అన్వేషించండి

నీతోనే జెండాలు కట్టిస్తా, నీతోనే జెండాలు తీయిస్తానంటూ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్

తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డికి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. తాను అధికారంలోకి వస్తే ఎమ్మెల్యే పెద్దారెడ్డి చేత, తన ఇంట్లో ఊడిగం చేయించుకుంటానన్నారు.

Jc Prabhakar Reddy Warning To MLA Peddareddy : తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి(MLA Peddareddy), మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి (Jc Prabhakar Reddy)మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా పెద్దారెడ్డి చేసిన వ్యాఖ్యలపై జేసీ దివాకర్ రెడ్డి స్పందించారు. తాడిపత్రి (Tadipatri) ఎమ్మెల్యే పెద్దారెడ్డికి జేసీ ప్రభాకర్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. దీంతో తాడిపత్రి రాజకీయాలు ఎన్నికలకు ముందే సెగలు పుట్టిస్తున్నాయి. తాను అధికారంలోకి వస్తే ఎమ్మెల్యే పెద్దారెడ్డి చేత, తన ఇంట్లో ఊడిగం చేయించుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల తర్వాత ఫ్యాక్షన్ ప్రారంభిస్తానన్న పెద్దారెడ్డి వ్యాఖ్యలకు జేసీ ప్రభాకర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. పోలీసులు వెంట ఉంటే తప్ప బయట తిరగలేని వాడివి...తూ నీ బతుకు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి. పెద్దారెడ్డి ఫ్యాక్షన్ చేస్తానంటే తనకు చాలా భయంగా ఉందంటూ సెటైర్లు వేశారు. 

పెద్దారెడ్డితోనే జెండాలు కట్టిస్తా
అధికారంలోకి వచ్చిన తర్వాత నీతోనే జెండాలు కట్టిస్తాను, నీతోనే జెండాలు తీయిస్తానంటూ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి హెచ్చరికలు జారీ చేశారు. అనంతపురం ఆర్డీవో వెంకటేశ్వర్లు, తాడిపత్రి మున్సిపల్ కమిషనర్, కొందరు పోలీసులు ఎమ్మెల్యేకు తొత్తుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కొత్త సంవత్సర వేడుకలకు తాడిపత్రి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో అడ్డుగా ఉన్న వైసీపీ జెండాలను తొలగించాలని చెప్పామన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. జెండా వ్యవహారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్లిందని ఆర్డీవో చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.  వసూళ్ల కోసమే ఆర్డీవో వెంకటేశ్వర్లు తాడిపత్రికి వచ్చారని, జెండాల సమస్యను పరిష్కరించేందుకు రాలేదన్నారు.  అనంతపురం ఆర్డీవో ఓ యూజ్ లెస్ ఫెలో అని మండిపడ్డారు. కొందరు పోలీసులు దిగజారారన్న జేసీ, ఎమ్మెల్యే కోసం ఏ పని చేయడానికైనా సిద్దంగా ఉన్నారని విమర్శించారు. పోలీసులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ...తాడిపత్రిలో కేసు నమోదైంది. జేసీ ప్రభాకర్ రెడ్డి పై 416/2023U/s341,188r/w 34 IPC సెక్షన్ల కింద కేసులు పెట్టారు. 

ఎమ్మెల్యే ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఏమన్నారంటే...
పెద్దారెడ్డి ఎమ్మెల్యే అయ్యాక తాడిపత్రిలో ఇసుకను దోచుకున్నారని, భూములు కబ్జా చేశారని,  భారీగా అవినీతికి పాల్పడ్డారని కొందరు కరపత్రాలుపంపిణీ చేశారు. దీనిపై స్పందించిన తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే ఫ్యాక్షన్ రాజకీయాలు మొదలు పెడతానంటూ ప్రత్యర్థులను హెచ్చరించారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పాత పెద్దారెడ్డి చూస్తారంటూ జెసీ కుటుంబానికి వార్నింగ్ ఇచ్చారు. అవినీతికి పాల్పడుతున్నట్లు కరపత్రాలు పంచుతున్నారని, భవిష్యత్ లో ఇలాంటివి చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. జేసీ కుటుంబం, వారి వెంట తిరిగే కొంత మంది వ్యక్తులే తమ టార్గెట్ అని, ఎన్నికలయ్యాక వారి కథ చెబుతామని పెద్దారెడ్డి వార్నింగ్ ఇచ్చారు.  ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తమ ప్రత్యర్థులను మాత్రం వదిలి పెట్టేది లేదన్న పెద్దారెడ్డి, రెండు మూడు నెలల్లోనే అసలు సినిమా చూపిస్తామన్నారు. అయితే సామాన్య ప్రజలు తమ లక్ష్యం కాదని స్పష్టం చేశారు. మరో మూడు నెలల్లో 1985 నుంచి 2004 వరకు ఎలా ఉన్నానో...దాన్ని మళ్లీ చూపిస్తానని హెచ్చరించారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Kurnool High Court Bench: కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
Breaking News:నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
Thalliki Vandanam Cybercrime: తల్లికి వందనం పథకంలో సైబర్ మోసం.. 28 మంది అకౌంట్లలో నగదు మాయం, ట్విస్ట్ ఏంటంటే
తల్లికి వందనం పథకంలో సైబర్ మోసం.. 28 మంది అకౌంట్లలో నగదు మాయం, ట్విస్ట్ ఏంటంటే

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Godavari River Overflow: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
The Hundred League Hug: భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
Pawan Kalyan onTiger Death: రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
Pawan Kalyan onTiger Death: రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
Revanth Reddy Criminal Waste Remarks: రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
PM Modi On CJP Protest: నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
Bhogapuram Airport Photos: 2203 ఎకరాలు.. 275 కి.మీ వేగంతో వీచే గాలులను తట్టుకునేలా నిర్మాణం.. భోగాపురం ఎయిర్‌పోర్ట్ విశేషాలివే
2203 ఎకరాలు.. 275 కి.మీ వేగంతో వీచే గాలులను తట్టుకునేలా నిర్మాణం.. భోగాపురం ఎయిర్‌పోర్ట్ విశేషాలు
Vijay Cinema Style Politics: తమిళనాడులో విజయ్ పొలిటికల్ గ్లామర్ - సీఎం స్థాయి పర్యటనలు, సినిమా స్టైల్ రీల్స్.. రాజకీయంగా లాభమా? నష్టమా?
తమిళనాడులో విజయ్ పొలిటికల్ గ్లామర్ - సీఎం స్థాయి పర్యటనలు, సినిమా స్టైల్ రీల్స్.. రాజకీయంగా లాభమా? నష్టమా?
CWG Javelin Glory: నీరజ్ చోప్రాకు సిల్వర్.. డెబ్యూట్ బాయ్ యష్ వీర్ సింగ్ కు బ్రాంజ్, రిజ‌ల్ట్స్ పై నీర‌జ్ స్పంద‌న ఇదే..!
నీరజ్ చోప్రాకు సిల్వర్.. డెబ్యూట్ బాయ్ యష్ వీర్ సింగ్ కు బ్రాంజ్, రిజ‌ల్ట్స్ పై నీర‌జ్ స్పంద‌న ఇదే..!
Embed widget