కార్యక్రమాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. 

న్యాయం జరగడానికి ఆలస్యం అవొచ్చు కానీ...
న్యాయం ఆలస్యం కావచ్చేమో కానీ, తమ వైపే ఉంటుందని లోకేశ్‌ అన్నారు. చంద్రబాబు ఏనాడూ తప్పు చేయలేదని, రిమాండ్‌లో ఉంచినా ఆయన అధైర్య పడలేదని స్పష్టం చేశారు. పోరాటం ఆపవద్దు,  శాంతియుతంగా పోరాడాలని తమతో చెప్పారని లోకేశ్ వెల్లడించారు. న్యాయం గెలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని, న్యాయపోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబును రిమాండ్ కు పంపారన్నారు.

రోజుకో మాట మారుస్తున్నారు
చంద్రబాబును అరెస్ట్ చేసే ముందు 3వేల కోట్ల కుంభకోణం జరిగిందన్నారని, తర్వాత 370 కోట్లని మాట మార్చారని విమర్శించారు. కేవలం కక్ష సాధింపుతోనే చంద్రబాబును జైలుకు పంపారని అన్నారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా పని చేశారని అన్నారు. సైబరాబాద్ కు పునాది వేసింది,  పోలవరం ప్రాజెక్టు 72 శాతం పనులు పూర్తి చేసింది కూడా చంద్రబాబేనన్నారు. శనివారం రాత్రి 7 గంటలకు కొవ్వొత్తులు, మొబైల్‌ ఫ్లాష్‌లైట్లతో ప్రజలు సంఘీభావం తెలపాలని నారా లోకేశ్ పిలుపునిచ్చారు. తమ కుటుంబం మొత్తాన్ని వైసీపీ ప్రభుత్వం రోడ్డుపైకి తెచ్చిందన్న ఆయన, తాము నమ్ముకున్న సిద్ధాంతాల కోసం పోరాటం చేస్తామన్నారు. 

‘కాంతితో క్రాంతి’ నిరసన
మరోవైపు ప్రగతి వెలుగులు పంచే చంద్రుడుని ఫ్యాక్షన్ పాలకులు చీకట్లో నిర్బంధించారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. రేపు రాత్రి 7.00 గంటల నుంచి 7.05 నిమిషాల వరకూ ఇళ్లలో లైట్లు ఆపి, దీపాలు, కొవ్వొత్తులు, మొబైల్ టార్చ్ లైట్ వెలిగించాలని పిలుపునిచ్చారు. వాహనాల లైట్లు బ్లింక్ చేయడం ద్వారా దార్శనికుడు చంద్రబాబుకి సంఘీభావం తెలపాలని నారా లోకేష్ పిలుపునిచ్చారు. ‘కాంతితో క్రాంతి’ పేరిట కార్యక్రమం పేరుతో  నిర్వహించే కార్యక్రమంలో . ‘బాబుతో నేను’ అంటూ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయాలన్నారు. వాకిళ్లు, బాల్కనీలు, వీధుల్లోకి వచ్చి దీపాలు, కొవ్వొత్తులు, మొబైల్ టార్చ్‌లు, టార్చ్ లైట్లు.. వీటిలో వేటినైనా తీసుకుని వెలుగు చూపించాలని నారా లోకేష్ అన్నారు. 5 కోట్లు ఆంధ్రులు ఒక్కటిగా 7 గంటల నుంచి 7.05 నిమిషాల వరకు నిరసన తెలియజేద్దామని పిలుపునిచ్చారు బ్రాహ్మణి.  తాడేపల్లిలోని జగనాసురుని కళ్లు బైర్లు కమ్మేలా కాంతితో క్రాంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, ప్రజలకు పిలుపునిచ్చారు. 

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: సీఎం చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. ఈ నెల 26కి వాయిదా!
సీఎం చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. ఈ నెల 26కి వాయిదా!
National Saras Mela Droupadi Murmu: విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
మూలా నక్షత్రం రోజు అతి తక్కువ సమయంలో ఉచిత దర్శనం, విజయవాడ దుర్గమ్మ భక్తులకు ముఖ్య సూచనలు!
మూలా నక్షత్రం రోజు అతి తక్కువ సమయంలో ఉచిత దర్శనం, విజయవాడ దుర్గమ్మ భక్తులకు ముఖ్య సూచనలు!
YS Jagan Support CJP : CJP నేతల అరెస్ట్‌పై వైఎస్ జగన్ ఫైర్ - ఎన్నికల వ్యవస్థపై నమ్మకం పోయిందని విమర్శలు !
CJP నేతల అరెస్ట్‌పై వైఎస్ జగన్ ఫైర్ - ఎన్నికల వ్యవస్థపై నమ్మకం పోయిందని విమర్శలు !

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
National Saras Mela Droupadi Murmu: విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
Vijay Deverakonda Rashmika : పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Jailer 2 Review - 'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
Today OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
IAS Vikrant Marmat Transfer: బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
CM Chandrababu: సీఎం చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. ఈ నెల 26కి వాయిదా!
సీఎం చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. ఈ నెల 26కి వాయిదా!
Embed widget