By: ABP Desam | Updated at : 26 Jan 2023 10:20 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
నారా లోకేశ్
Nara Lokesh Padayatra : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర శుక్రవారం కుప్పం నుంచి ప్రారంభం కానుంది. నారా లోకేశ్ ఇప్పటికే చిత్తూరు జిల్లా కుప్పం ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్‌కు చేరుకున్నారు. లోకేశ్ కు టీడీపీ శ్రేణులు స్వాగతం పలికాయి. కుప్పం ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో లోకేశ్ బస చేయనున్నారు. శుక్రవారం నుంచి లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రారంభంకానుంది. రేపు ఉదయం 10.15 గంటలకు వరదరాజుల ఆలయంలో లోకేశ్ ప్రత్యేక పూజలు చేసి, అనంతరం 4 వేల కిలోమీటర్ల పాదయాత్రను 11.03 గంటలకు ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు యువగళం సభ నిర్వహించనున్నారు. ఈ సభ అనంతరం కుప్పం ప్రభుత్వ ఆసుపత్రి, శెట్టిపల్లె క్రాస్, బెగ్గిలిపల్లె క్రాస్ మీదుగా రాత్రి బస ప్రాంతానికి లోకేశ్ చేరుకోనున్నారు. పాదయాత్రలో మొదటి రోజు 8.5 కిలోమీటర్ల దూరం లోకేశ్ నడవనున్నారు.
ఉదయం 11.03 పాదయాత్ర ప్రారంభం
కుప్పంలో లోకేశ్ యువగళం పాదయాత్రకు ఇప్పటికే ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. యువగళం బహిరంగ సభ ఏర్పాట్లను టీడీపీ సీనియర్ నేతలు రామానాయుడు, కళా వెంకట్రావు పర్యవేక్షిస్తున్నారు. బహిరంగ సభకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ, ఇతర నేతలు హాజరుకానున్నారు. యువగళం యాత్రకు సంఘీభావంగా కుప్పంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. రేపు ఉదయం 11.03 గంటలకు లోకేశ్ పాదయాత్ర ప్రారంభం కానుంది. పాదయాత్ర ప్రారంభం అనంతరం కుప్పంలో భారీ బహిరంగసభ నిర్వహిస్తున్నారు
యువగళం పాదయాత్ర షెడ్యూల్
27వ తేదీ- పాదయాత్ర మొదటిరోజు
28-1-23 (శనివారం) – 2వరోజు
29-1-2023 – 3వరోజు
ఏపీ ప్రెస్ అకాడమీ జర్నలిజం డిప్లొమా కోర్సు - అర్హతలు, దరఖాస్తు వివరాలు ఇలా!
Tirupati Crime : విద్యార్థినికి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్న లెక్చరర్, నిందితుడికి అంతకు ముందే పెళ్లి!
RGV On Jagan Governament : సీఎం జగన్ అసెంబ్లీని ఎప్పుడు రద్దు చేస్తారో చెప్పేసిన ఆర్జీవీ - కానీ చిన్న ట్విస్ట్ ఉందండోయ్ ..
Nellore Adala : టీడీపీకి అభ్యర్థులు లేకనే ఫిరాయింపులు - నెల్లూరు వైఎస్ఆర్‌సీపీ ఎంపీ లాజిక్ వేరే...
Tirupati News : ఏడో తరగతి విద్యార్థినితో ఆర్టీసీ డ్రైవర్ అసభ్య ప్రవర్తన, ఫొటోలు తీసి పైశాచిక ఆనందం
PBKS Vs KKR: కోల్‌కతాకు వర్షం దెబ్బ - డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో పంజాబ్ విక్టరీ!
BRSలో చేరిన మహారాష్ట్ర రైతు సంఘాల నేతలు, తన జీవితమంతా పోరాటాలేనన్న కేసీఆర్
LSG Vs DC: టాస్ గెలిచిన వార్నర్ భాయ్ - ఫీల్డింగ్‌కే ఓటు!
NTR30 Shoot Begins : అదిగో భయం - కొరటాల సెట్స్‌కు ఎన్టీఆర్ వచ్చేశాడు