News
News
X

Minister Buggana : 20 వేల కొత్త ఎంఎస్ఎంఈలు, 5 లక్షల ఉద్యోగాలే లక్ష్యం - మంత్రి బుగ్గన

Minister Buggana : పెట్టుబడులకు ఏపీ స్వర్గధామమని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. 20,000 కొత్త ఎంఎస్ఎంఈలు, ఐదు లక్షల ఉద్యోగాలే లక్ష్యమని ఆయన తెలిపారు.

FOLLOW US: 
Share:

Minister Buggana : పారిశ్రామిక రంగంలో విశేషమైన వృద్ధిని సాధించే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం విశాఖపట్నంలో మార్చి 3, 4 తేదీల్లో రెండు రోజుల గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023ని నిర్వహించనుంది. ఈ సమ్మిట్ ముఖ్య ఉద్దేశం ఏపీలో పరిశ్రమల స్థాపనకు ఉన్న అపార అవకాశాలను (అడ్వాంటేజ్ ఆంధ్రప్రదేశ్) ప్రభుత్వం కల్పిస్తున్న సమృద్ధి వనరులను వివరించి పెట్టుబడులను ఆకర్షించడమే ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ సమ్మిట్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈలు, స్టార్టప్‌ల  బలమైన ఉనికిని, కల్పించనున్న మౌలిక సదుపాయాలు, వ్యాపార అనుకూల వాతావరణం, ప్రతిభావంతులైన నైపుణ్యం కలిగిన మానవ వనరులను ప్రదర్శిస్తుంది. పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు చెన్నై, బెంగళూరు, ముంబయిలలో అనేక రోడ్‌షోలను ప్రభుత్వం నిర్వహించింది. ఏరోస్పేస్, డిఫెన్స్, అగ్రి అండ్ ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమొబైల్స్, ఈవీలు, ఎలక్ట్రానిక్స్, ఐటీ, హెల్త్‌కేర్, మెడికల్ ఎక్విప్‌మెంట్, లాజిస్టిక్స్, ఎంఎస్‌ఎంఈ, స్టార్టప్‌లు, పెట్రోలియం, ఫార్మా, పునరుత్పాదక ఇంధనం, టెక్స్‌టైల్స్, టూరిజం, హాస్పిటాలిటీ వంటి దీర్ఘకాలిక వృద్ధికి అవకాశం ఉన్న వివిధ రంగాలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. 

ఎంఎస్ఎంఈలకు మద్దతు  

ఏపీ ప్రభుత్వ సలహాదారు రాజీవ్ కృష్ణ ఎంఎస్ఎంఈ రంగం గురించి మాట్లాడుతూ "సీఎం జగన్ నాయకత్వంలోని  ప్రభుత్వం ఎంఎస్ఎంఈలకు ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగాల కల్పనకు వెన్నెదన్నుగా నిలుస్తుండటంతో పూర్తి స్థాయిలో ఎంఎస్ఎంఈలకు మద్దతు ఇస్తున్నామని తెలిపారు. గత నాలుగు సంవత్సరాలలో వివిధ పథకాల క్రింద 3000 కోట్లకు పైగా ఆర్థిక ప్రోత్సాహకాలు ఎంఎస్ఎంఈలకు విడుదల చేశామన్నారు. ఇప్పటికే ఉన్న ఎంఎస్ఎంఈల పురోగతితో పాటు 20,000 కొత్త ఎంఎస్ఎంఈ యూనిట్లను సృష్టించడం, ఎంఎస్ఎంఈలలో ఐదు లక్షల కంటే ఎక్కువ కొత్త ఉద్యోగాలను సృష్టించడమే ప్రభుత్వ ఉద్దేశమని ఆయన వెల్లడించారు.

బోర్డ్ లెక్కలు ఎలా ఉన్నాయంటే? 

ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డ్ లెక్కల ప్రకారం, రాష్ట్రంలో ఎంఎస్ఎంఈల అభివృద్ధి, ఉద్యోగ కల్పనలో పెరుగుదల నమోదుకాగా ప్రతి ఒక్కరికీ శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థకు తన అంకితభావాన్ని ప్రదర్శిస్తుంది. మూడేళ్లలో 37,956 ఎంఎస్ఎంఈ యూనిట్లు 60,800 యూనిట్లకు పెరిగాయి, 2019లో 4,04,939 నుంచి 5,61,235 మంది పనిచేస్తున్నట్లుగా రికార్డులు చెబుతున్నాయి. మహిళా పారిశ్రామికవేత్తలకు మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వం 'వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్' అనే రెండు పథకాలను కూడా ప్రారంభించిందని, రాబోయే రెండేళ్లలో 100 క్లస్టర్లను క్షేత్రస్థాయిలో ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, వాటిలో 52 క్లస్టర్లను ప్రతిపాదించామని బోర్డు పేర్కొంది. గత మూడేళ్లుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ నిలకడగా మొదటి స్థానంలో ఉందని బోర్డు తెలిపింది.

ఇప్పటివరకు విడుదల చేసిన లెక్కల ప్రకారం, 2021-22లో దేశంలో అత్యధికంగా రెండంకెల జీఎస్డీపీ వృద్ధి రేటు 11.43 శాతంగా ఉంది. 974 కి.మీతో దేశంలోనే రెండవ పొడవైన తీరప్రాంతం ఏపీ సొంతం. ప్రస్తుతం ఉన్న 6 ఓడరేవులతో పాటు కొత్తగా రాబోయే నాలుగు ఓడరేవులతో ఆగ్నేయ దిశలో భారతదేశ ముఖ ద్వారం అయినందున రాష్ట్రం సముద్ర మౌలిక సదుపాయాలను కలిగి ఉంది. ఇది అనుకూలమైన వ్యాపార వాతావరణంతో పాటు పరిశ్రమ-కేంద్రీకృత విధానాలను కలిగి ఉందని బోర్డు వర్గాలు అంటున్నాయి.

ఏపీలో మూడు కారిడార్లు 

దేశంలోని 11 పారిశ్రామిక కారిడార్లలో మూడింటిని ఆంధ్రప్రదేశ్‌లో నిర్మిస్తున్నారు. కొన్నింటిని పేర్కొనడానికి, రాష్ట్రం లాజిస్టిక్స్ 2022 కోసం లీడ్స్ అవార్డు, ఎనర్జీ 2022 కోసం ఇనర్షియా అవార్డ్, పోర్ట్ లీడ్ కోసం ఈటీ అవార్డుతో పాటు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ 2022 అవార్డులను రాష్ట్ర ప్రభుత్వం అందుకుంది. గత నాలుగు సంవత్సరాలుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్, రాబోయే పెట్టుబడిదారులకు వేగవంతమైన సింగిల్ విండో క్లియరెన్స్‌లు, సుదీర్ఘ తీరప్రాంతాలు, వివిధ రకాల ఓడరేవులు, నాణ్యమైన విద్యుత్ సరఫరా, సమృద్ధిగా ఉన్న భూములు, ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనకు ఏపీ ప్రభుత్వం ప్రణాళికతో ముందుకు వెళుతుందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.

Published at : 21 Feb 2023 10:25 PM (IST) Tags: AP Politics AP Finance Minister ap updates

సంబంధిత కథనాలు

Weather Latest Update: నేడు తెలుగు రాష్ట్రాల్లో ఎల్లో అలెర్ట్ జారీ, ఈ జిల్లాల్లో వానలు! ఈదురుగాలులు కూడా

Weather Latest Update: నేడు తెలుగు రాష్ట్రాల్లో ఎల్లో అలెర్ట్ జారీ, ఈ జిల్లాల్లో వానలు! ఈదురుగాలులు కూడా

AP ByElections : ఏపీలో ఉపఎన్నికలు వస్తాయా ? వైఎస్ఆర్‌సీపీ వ్యూహకర్తల ప్లాన్ ఏంటి ?

AP ByElections :  ఏపీలో ఉపఎన్నికలు వస్తాయా ?  వైఎస్ఆర్‌సీపీ వ్యూహకర్తల ప్లాన్ ఏంటి ?

వైజాగ్ లో ఆకట్టుకుంటున్న " ఐ లవ్ వైజాగ్ "

వైజాగ్ లో ఆకట్టుకుంటున్న

APSWREIS: గురుకులాల్లో 5వ తరగతి, ఇంటర్ ప్రవేశాల దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?

APSWREIS: గురుకులాల్లో 5వ తరగతి, ఇంటర్ ప్రవేశాల దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?

Rajahmundry Bridge : రాజమండ్రి రోడ్ కమ్ రైల్ బ్రిడ్జికి మరమ్మత్తులు, వాహన రాకపోకలు నిలిపివేత

Rajahmundry Bridge : రాజమండ్రి రోడ్ కమ్ రైల్ బ్రిడ్జికి మరమ్మత్తులు, వాహన రాకపోకలు నిలిపివేత

టాప్ స్టోరీస్

రాహుల్ కంటే ముందు అన‌ర్హ‌త వేటు ప‌డిన నేత‌లు వీరే

రాహుల్ కంటే ముందు అన‌ర్హ‌త వేటు ప‌డిన నేత‌లు వీరే

Nara Rohit : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

Nara Rohit :  రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్   ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం!

Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం!

ISRO LVM3: మరికొన్ని గంటల్లో నింగిలోకి ఎల్వీఎం3 - లోయర్‌ ఎర్త్‌ ఆర్బిట్‌ లోకి 36 ఉపగ్రహాలతో ప్రయోగం

ISRO LVM3: మరికొన్ని గంటల్లో నింగిలోకి ఎల్వీఎం3 - లోయర్‌ ఎర్త్‌ ఆర్బిట్‌ లోకి 36 ఉపగ్రహాలతో ప్రయోగం