![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Chandrababu Case : మధ్యంతర బెయిల్ పూర్తయ్యే వరకూ ఏ కేసులోనూ చర్యలు తీసుకోం - హైకోర్టుకు చెప్పిన సీఐడీ !
చంద్రబాబు మధ్యంతర బెయిల్ గడువు పూర్తయ్యే వరకూ ఏ కేసులోనూ చర్యలు తీసుకోబోమని సీఐడీ ఏపీ హైకోర్టుకు తెలిపింది. కొత్తగా దాఖలు చేసిన మద్యం కేసులో కౌంటర్ వచ్చే నెల పదిహేనో తేదీకి దాఖలు చేస్తామని తెలిపింది.
![Chandrababu Case : మధ్యంతర బెయిల్ పూర్తయ్యే వరకూ ఏ కేసులోనూ చర్యలు తీసుకోం - హైకోర్టుకు చెప్పిన సీఐడీ ! CID told the AP High Court that no action will be taken in any case till Chandrababu's interim bail expires. Chandrababu Case : మధ్యంతర బెయిల్ పూర్తయ్యే వరకూ ఏ కేసులోనూ చర్యలు తీసుకోం - హైకోర్టుకు చెప్పిన సీఐడీ !](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/31/37786ae8b9697c58713d6ad5cad4b29a1698746538995228_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Chandrababu Case : చంద్రబాబు నాయుడుపై ఏపీ సీఐడీ కొత్తగా నమోదు చేసిన మద్యం కేసులో ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన లంచ్‍మోషన్ పిటిషన్‍పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. మధ్యంతర బెయిల్ గడువు పూర్తయ్యే వరకు ఇతర ఏ కేసుల్లో చంద్రబాబుపై చర్యలు తీసుకోమని కోర్టుకు అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ తెలిపారు. మద్యం కేసులో 15న కౌంటర్ దాఖలు చేస్తామని ఏజీ తెలిపారు.దీంతో కేసు విచారణ నవంబర్ 21కి హైకోర్టు వాయిదా వేసింది.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారని ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టనున్నట్లు ఏసీబీ కోర్టు ప్రకటించింది. మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారన్న కేసులో ఏ1గా నరేష్, ఏ2గా కొల్లు రవీంద్ర, ఏ3గా చంద్రబాబు పేర్లను సీఐడీ నమోదు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా మద్యం కంపెనీలకు అనుమతులు ఇచ్చారనే దానిపై పలు అభియోగాలను చేర్చింది. పీసీ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లుగా సీఐడీ వెల్లడించింది.
చంద్రబాబు వీర యోధుడా ? రోగినా ? - టీడీపీ సంబరాలపై సజ్జల విమర్శలు !
ఇప్పటికే చంద్రబాబుపై పలు కేసులు ఉన్నాయి. అందులో ఏపీ ఫైబర్ నెట్ కేసు, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ కేసు, అంగళ్లు కేసుల్లో చంద్రబాబును చేర్చగా స్కిల్ స్కామ్ కేసులో ప్రస్తుతం ఆయనకు బెయిల్ దొరికింది. సెప్టెంబర్ 9వ తేదిన ఆయన్ని సీఐడీ అధికారులు అరెస్ట్ చేయగా 52 రోజుల తర్వాత ఆయనపై మరో కేసును సీఐడీ అధికారులు నమోదు చేశారు. వెంటనే ఏపీ సీఐడీ నమోదు చేసిన ఈ మద్యం కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు లాయర్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. టీడీపీ చీఫ్ దాఖలు చేసిన ఆ బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించి విచారణ జరిపింది.
రాత్రికి రాత్రి కేసు నమోదు చేసిన సీఐడీ.. చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ వియంలో కౌంటర్ దాఖలు చేయడానికి మాత్రం సమయం కావాలని కోరింది. మధ్యంతర బెయిల్ ఇచ్చినందున.. అప్పటి వరకూ చర్యలు తీసుకోబోమని చెప్పడంతో విచారణను హైకోర్టు వాయిదా వేసింది.
రాజమండ్రి జైలు నుంచి సాయంత్రానికి చంద్రబాబు విడుదల- వైద్యం ఎక్కడ చేయించుకుంటారు?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)