అన్వేషించండి

MSME Credit Support Scheme: చిరు వ్యాపారులకు కేంద్రం క్రెడిట్ సపోర్ట్.. ఇ-కామర్స్ ఎక్స్ పోర్ట్స్ స్కీమ్ పూర్తి వివరాలు ఇలా!

MSME Credit Support Scheme: ఆన్ లైన్ ప్లామ్ ఫామ్ ల ద్వారా చిరు వ్యాపారస్తులు తమ ఉత్పత్తులను అంతర్జాతీయంగా విక్రయించుకునేందుకు కేంద్రం ఇ-కామర్స్ ఎక్స్ పోర్టర్స్ క్రెడిట్ సపోర్ట్ పథకాన్ని ప్రారంభించింది.

MSME Credit Support Scheme: ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా చిరు వ్యాపారస్తులు.. తమ ఎగుమతులను పెంచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఒక నూతన ఆర్థిక సహాయ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకాన్ని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT)  అమలు చేస్తున్నాయి. ఎగుమతి ప్రోత్సాహక మిషన్ – నిర్యత్ ప్రోత్సాహన్‌లో భాగంగా  "ఇ-కామర్స్ ఎక్స్ పోర్టర్స్ క్రెడిట్ సపోర్ట్ " అని దీనిని పిలుస్తారు. ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా తమ ఉత్పత్తులను అంతర్జాతీయంగా విక్రయించుకోవడానికి చిన్న వ్యాపారులు ముఖ్యమంగా ఎంఎస్‌ఎంఈలకు ఈ పథకం కింద ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది.

అనేక మంది చిరు వ్యాపారులు ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్‌ల ద్వారా వస్తువులను ఎక్స్ పోర్ట్ చేయాలనుకుంటారు. కానీ ఆర్థిక సవాళ్ల కారణంగా వారికి అది కష్టంగా మారుతుంది. అయితే ఇప్పుడు ఈ పథకం ద్వారా ఆర్థిక సమస్యను పరిష్కరించడానికి ఎగుమతిదారులకు రుణ హామీలు, వడ్డీ మద్దతులను కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది.

ఈ పథకాన్ని ప్రారంభించడానికి కారణాలు

దేశ ఎగుమతుల్లో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. చాలా వరకు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు బ్యాంకు రుణాలు పొందడంలో ఇబ్బందులను ఎదుర్కొంటాయి. ఎందుకంటే ఆర్థిక సంస్థలు వీటిని హై రిస్క్ బారోవర్స్ గా చూస్తాయి.

ఎగుమతిదారులకు మూలధనం సమస్యలను పరిష్కరించేందుకు 
వినియోగదారుల డిమాండ్ లేకపోయినా తమ ఉత్పత్తులను తయారు చేయడానికి ఎంఎస్ఎంఈలకు సహాయం అందించేందుకు 
ఇ-కామర్స్ మార్గాల ద్వారా పనిచేసే కంపెనీలకు ఆర్థిక సహాయం అందించేందుకు
భారత్ నుంచి అంతర్జాతీయ మార్కెట్ లింకింగ్ ను పెంచుకోవడానికి  
చిరు వ్యాపారులు తమ ఉత్పత్తులను సమర్థవంతంగా ఎగుమతి చేయడానికి  

అర్హతలు 

  1. చెల్లుబాటు అయ్యే దిగుమతిదారు ఎగుమతిదారు కోడ్ (IEC)
  2. రిజిస్టర్డ్ MSME ఉద్యమ్ నంబర్
  3. ఇ-కామర్స్ సేల్స్ లో అనుభవం
  4. పోస్టల్ లేదా కొరియర్ మార్గాల ద్వారా ఎగుమతి కార్యకలాపాలు
  5. దేశీయ ఇ-కామర్స్ కార్యకలాపాలలో ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న ఎక్స్ పోర్టర్ అయిన దరఖాస్తు చేసుకోవచ్చు.  

ఈ పథకం కింద ఎగుమతిదారులకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రుణ సహాయాలను అందిస్తాయి. 

ముఖ్య ఆర్థిక ప్రయోజనాలు 

  • మనీ క్రెడిట్ లేదా ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యాలు
  • వర్కింగ్ కేపిటల్ సపోర్ట్  
  • క్రెడిట్ గ్యారెంటీ కవరేజ్
  • వడ్డీ రాయితీ 
  • బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వ హామీ   

క్రెడిట్ పరిమితులు 

ఈ పథకాన్ని రెండు విధాలుగా అమలు చేస్తారు. 

1. డైరెక్ట్ ఇ-కామర్స్ క్రెడిట్ ఫెసిలిటీ 

  • క్రెడిట్ పరిమితి గరిష్టంగా రూ. 50 లక్షలు  
  • రుణ మొత్తంలో 90 శాతాన్ని హామీ  
  • రుణ కాలపరిమితి గరిష్టంగా 365 రోజులు 
  • గ్యారెంటీ ఫీ ప్రతి ఏడాది మొత్తంలో 0.5 శాతం  

2. విదేశీ సరుకుల ఇ-కామర్స్ రుణ సుదుపాయం

  • రుణ పరిమితి గరిష్టంగా రూ. 5 కోట్లు  
  • రుణ మొత్తంలో 75 శాతాన్ని హామీ కవరేజీ 
  • రుణ కాలపరిమితి 365 రోజులు 
  • ప్రతి సంవత్సరం మొత్తంలో 1 శాతం గ్యారెంటీ ఫీజు 
  • ఈ పథకానికి అర్హులైన ఎగుమతిదారులు తమ రుణాలపై 2.75 శాతం వడ్డీ రేటు తగ్గింపును పొందువచ్చు. 

ఈ పథకాన్ని ఎలా అమలు చేస్తారు?

ఈ పథకం ముందుగా ఒక పైలట్ ప్రాజెక్ట్ గా అమలు చేస్తున్నారు. ఎక్స్‌పోర్ట్-ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎగ్జిమ్ బ్యాంక్), నేషనల్ క్రెడిట్ గ్యారెంటీ ట్రస్టీ కంపెనీ లిమిటెడ్ రుణ హామీ వ్యవస్థను నిర్వహిస్తుంది.  ఎగుమతిదారులు ముందుగా DGFT పోర్టల్‌లో దరఖాస్తు చేసుకుని, ప్రత్యేక గుర్తింపు సంఖ్య (UIN)ను పొందాల్సి ఉంటుంది. ఆ తర్వాత రుణ సహాయం కోసం బ్యాంకులను సంప్రదించవచ్చు. ఈ పథకం ద్వారా రుణాలు ఇచ్చే ముందు బ్యాంకులు వ్యాపార పరిస్థితిని అంచనా వేస్తాయి.

ఎక్స్ పోర్టర్స్ కు గొప్ప అవకాశం

చిరు వ్యాపారులు ఆన్ లైన్ పోర్టల్స్ ద్వారా అంతర్జాతీయ వినియోగదారులకు ప్రొడెక్ట్స్ సేల్ చేసేందుకు కేంద్రం సహాకారం అందిస్తుంది. ఈ ప్రక్రియలో భాగంగా ఆర్థిక సహాయం,  కొత్త రుణ మద్దతు పథకం ప్రకటించింది. ఎంఎస్ఎంఈలు తమ వ్యాపారాలను అంతర్జాతీయంగా విస్తరించుకోవడానికి ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుంది. అంతర్జాతీయ గిడ్డంగులలో సరుకులను నిల్వ ఉంచుకోవడానికి కూడా వీలు కల్పిస్తుంది. దీంతో లాంగ్ టర్మ్ ప్రయోజనాలు, ప్రపంచ ఇ-కామర్స్ ఎక్స్ పోర్ట్ మార్కెట్‌ అవకాశాలను భారత వ్యాపారులు అందిపుచ్చుకునేందుకు ఈ పథకం సహాయపడుతుంది. 

Frequently Asked Questions

MSME క్రెడిట్ సపోర్ట్ స్కీమ్ అంటే ఏమిటి?

ఈ పథకం ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా తమ ఎగుమతులను పెంచుకోవాలనుకునే చిరు వ్యాపారులకు ఆర్థిక సహాయం అందిస్తుంది.

ఈ పథకం ఎవరి కోసం ఉద్దేశించబడింది?

ముఖ్యంగా ఎంఎస్‌ఎంఈలకు, ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా తమ ఉత్పత్తులను అంతర్జాతీయంగా విక్రయించుకోవాలనుకునే చిన్న వ్యాపారులకు ఈ పథకం ప్రయోజనం చేకూరుస్తుంది.

ఈ పథకం కింద ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు అందుతాయి?

మనీ క్రెడిట్, ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యాలు, వర్కింగ్ కేపిటల్ సపోర్ట్, క్రెడిట్ గ్యారెంటీ కవరేజ్, వడ్డీ రాయితీ వంటివి లభిస్తాయి.

ఈ పథకం కోసం అర్హతలు ఏమిటి?

చెల్లుబాటు అయ్యే దిగుమతిదారు ఎగుమతిదారు కోడ్ (IEC), రిజిస్టర్డ్ MSME ఉద్యమ్ నంబర్, ఇ-కామర్స్ సేల్స్ లో అనుభవం, పోస్టల్/కొరియర్ ద్వారా ఎగుమతి కార్యకలాపాలు, దేశీయ ఇ-కామర్స్ లో ఒక సంవత్సరం అనుభవం కలిగి ఉండాలి.

టాప్ హెడ్ లైన్స్

AP Cabinet Decisions: ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
Central Minister Rammohan Naidu: విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
AP Cabinet Meeting: పదికి పైగా అజెండా అంశాలతో ఏపీ కేబినెట్ సమావేశం.. పలు కీలక నిర్ణయాలు
పదికి పైగా అజెండా అంశాలతో ఏపీ కేబినెట్ సమావేశం.. పలు కీలక నిర్ణయాలు
AP Local Elections TDP Janasena Seat Sharing: స్థానిక ఎన్నికల్లో బాబు-పవన్ పొత్తు - అగ్రనేతల లెక్కలు ఓకే.. మరి క్షేత్రస్థాయి కేడర్ సమన్వయం సాధ్యమేనా?
స్థానిక ఎన్నికల్లో బాబు-పవన్ పొత్తు - అగ్రనేతల లెక్కలు ఓకే.. మరి క్షేత్రస్థాయి కేడర్ సమన్వయం సాధ్యమేనా?

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Decisions: ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
Delhi Protest: జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
Virt Kohli: ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
Chana Dal Coconut Curry : శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
Central Minister Rammohan Naidu: విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
Naman Dhir Debut Impact: న‌మ‌న్ రాక‌తో ఆ ప్లేయ‌ర్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్..!! అరంగేట్రంలోనే 3 వికెట్లతో ధీర్ ప్రకంపనలు
న‌మ‌న్ రాక‌తో ఆ ప్లేయ‌ర్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్..!! అరంగేట్రంలోనే 3 వికెట్లతో ధీర్ ప్రకంపనలు
Telangana Padayatra Politics: 2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
Embed widget