Nara Bhuvaneswari : రైలు ప్రమాద బాధితులకు పార్టీ పరంగా సాయం - పరామర్శించిన భువనేశ్వరి!
రైలు ప్రమాద బాధితులకు పార్టీ పరంగా సాయం అందిస్తామని నారా భువనేశ్వరి భరోసా ఇచ్చారు. విజయనగరం ఆస్పత్రిలో వారిని పరామర్శించారు.
Nara Bhuvaneswari : విజయగనరం రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి పరామర్శించారు. మంగళవారం ప్రభుత్వాస్పత్రికి చేరుకున్న భువనేశ్వరి.. క్షతగాత్రులను పరామర్శించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం ఎలా జరిగింది, చికిత్స ఎలా అందుతుంది అంటూ బాధితులను అడిగి తెలుసుకున్నారు. రైలు ప్రమాద దుర్ఘటన వివరాలను భువనేశ్వరికి మాజీ మంత్రులు అశోక్ గజపతిరాజు , కళావెంకట్రావు వివరించారు. . పార్టీపరంగా బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు …రైలు దుర్ఘటన బాధితులు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్ధిస్తున్నట్లు భువనేశ్వరి తెలిపారు.
మధ్యంతర బెయిల్ పూర్తయ్యే వరకూ ఏ కేసులోనూ చర్యలు తీసుకోం - హైకోర్టుకు చెప్పిన సీఐడీ !
విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో 13 మంది మృతి చెందగా, 50 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులకు విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. రాజమహేంద్రవరం నుంచి విజయనగరం వచ్చిన నారా భువనేశ్వరి ప్రభుత్వ ఆసుపత్రిలో రైలు ప్రమాద బాధితులతో మాట్లాడి, వారికి ధైర్యం చెప్పారు. వైద్యులను అడిగి బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రైలు ప్రమాద బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు భువనేశ్వరి పేర్కొన్నారు.
చంద్రబాబు వీర యోధుడా ? రోగినా ? - టీడీపీ సంబరాలపై సజ్జల విమర్శలు !
భువనేశ్వరి విజయనగరంలోనే ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడుకు - బెయిల్ మంజూరు అయినట్లుగా తెలిసింది. ఈ అంశంపై నారా భువనేశ్వరి సంతోషం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు బెయిల్ రావడంపై తానే కాదు ప్రజలందరూ సంతోషిస్తున్నారన్నారు. నేడు జనం గెలిచారని.. ఈ సంతోషం అందరిది అని అన్నారు. చంద్రబాబు క్షేమంగా జైలు నుంచి రావాలని ప్రార్థించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే రైలు దుర్ఘటన బాధితులు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్ధిస్తున్నట్లు భువనేశ్వరి తెలిపారు.
డీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తర్వాత రాజమండ్రికి వచ్చిన భువనేశ్వరి గత 53 రోజులుగా అక్కడే ఉన్నారు. చంద్రబాబు విడుదల కోరుతూ అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అలాగే చంద్రబాబు పట్ల ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. పలు మార్లు రాజమండ్రి జైలుకు వెళ్లి చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు. భువనేశ్వరికి పలువురు నేతలు మద్దతు తెలుపుతూ పరామర్శించారు.