Janasena 10th Formation Day : పవన్ అన్నను త్వరలో సీఎంగా చూస్తాం, వారాహిని ఆపే దమ్ము ఎవరికీ లేదు- గబ్బర్ సింగ్ టీమ్
Janasena 10th Formation Day : జనసేన సభ ఏర్పాట్లను గబ్బర్ సింగ్ టీమ్ పరిశీలించింది. రేపటి సభను గ్రాండ్ సక్సెస్ చేసుకుంటామని తెలిపారు.
![Janasena 10th Formation Day : పవన్ అన్నను త్వరలో సీఎంగా చూస్తాం, వారాహిని ఆపే దమ్ము ఎవరికీ లేదు- గబ్బర్ సింగ్ టీమ్ Machilipatnam Janasena 10th Formation day meeting Gabbar singh team says Pawan will CM in next election Janasena 10th Formation Day : పవన్ అన్నను త్వరలో సీఎంగా చూస్తాం, వారాహిని ఆపే దమ్ము ఎవరికీ లేదు- గబ్బర్ సింగ్ టీమ్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/13/2ebec93a67ed0615f719f10093962cc71678725021792235_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Janasena 10th Formation Day : జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభకు గబ్బర్ సింగ్ ఫేమ్ హాస్యనటులు తరలివచ్చారు. సభ ప్రాంగణానికి వచ్చిన వీరు జనసైనికులతో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అయి తీరుతారని ధీమా వ్యక్తం చేశారు. వారాహిని ఆపే దమ్ము ఎవరికీ లేదని స్పష్టం చేశారు. తాము సభ పూర్తయ్యే వరకు ఇక్కడే ఉంటామని, ఎవరు ఆపుతారో చూస్తామని స్పష్టం చేశారు.
పదేళ్ల పండుగ
"మా అన్న పార్టీ పెట్టి 10 ఏళ్లు అయింది. రేపు పదేళ్ల పండుగ చేసుకోబోతున్నాం. పవన్ అన్నను త్వరలో సీఎంగా చూస్తాం. పవన్ కల్యాణ్ సీఎం కావాలని మా గబ్బర్ సింగ్ టీమ్ మొత్తం కోరుకుంటున్నాం. పవన్ కల్యాణ్ సర్ కు మా అవసరం అంతగా ఉండదు. అయినా మేం ఆయన వెంట నడుస్తాం. కౌలు రైతులు కుటుంబాలకు పవన్ కల్యాణ్ రూ. లక్ష రూపాయిలు ఇస్తున్నారు. గత ఎన్నికల్లో కూడా ప్రచారం చేశాం. వచ్చే ఎన్నికల్లో కూడా ప్రచారం చేస్తాం. జనసేన మ్యానిఫెస్టోను గడపగడపకూ వెళ్లి ప్రచారం చేస్తాం. పవన్ విమర్శించే వాళ్లకు ప్రజలే సమాధానం చెబుతారు. ప్రజల ఓపిక నశించింది. ఓటుతోనే వాళ్లు సమాధానం చెబుతారు. వైసీపీ ఎమ్మెల్యేలు పవన్ కల్యాణ్ తిడితే పదవి వస్తుందని అనుకుంటున్నారు. బురదలో రాళ్లు వేయడం ఇష్టం లేక మేంవదిలేశాం. అందుకే గబ్బర్ సింగ్ టీం కూడా మీడియాలో మాట్లాడడంలేదు. వారాహి ఏపీకి ఎప్పుడో వచ్చింది. దాన్నెంటి అడ్డుకునేది. వారాహిని ఎవరు అడ్డుకుంటారో మేము చూస్తాం. విశాఖలో కూడా అలానే పర్మిషన్ లేదని అడ్డుకున్నారు. తర్వాత వాళ్లే గ్రీన్ మ్యాట్ చేసి తీసుకెళ్లారు. వారాహిని కూడా వాళ్లే భద్రత ఇచ్చి తీసుకువెళ్తారు. 25 వేల మంది ర్యాలీగా సభ వస్తున్నారు. అభిమానులు, జనసైనికుల కలిసి రేపటి సభను గ్రాండ్ సక్సెస్ చేస్తాం" -గబ్బర్ సింగ్ టీమ్.
జనసేన షాకిచ్చిన పోలీసులు
జనసేన పదో ఆవిర్భావ సభకు ముందే కృష్ణా జిల్లా పోలీసులు షాకిచ్చారు. ఈనెల 14న కృష్ణా జిల్లా వ్యాప్తంగా పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ జాషువా ఓ ప్రకటనలో తెలిపారు. జాతీయ రహదారిపై ఎటువంటి ర్యాలీలు, సభలకు అనుమతి లేదన్నారు. ఒకవేళ అనుమతి లేకుండా సభలు, ర్యాలీలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. జనసేన ఆవిర్భావ సభ వేళ పోలీసుల ఆంక్షలపై ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. జనసేన సభ దృష్ట్యా ఆంక్షలు విధించిందని ఆరోపించారు. ఎన్ని ఆంక్షలు పెట్టిన రేపటి సభను విజయవంతం చేస్తామని జనసేన నేతలు అంటున్నారు. ఇప్పటికే ఏపీకి చేరుకున్న వారాహి రథంలో పవన్ రేపు మచిలీపట్నం సభకు హాజరుకానున్నారని తెలిపారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పవన్ ప్రజల్లో ఉండాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో జనసేన ఆవిర్భావ సభ ద్వారా ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)