Botcha Wife Lawyer : హైకోర్టు లాయర్‌గా మంత్రి బొత్స సతీమణి - పేదలకు సేవలందించాలని సలహా !
మంత్రి బొత్స సత్యనారాయణ భార్య ఝాన్సీ హైకోర్టు లాయర్ గా పేరు నమోదు చేసుకున్నారు. ఈ విషయాన్ని మంత్రి ట్విట్టర్ ద్వారా తెలిపారు.
Botcha Wife Lawyer : ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ పెద్దగా చదువుకోలేదు కానీ ఆయన విద్యాశాఖ మంత్రి అయ్యారు. ఇప్పుడు ఆయన భార్య హైకోర్టు లాయర్ అయ్యారు. చదువుపై ఉన్న ఆసక్తితో బొత్స ఝాన్సీ లా చదివారు. రెండు పీహెచ్‌డీలు పూర్తి చేసినట్లుగాచెబుతున్నారు. లా నుంచి పీహెచ్‌డీ ఉందని చెబుతున్నారు. అయితే ఆమె ఎప్పుడ బార్‌లో సభ్యత్వం తీసుకోలేదు. తాజాగా హైకోర్టు బార్ అసోసియేషన్ సభ్యత్వాన్ని తీసుకున్నారు. ఇప్పటికే తాజాగా ఆమె బార్ మెంబర్‌షిప్ పొందడంతో మంత్రి బొత్స ట్వీట్టర్ వేదికగా స్పందించారు.. ఆమెను అభినందించారు.
బొత్స ఝాన్సీ గతంలో ఎంపీగా, జెడ్పీ ఛైర్‌పర్స్‌గా కూడా పనిచేశారు. ఇప్పటికీ ఝాన్సీ రాజకీయాల్లోనూ బాగా యాక్టివ్‌గా ఉన్నారు. ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి, మాజీ ఎంపీ ఝాన్సీ చదువుల్లోనూ రాణిస్తున్నారు. తాజాగా ఏపీ హైకోర్టు న్యాయవాదిగా మారారు. ఎంఏ ఫిలాసఫీ, ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేశారు. అనంతరం ఫిలాసఫీ, లాలో రెండు పీహెచ్‌డీలు పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు న్యాయవాదిగా ఆంధ్రప్రదేశ్ బార్ అసోసియేషన్ సభ్యత్వం అందుకున్నారు. ఈ సందర్భంగా.. సతీమణి ఝాన్సీని మంత్రి బొత్స సత్యనారాయణ అభినందించారు. న్యాయం కోసం ఎదురు చూసే సామాన్యుని పక్షాన న్యాయ స్థానంలో నిలిచేందుకు ఈరోజు న్యాయవాదిగా ఆంధ్రప్రదేశ్ బార్ అసోసియేషియన్ సభ్యత్వం పొందారు అంటూ అభినందనలు తెలిపారు.
#Congratulations to my wife , #Jhasnsi ( Ex- MP , Ex ZP Chairperson #Vijayanagaram) #DrBotchaJhansiLakshmi
— Botcha Satyanarayana (@BotchaBSN) August 13, 2023
న్యాయం కోసం ఎదురు చూసే సామాన్యుని పక్షాన న్యాయ స్థానంలో నిలిచేందుకు ఈరోజు న్యాయవాదిగా ఆంధ్రప్రదేశ్ బార్ అసోసియేషియన్ సభ్యత్వం పొందారు. pic.twitter.com/1VQih1Rlvw
విజయనగరం జిల్లా జెడ్పీ చైర్మన్ గా రెండుమార్లు, బొబ్బిలి ఎంపీగా, విజయనగరం ఎంపీగానూ ఝాన్సీ ప్రజాసేవ చేశారు. యాక్టివ్ పాలిటిక్స్‌లో బిజీగా ఉంటూనే చదువు కొనసాగించారు. చదువుకు వయస్సు అడ్డు కాదని ముందుకుసాగారు. రాజకీయాల్లో మహిళా సాధికారిత కోసం ప్రయత్నించిన ఝాన్సీ ఉన్నత విద్యలో కూడా అటు వైపే సాగారు. ఎంపీగా ఉన్న సమయంలోనే ఫిలాసఫీలో మహిళా సాధికారత, సామాజిక న్యాయశాస్త్రంపై పీహెచ్ డీ పూర్తిచేశారు.
ఓవైపు రాజకీయాల్లో ఉంటూ ప్రజాసేవ చేస్తూనే ఝాన్సీ ఉన్నత చదువులు పూర్తిచేశారు. రెండుమార్లు లోక్ సభకు ఎంపికైన ఝాన్సీ.. ఉత్తమ పార్లమెంటేరియన్ గా గుర్తింపు పొందారు.