News
News
X

Srikakulam MLC : సిక్కోలు పార్టీల్లో లొసుగులను బయట పెట్టిన ఎమ్మెల్సీ ఎన్నిక - నర్తు రామారావు గెలిచినా అంతు చిక్కని లెక్కలు !

శ్రీకాకుళంలో ప్రధాన పార్టీల్లోని అంతర్గత రాజకీయాలను ఎమ్మెల్సీ ఎన్నిక బయట పెట్టింది. నర్తు రామారావు గెలిచినా వైసీపీలో అంతర్మథనం కనిపిస్తోంది.

FOLLOW US: 
Share:

Srikakulam MLC :  శ్రీకాకుళం స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికల్లో  వైఎస్ఆర్‌సీపీ  అభ్యర్థి నర్తు రామారావు విజయం సాధించారు.  స్థానిక సంస్థలకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా 776 ఓటర్లు ఉన్నారు.  వీరిలో శ్రీకాకుళం రెవిన్యూ డివిజనులో 233 మంది, పాలకొండలో 149 మంది, టెక్కలిలో 161 మంది, పలాస రెవిన్యూ డివిజనులో 209 మంది మొత్తంగా  752 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.   ఇందులో వైకాపా అభ్యర్థి నర్తు రామారావుకు 632 ఓట్లు, స్వతంత్ర అభ్యర్ధి ఆనెపు రామకృష్ణకు 108 ఓట్లు వచ్చాయి.  పదకొండు ఓట్లు చెల్లలేదు.  దీంతో వైకాపా అభ్యర్ధి నర్తు రామారావు విజయం సాధించినట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటిస్తూ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా ఫారంను అందచేశారు. 

ఇండిపెండెంట్‌కు కొన్ని అధికార పార్టీ ఓట్లు 

వైఎస్ఆర్‌సీపీ   ఓట్లు కొన్ని చీలి ఇండిపెండెంట్ అభ్యర్థికి పడ్డాయి.  సంఖ్యాపరంగా అధికార వైకాపా అభ్యర్థి విజయం సాధించినప్పటికీ ఆ పార్టీకి మాత్రం ఇదే నైతిక ఓటమేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సామాజికవర్గం కోణంలో బరిలో నిలిచిన ఆనెపు రామకృష్ణకు తెలుగుదేశం మద్దతు ప్రకటించినా ఆ పార్టీ ఓట్లు పూర్తి స్థాయిలో ఆయనకు బదిలీ కాలేదు. తమ స్థానిక రాజకీయ ప్రయోజనాలకోసం ఇండిపెండెంట్కు చివర్లో హ్యాండిచ్చారు. ఆమదాలవలస వంటి పలు నియోజకవర్గాల టీడీపీ స్థానిక ప్రతినిధులతో పాటు ఎక్స్ ఆఫీషియో ఓటహక్కు కలిగి ఉన్న రాష్ట్ర, జిల్లా అధ్యక్షులు, శ్రీకాకుళం ఎంపీ, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే వంటి వారు కూడా ఓటింగ్ కు గైర్హాజరయ్యారు. తెలుగుదేశానికి ఉన్న 86 ఓట్లలో ఇవన్నీ తీసేస్తే స్వతంత్ర అభ్యర్థికి ఆ 86 కంటే ఇంకా తక్కువే ఓట్లు పడాలి. కానీ 108 ఓట్లు వచ్చాయంటే అవన్నీ కచ్చితంగా అధికార వైకాపాకు చెందినవేనని అంటున్నారు. 

టీడీపీ మద్దతిచ్చినా పూర్తి స్థాయిలో ఇండిపెండెంట్‌కు రాని ఓట్లు 

తెలుగుదేశం శిబిరం లెక్కల ప్రకారం ఎచ్చెర్లలో  వంద శాతం, పాతపట్నం పాక్షికంగా, పలాస- కాశీబుగ్గ మున్సిపాలిటీకి చెందిన టీడీపీ నేతలు ఓటేయడం ద్వారా ఇండిపెండెంట్ అభ్యర్థికి 108 పోలయ్యా యని భావిస్తున్నారు. ఎచ్చెర్లలో కళా వెంకటరావు తనయుడు రామ్మల్లిక్ నాయుడు తమ ఎంపీటీసీలను దగ్గరుండి పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లి ఓట్లు వేయించారు. పాతపట్నంలో కలమట రమణ తనయుడు సాగర్ కూడా ఇదే పని చేశారు. పలాస-కాశీబుగ్గ మున్సి పాలిటీలో వజ్జ బాబూరావు నేతృత్వంలో టీడీపీ కౌన్సిలర్లు ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటు వేసినట్లు భావిస్తున్నారు. ఇవి పోను కాపు సామాజికవర్గం నేతలు అధిక శాతం ఉన్నచోట వైకాపా స్థానిక నేతలు కూడా ఇండిపెండెంట్ అభ్యర్థికి ఓటేసినట్లు సమాచారం. వాస్తవానికి ఇండిపెండెంట్గా ఆనెపు రామకృష్ణ బరిలో దిగినప్పుడు అధికార పార్టీ నుంచి దాదాపు కోటి రూపాయల వరకు ఆఫర్ వచ్చింది. నామినేషన్ విత్ డ్రా చేసుకుంటే తమ ఎన్నిక ఏకగ్రీవం అవుతుందన్న ఆశతో న్న అధికార పార్టీ నేతలు కాపు నాయకులతో పెద్ద ఎత్తున రాయబారాలు నడిపారు. కానీ ఆనెపు రామకృష్ణ తలొగ్గలేదు. పైగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడే స్వయంగా ఫోన్ చేసి తమ మద్దతు ఉంటుందని రామకృష్ణకు భరోసా ఇచ్చారు.  తెలుగు దేశం సీనియర్ల అంచనా ప్రకారం ఆనెపు రామకృష్ణకు పడిన 108 ఓట్లలో అధిక శాతం వైకాపా నుంచి వచ్చినవే. ఆమదాల వలస నియోజకవర్గ టీడీపీ ఎంపీటీసీలను పార్టీ జిల్లా అధ్యక్షుడు కూన రవి దూరంగా ఉంచారు. దీంతో వారెవరూ పోలింగ్ బూత్ల ఛాయలకే వెళ్లలేదు. వారే ఓటేస్తే ఇండిపెండెంట్ అభ్యర్థికి మరో 16 ఓట్లు ఎక్కువ వచ్చి ఉండేవి. అలాగే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అయితే ఏకంగా జిల్లాకు దూరంగా ఉండిపోయారు.  ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ పట్టభద్రుల ఎమ్మెల్సీకి ఓటేశారు తప్ప స్థానిక ఎమ్మెల్సీకి ఉన్న ఓటుహక్కును వినియోగించుకోలేదు 

టీడీపీ నాయకులు పూర్తి స్థాయిలో మద్దతివ్వలేదంటున్న ఆనెపు రామకృష్ణ వర్గీయులు 

తమ్మినేని సీతారాంను వ్యతిరేకించి ఇండిపెండెంట్ అభ్యర్థి ఆనెపు రామకృష్ణ తెలుగుదేశం కోసం పని చేస్తుంటే.. అదే తమ్మినేని సీతారాము "ప్రత్యర్థిగా ఉన్న కూన రవికుమార్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సహకరించకపోవడానికి కారణాలు ఏమై ఉంటాయో తెలుసుకోవాలని చంద్రబాబుకు లేఖ రాయాలని జిల్లా నేతలు భావిస్తున్నారు.  తెలుగుదేశం ఓట్లు పోనూ మిగిలినవి నర్తు రామారావుకు పడాల్సి ఉండగా, తిరిగి వైకాపా ఓట్లే ఇండిపెండెంట్ అభ్యర్థికి పడటంపై ఇప్పుడు వైకాపాలోనూ అంతర్మథనం సాగుతోంది. మెజార్టీ ఓట్లు నర్తు రామారావుకే పడినప్పటికీ వైకాపా ఓట్లలో కొన్ని ఇండిపెండెంట్ అభ్యర్థికి పడటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. నర్తు రామారావు గెలుపు సాధారణమే అయినప్పటికీ అధికార పార్టీ ఒత్తిళ్లకు లొంగకుండా, ఆఫర్ను తిరస్కరించి మరీ అధికార పార్టీ ఓటును కొంతవరకు చీల్చగలిగిన ఇండిపెండెంట్ అభ్యర్థిదే నైతిక విజయమన్న చర్చ జరుగుతోంది. 

Published at : 16 Mar 2023 03:56 PM (IST) Tags: MLC Elections Srikakulam Politics Srikakulam News Narthu Rama Rao

సంబంధిత కథనాలు

Breaking News Live Telugu Updates: ఆకాశంలోకి LVM3 -M3 రాకెట్, ఏకంగా 36 ఉపగ్రహాలు మోసుకెళ్లిన వాహకనౌక

Breaking News Live Telugu Updates: ఆకాశంలోకి LVM3 -M3 రాకెట్, ఏకంగా 36 ఉపగ్రహాలు మోసుకెళ్లిన వాహకనౌక

TTD News: ఏడుకొండల్లో పెరిగిన రద్దీ, వీకెండ్ వల్ల 26 కంపార్ట్మెంట్లల్లో భక్తులు - దర్శన సమయం ఎంతంటే

TTD News: ఏడుకొండల్లో పెరిగిన రద్దీ, వీకెండ్ వల్ల 26 కంపార్ట్మెంట్లల్లో భక్తులు - దర్శన సమయం ఎంతంటే

Weather Latest Update: నేడు తెలుగు రాష్ట్రాల్లో ఎల్లో అలెర్ట్ జారీ, ఈ జిల్లాల్లో వానలు! ఈదురుగాలులు కూడా

Weather Latest Update: నేడు తెలుగు రాష్ట్రాల్లో ఎల్లో అలెర్ట్ జారీ, ఈ జిల్లాల్లో వానలు! ఈదురుగాలులు కూడా

AP ByElections : ఏపీలో ఉపఎన్నికలు వస్తాయా ? వైఎస్ఆర్‌సీపీ వ్యూహకర్తల ప్లాన్ ఏంటి ?

AP ByElections :  ఏపీలో ఉపఎన్నికలు వస్తాయా ?  వైఎస్ఆర్‌సీపీ వ్యూహకర్తల ప్లాన్ ఏంటి ?

వైజాగ్ లో ఆకట్టుకుంటున్న " ఐ లవ్ వైజాగ్ "

వైజాగ్ లో ఆకట్టుకుంటున్న

టాప్ స్టోరీస్

BRS Leaders Fight : ఎల్బీనగర్ బీఆర్ఎస్ నేతల మధ్య వర్గపోరు, మంత్రి కేటీఆర్ సమక్షంలోనే ఘర్షణ

BRS Leaders Fight : ఎల్బీనగర్ బీఆర్ఎస్ నేతల మధ్య వర్గపోరు, మంత్రి కేటీఆర్ సమక్షంలోనే ఘర్షణ

Nara Rohit : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

Nara Rohit :  రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్   ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

రాహుల్ కంటే ముందు అన‌ర్హ‌త వేటు ప‌డిన నేత‌లు వీరే

రాహుల్ కంటే ముందు అన‌ర్హ‌త వేటు ప‌డిన నేత‌లు వీరే

Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం!

Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం!