అన్వేషించండి

చంద్రబాబుతో నారా లోకేశ్, బ్రాహ్మణి ములాఖత్

Nara lokesh: రాజమండ్రి జైలులో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడును కుటుంబసభ్యులు కలిశారు. నారా లోకేశ్‌, ఆయన సతీమణి బ్రాహ్మణి చంద్రబాబుతో ములాఖత్‌ అయ్యారు.

Nara lokesh: స్కిల్ స్కాం కేసులో అరెస్టై రాజమండ్రి జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును కుటుంబ సభ్యులు సోమవారం కలిశారు. నారా లోకేశ్‌, ఆయన సతీమణి బ్రాహ్మణి ఆయనతో ములాఖత్‌ అయ్యారు. వారితో పాటు పార్టీ నేత మంతెన సత్యనారాయణరాజు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, లోకేశ్‌, బ్రాహ్మణి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. మంచి సాధించ‌బోయే విజ‌యానికి సంకేతం విజ‌య‌ద‌శ‌మి సంబ‌రమంటూ లోకేశ్‌ ట్వీట్ చేశారు. చెడుకి పోయేకాలం ద‌గ్గర ప‌డ‌టం ద‌స‌రా సందేశమన్న ఆయన, ప్రజ‌ల్ని అష్టక‌ష్టాలు పెడుతోన్న జ‌గ‌నాసురుడి పాల‌న అంత‌మే పంతంగా అంతా కలిసి పోరాడ‌దామని పిలుపునిచ్చారు. మరోవైపు రాష్ట్రానికి, ప్రజలకు మంచి జరగాలని అమ్మవారిని కోరుకుంటున్నట్లు నారా భువనేశ్వరి తెలిపారు. నేటి ఈ చీకట్లు తొలగిపోయి మంచి జరగాలని, అందరి ఇళ్లల్లో సంతోషం వెల్లి విరియాలని ఆకాంక్షించారు. 

బ్రాహ్మణి ట్వీట్ 

మరోవైపు నారా లోకేశ్‌ సతీమణి బ్రాహ్మణి ట్వీట్‌ చేశారు. విజయం సాధించే వరకు పోరాడటమే దసరా స్ఫూర్తి అని అన్నారు. 'దేశం చేస్తోంది రావణ దహనం, మనం చేద్దాం జగనాసుర దహనం' అన్న పోస్టర్‌ను బ్రాహ్మణి జత చేశారు. మహిషాసురుడి అంతానికి దుర్గాదేవి 9 రాత్రులు యుద్ధం చేసిందని, విజయం సాధించే వరకు పోరాడటమే దసరా స్ఫూర్తి అని అన్నారు. కలియుగ అసురులను అంతమొందించే వరకు పోరాడదాం అంటూ టీడీపీ శ్రేణులు, తెలుగు ప్రజలకు పిలుపునిచ్చారు. 

స్కిల్ స్కాం కేసు వివరాలు

చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్ష‌ణ ఇస్తామంటూ రూ.3300 కోట్లకు సీమెన్స్ సంస్థ - డిజైన్‌ టెక్ సంస్థ‌లు ఒప్పందం చేసుకున్నాయి. ఇందులో ప్రభుత్వం 10 శాతం నిధులు, మిగిలిన 90 శాతం సీమెన్స్ సంస్థ చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. ప్రభుత్వం తరఫున 10 శాతం వాటాగా జీఎస్టీతో కలిపి రూ.370 కోట్లను అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం చెల్లించింది. ప్ర‌భుత్వం చెల్లించిన రూ.370 కోట్లలో రూ.240 కోట్ల రూపాయ‌ల‌ను సీమెన్స్ సంస్థ పేరుతో కాకుండా డిజైన్‌టెక్ సంస్థ‌కు బ‌ద‌లాయించారంటూ ఏపీ సీఐడీ అభియోగాలు నమోదు చేసింది. కేబినెట్‌ను తప్పుదారి పట్టించి ఆ తర్వాత ఒప్పందంలో మరొకటి పెట్టి డబ్బులు కాజేశారని అభియోగాలు ఉన్నాయి. దీనిపై గత కొంత కాలంగా లోతుగా విచారిస్తున్న సీఐడీ పలువురిపై కేసులు కూడా నమోదు చేసింది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Breaking News: వరుసగా మూడోసారి ఇంధన సెగ! పది రోజుల్లో ఐదు రూపాయలు పెరిగిన పెట్రో ధరలు!
వరుసగా మూడోసారి ఇంధన సెగ! పది రోజుల్లో ఐదు రూపాయలు పెరిగిన పెట్రో ధరలు!
AP Rajya Sabha Elections 2026: ఏపీ రాజ్యసభ ఎన్నికలు 2026 - మిత్రపక్షాల కోసం టీడీపీ త్యాగాలు.. తమ్ముళ్లలో మొదలైన అసంతృప్తి!
ఏపీ రాజ్యసభ ఎన్నికలు 2026 - మిత్రపక్షాల కోసం టీడీపీ త్యాగాలు.. తమ్ముళ్లలో మొదలైన అసంతృప్తి!
Petrol Price Hike May 2026: పది రోజుల్లో మూడోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! మీ ప్రాంతంలో రేట్లు ఎంత?
పది రోజుల్లో మూడోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! మీ ప్రాంతంలో రేట్లు ఎంత?
Heatwave deaths Telangana AP:అగ్ని గుండంలా తెలుగు రాష్ట్రాలు! వడదెబ్బకు పోతున్న ప్రాణాలు! రికార్డులు తిరగరాస్తున్న ఉష్ణోగ్రతలు!
అగ్ని గుండంలా తెలుగు రాష్ట్రాలు! వడదెబ్బకు పోతున్న ప్రాణాలు! రికార్డులు తిరగరాస్తున్న ఉష్ణోగ్రతలు!

వీడియోలు

CSK vs GT IPL 2026 Highlights | గుజరాత్ చేతిలో చెన్నై ఘోర పరాజయం
Ruturaj Comments on Dhoni Retirement | ధోని రిటైర్మెంట్‌పై రుతురాజ్ కామెంట్స్
Ram Charan at Uppal Stadium IPL 2026 | ఐపీఎల్ మ్యాచ్‌లో పెద్ది టీమ్ ప్రమోషన్స్
Hardik Pandya Match Fee Fined IPL 2026 | గ్రౌండ్ లో సహనం కోల్పోయిన హార్దిక్ పాండ్యా
Sai Sudharsan Creates History in IPL 2026 | సాయి సుదర్శన్ హిస్టారికల్ రికార్డ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bandi Bageerath POCSO case: బండి భగీరథ్‌ పోక్సో కేసులో పోలీస్ కస్టడీపై సస్పెన్స్‌! మే 26న కోర్టు తుది నిర్ణయం!
బండి భగీరథ్‌ పోక్సో కేసులో పోలీస్ కస్టడీపై సస్పెన్స్‌! మే 26న కోర్టు తుది నిర్ణయం!
Petrol Price Hike May 2026: పది రోజుల్లో మూడోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! మీ ప్రాంతంలో రేట్లు ఎంత?
పది రోజుల్లో మూడోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! మీ ప్రాంతంలో రేట్లు ఎంత?
Tesla Hyderabad Showroom: గ్లోబల్ సిటీలో గ్లోబల్ కార్: హైదరాబాద్‌కు టెస్లా రాక ఖరారు!
గ్లోబల్ సిటీలో గ్లోబల్ కార్: హైదరాబాద్‌కు టెస్లా రాక ఖరారు!
Aishwarya Rai : కేన్స్‌లో క్వీన్ ఐశ్వర్య - రెడ్ కార్పెట్‌పై దేవకన్యలా విశ్వ సుందరి
కేన్స్‌లో క్వీన్ ఐశ్వర్య - రెడ్ కార్పెట్‌పై దేవకన్యలా విశ్వ సుందరి
Prime Minister Narendra Modi warns Union Ministers బొద్దింక ఎఫెక్ట్‌! మంత్రులకు ప్రధానమంత్రి క్లాస్! రాబోయేది జెన్‌ జీ మంత్రివర్గమే! 
బొద్దింక ఎఫెక్ట్‌! మంత్రులకు ప్రధానమంత్రి క్లాస్! రాబోయేది జెన్‌ జీ మంత్రివర్గమే! 
Kara OTT : ధనుష్ కర ఓటీటీ రిలీజ్ డేట్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ధనుష్ కర ఓటీటీ రిలీజ్ డేట్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
USA Iran Peace Agreement:అమెరికా-ఇరాన్ మధ్య ముగిసిన పోరు! ప్రపంచానికి ఊరటనిచ్చిన శాంతి ఒప్పందం!
అమెరికా-ఇరాన్ మధ్య ముగిసిన పోరు! ప్రపంచానికి ఊరటనిచ్చిన శాంతి ఒప్పందం!
Aishwarya Rai : కేన్స్ ఫెస్టివల్‌లో ఐశ్వర్యా రాయ్ - ట్రెండీ లుక్... డ్రెస్ స్పెషాలిటీస్ ఏంటో తెలుసా!
కేన్స్ ఫెస్టివల్‌లో ఐశ్వర్యా రాయ్ - ట్రెండీ లుక్... డ్రెస్ స్పెషాలిటీస్ ఏంటో తెలుసా!
Embed widget