Bhuma AkhilaPriya : శిల్పా ఫ్యామిలీ రియల్ ఎస్టేట్ అక్రమలపై అఖిలప్రియ గురి - ఆళ్లగడ్డలో ఏం జరుగుతోంది ?
Andhra Pradesh : ఆళ్లగడ్డలో శిల్పా ఫ్యామిలీ రియల్ వ్యాపారంలో అక్రమాలపై ఎమ్మెల్యే అఖిలప్రియ యుద్ధం ప్రకటించారు. నిబంధనలు ఉల్లంఘించారని వారి వెంచర్ ను అధికారులతో కలిసి వెళ్లి పరిశీలించారు.
Allagadda : ఆళ్లగడ్డలో వేసిన శిల్పా చక్రపాణి రెడ్డి వేసిన వెంచర్స్ పై ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఘాటుగా స్పందించారు. నిబంధనలకు విరుద్ధంగా వారికి ఇష్టం వచ్చినట్లు వెంచర్స్ వేసి అమాయక ప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆళ్లగడ్డ నియోజకవర్గం లోని శిల్ప వెంచర్ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పరిశీలించారు. వెంచర్ కి పక్కనే ఉన్న కేసీ కెనాల్ పరిశీలించి వాటికి సంబంధించిన రికార్డ్స్ ను వెరీఫై చేశారు.
కేసీ కెనాల్‌కు అడ్డంగా శిల్పా వెంచర్
ఆళ్లగడ్డ నియోజకవర్గం లోని ఓ వెంచర్ కి కేసి కెనాల్ అడ్డం వస్తుందని నెపంతో ఏకంగా కేసి కెనాల్ నిర్మాణానికి పూజ చేసిన కూడా గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. వెంచర్ కి ఆనుకొని ఉన్న కేసి కెనాల్ అలైన్మెంట్ను మార్చి అక్రమంగా వెంచర్లను నిర్వహిస్తున్నరాన్నారు. గత వైసిపి ప్రభుత్వం లో ఇక్కడ ఉన్న నాయకులు పాలకులు కమిషన్లకు కక్కుర్తి పడి ఇష్టం వచ్చినట్లు పర్మిషన్లు ఇచ్చినందుకే ఈ రోజు వారిని ప్రజలు ఇంట్లో కూర్చో పెట్టారని గుర్తు చేశారు. అక్కడ వేసిన 60 ఎకరాల వెంచర్లు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం పది పర్సెంట్ అంటే ఆరు ఎకరాలు మున్సిపాలిటీకి ఇవ్వాలని గుర్తు చేశారు. అలా ఇచ్చిన ఆరు ఎకరాల భూమి కూడా ప్రభుత్వానిదేనని అని గుర్తు చేశారు. వెంచర్ నీ వేసి వారికి అనుకూలంగా కేసీ కెనాల్ ను మార్చుకున్నారని మండిపడ్డారు.
శిల్పా వెంచర్ లో అన్నీ అక్రమాలే
ఏదైనా అత్యవసరమైతేనే సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారమే కెనాల్ అలైన్ మెంట్ మారుస్తారని వీరి ప్రభుత్వం అధికారంలో ఉండడంతో అభివృద్ధి పట్టించుకోకుండా వీరికి ఇష్టం వచ్చినట్లు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి వెంచర్లు వేసుకున్నారని అఖిలప్రియ మండిపడ్డారు. అనేక చోట్ల శిల్ప చక్రపాణి వెంచర్స్ లో అనేక అక్రమాలు జరిగాయన్నారు. ఎక్కడైనా వెంచర్స్ లో నివాసం ఉంటున్న వారు ఒక సొసైటీగా ఏర్పడి అక్కడ ఉన్న సమస్యలను తీర్చుకునే వెసులుబాటు ఎక్కడైనా ఉంటుందని కానీ శిల్ప వెంచర్స్ లో మాత్రం ఆ సొసైటీలో ఓనర్స్ నివాసం ఉంటూ అక్కడ ఏమైనా సమస్యలుంటే బయటకు రాకుండా చూసుకుంటున్నారని మండిపడ్డారు.
ఆళ్లగడ్డలో ఇక అక్రమాలు పని చేయవు !
ఈ విధంగా అక్రమంగా వెంచర్స్ వేయడమే కాకుండా వెంచర్స్ లో కొన్న వారిని కూడా వీళ్లు మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి ఇవ్వాల్సిన పది పర్సెంట్ స్థలాన్ని కూడా సర్వే నెంబర్లు మార్చి ప్రభుత్వ భూమిని ప్రభుత్వానికి ఇచ్చిన ఘనులని..దీనిపై విచారణ చేయిస్తామన్నరాు. ఇప్పటినుంచి ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఇలాంటివన్నీ చెల్లవని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చారు.