Minister Ambati Rambabu: 'ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి విగ్రహానికి దండాలు పెడితే సరిపోతుందా బాబు?'
Minister Ambati Rambabu: గతంలో ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి గద్దె దించిన చంద్రబాబు.. ఇప్పుడు ఆయన విగ్రహానికి దండలు వేసి, దండాలులు పెడితే సరిపోతుందా అని మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు.
Ambati Rambabu: ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను నిర్వహించే హక్కు.. ఎన్టీఆర్ ఫొటో తాకే అర్హత చంద్రబాబుకు లేదని మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. చంద్రబాబు రాజకీయ చిత్రం ముగిసిపోయిందని, మూటా ముల్లే సర్దుకోవడమే మిగిలిపోయిందిని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను ఘనంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం ఆనందగా ఉందన్నారు. ఎవరు అవునన్నా.. కాదన్నా.. ఎన్టీఆర్ మహానటుడని, ఆయనను తలచుకుంటే ప్రతి తెలుగు వాడు పరవశించి పోతాడన్నారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం ఆనంద దాయకమని తెలిపారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు దేశ వ్యాప్తంగా పాపులార్టీ ఉన్న రజనీకాంత్ రావడం అభినందనీయం అన్నారు. ఎన్టీఆర్ చావుకు కారణమైన చంద్రబాబు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు హాజరైతే ఎన్టీఆర్ ఆత్మ క్షోబిస్తుందని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ చివరి రోజులలో చంద్రబాబును ఔరంగజేబుతో పోలుస్తూ చేసిన కామెంట్ల వీడియోను ప్రదర్శించారు. ఉత్సవాలకు హజరయ్యే హక్కు చంద్రబాబు కు లేదని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి గద్దె దించి.. ఇప్పుడు విగ్రహానికి దండలు వేసి దండం పెడితే సరిపోతుందా అని ప్రశ్నించారు.
ఇదేమి ఖర్మ ఆదరణ లేదు..
ఉమ్మడి గుంటూరు జిల్లా మూడు నియోజకవర్గాలలో జరిగిన చంద్రబాబు "ఇదేమి ఖర్మ" పర్యటన పూర్తిగా విఫలం అయిందని అంబటి రాంబాబు పేర్కొన్నారు. మూడు నియోజక వర్గాలలో విఫలం కావడంతో స్థానిక నారకులపై అసహనం వ్యక్తం చేసింది అవునా కాదా అని చంద్రబాబును ప్రశ్నించారు. విధిని కాదని ఎవరూ ఏమీ చేయలేరని.. చంద్రబాబును ముసలివాడంటే తట్టుకోలేక పోతున్నాడని తెలిపారు. వయోభారంతోనే మద్యాహ్నం సమయంలో సభలో పాల్గొనే శక్తి లేక అర్ధ రాత్రులపూట సభలు ఏర్పటు చేసుకున్నారని విమర్శించారు. చంద్రబాబు వయోబారంతో ఇబ్బంది పడుతున్నారంటే అస్సలు తట్టుకోలేక పోతున్నారని.. జగన్ కన్నా తానే కుర్రోడిని అంటున్నారని ఎద్దేవా చేశారు. సభల వద్ద జనం లేరని తెలుసుకొని దారిలో ఆగి కాలనీల్లో సభకు జనం వచ్చే వరకు కాలనీ వాసులతో పిచ్చాపాటి మాట్లాడి లోకోద్దారకుడిలాగా బాబు సభలో ప్రసంగాలు చేస్తున్నారని అన్నారు.
డ్యామేజ్ చేసేందుకే అసత్య ఆరోపణలు..
సత్తెనపల్లిలో తాను శ్మశానం భూములు ఆక్రమించుకున్నాను అని చంద్రబాబు సెల్ఫ్ ఛాలెంజ్ విసరడానికి ప్రస్తావించారు. శ్మశానానికి పూర్తి స్థాయిలో గోడలు నిర్మించిన తర్వాత అక్కడే పక్కన ఉన్న పబ్లిక్ ప్లేస్ ను ఇంకొకరు ఆక్రమించకుండా కొట్లు కట్టించి 40 మంది పేదలకు ఉచితంగా ఇచ్చానని స్పష్టం చేశారు. మృతుడి కుటుబానికి వచ్చిన సీఎం రిలీఫ్ ఫండ్ లో కమీషన్ అడిగానని తనపై పవన్ కళ్యాణ్ బ్యాచ్, టీడీపీ బ్యాచ్ ఆరోపణలు చేయడాన్ని ఆక్షేపించారు. తనపై ఆరోపణలు చేసినందుకు గంగమ్మ కుటుంబానికి పవన్, చంద్రబాబు ఆర్థిక సాయం చేయడాన్ని అబినందిస్తున్నాని తెలిపారు. ఆ కుటుబంపై ప్రేమతో కాకుండా నాపై ద్వేషంతోనే సాయం చేశారన్నారు. ఎన్ని యాత్రలు చేసినా.. ఎన్ని ఖర్మలు చేసినా... చేసిన తప్పులు కర్మల రూపంలో వెంటాడతాయని అన్నారు. అలాగే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గెలవడం కల్లా అని మూటా, ముల్లె సర్థుకోని జారుకోవడం పక్కా అని అంబటి తెలిపారు.