అన్వేషించండి

Mobile Phones Recovery : మీ సెల్ ఫోన్ పోయిందా? డోంట్ వర్రీ ఇలా చేస్తే మళ్లీ దొరికేస్తుంది?

Mobile Phones Recovery : కర్నూలు జిల్లా పోలీసులు నిర్వహించిన రెండో విడత మొబైల్ రికవరీ మేళాకు భారీ స్పందన వచ్చింది. 1047 ఫోన్లను రికవరీ చేసిన పోలీసులు బాధితులకు అందించారు.

Mobile Phones Recovery : కర్నూలు జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఆధ్వర్యంలో...రెండో విడత మొబైల్ రికవరీ మేళా నిర్వహించారు. చోరీకి గురైన 546 సెల్ ఫోన్లను రికవరీ చేసిన పోలీసులు బాధితులకు అందజేశారు. గత కొంతకాలంగా మిస్సైన సెల్ ఫోన్లు, దొంగలు దోచుకెళ్లిన ఫోన్లు, ఇతర కారణాల ద్వారా పోగొట్టుకున్న మొబైల్స్ ను కర్నూలు జిల్లా పోలీసులు రికవరీ చేస్తు్న్నారు. డీజీపీ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మొబైల్ ట్రాకింగ్ వ్యవస్థ ద్వారా సెల్ ఫోన్ల రికవరీ చేపట్టారు. శనివారం కర్నూలు నగరంలో దాదాపు 1000 సెల్ ఫోన్ లను బాధితులకు అందించారు. ఇటీవల కాలంలో మొబైల్ ఫోన్ల మిస్సింగ్ ఎక్కువైంది. చోరీకి లేదా మిస్సైన సెల్ ఫోన్లను పోలీసులు మొబైల్ ట్రాకింగ్ వ్యవస్థ ద్వారా గుర్తించి రికవరీ చేస్తున్నారు.  

మొబైల్ ట్రాకింగ్ సర్వీస్ వెబ్ సైట్ 

మొబైల్ మిస్సింగ్  గురించి ప్రజలు  పోలీసు స్టేషన్ లకు వెళ్లడం అసౌకర్యంగా ఉందని ఫీడ్ బ్యాక్ రావడంతో సులభతరమైన పద్ధతిలో  మొబైల్ ట్రాకింగ్ సర్వీస్ వెబ్ సైట్  ను ఏర్పాటు చేశామని పోలీసులు తెలిపారు. రికవరీ చేసిన మొబైల్స్ ను పోలీసులు రికవరీ మేళా నిర్వహించి బాధితులకు అందజేస్తున్నారు. మొదటి విడతలో మొబైల్ రికవరీ మేళాకు భారీ స్పందన రావడంతో రెండో విడత నిర్వహించారు. గతంలో మిస్ అయినా మొబైల్ ఫోన్ల కోసం కర్నూల్ పోలీసులకు అనేక ఫిర్యాదులు రావడంతో పోలీసులు మొబైల్స్ ను రికవరీ చేసి తిరిగి బాధితులకు అందిస్తున్నారు. 

Mobile Phones Recovery : మీ సెల్ ఫోన్ పోయిందా? డోంట్ వర్రీ ఇలా చేస్తే మళ్లీ దొరికేస్తుంది?

మొబైల్ రికవరీ మేళాకు విశేష స్పందన 

కర్నూలు జిల్లా పోలీసులు చేపట్టిన మొబైల్ రికవరీ మేళాకు విశేష స్పందన లభించిందని, గతంలో కంటే ఈసారి అధిక సంఖ్యలో మొబైల్ ఫోన్లను రికవరీ చేశామని పోలీసులు తెలిపారు.  వివిధ రాష్ట్రాలతో పాటు వివిధ జిల్లాల ప్రజలు ఈ మొబైల్ రికవరీ మేళాకు రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. బస్సులో ప్రయాణిస్తున్న సందర్భంలో వివిధ ప్రాంతాలకు వెళ్తోన్న సమయంలో ఎక్కువగా మొబైల్స్ మిస్ అయినట్లు పోలీసులు గుర్తించారు. కర్నూలు పోలీసు  మొబైల్ ట్రాకింగ్ సర్వీస్ వెబ్ సైట్ కి వెళ్లి ఏదైనా కంప్యూటర్ ద్వారా లేదా మొబైల్ ఫోన్ ద్వారా లేదా మీ సేవా కేంద్రాలకు వెళ్లి మిస్సింగ్ మొబైల్ వివరాలు అందించవచ్చన్నారు. దానిపై వెంటనే సైబర్ ల్యాబ్ బృందం ట్రేస్ చేస్తూ బాధితులకు మొబైల్స్ అందజేస్తున్నామన్నారు. మొదటి విడతలో 600 పైగా ఫోన్లు రికవరీ చేశామన్నారు.  వాటి విలువ రూ. 1.2 కోట్ల విలువ ఉంటుందన్నారు. ఇవాళ రెండో విడతలో  సుమారుగా 1047 మొబైల్ ఫోన్లు రికవరీ చేశామన్నారు. వాటి విలువ 2.5 కోట్ల విలువ ఉంటుందన్నారు. 

Mobile Phones Recovery : మీ సెల్ ఫోన్ పోయిందా? డోంట్ వర్రీ ఇలా చేస్తే మళ్లీ దొరికేస్తుంది?

2 నెలల్లోనే  సెల్ ఫోన్లు రికవరీ  

ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి కూడా సెల్ ఫోన్ పోగొట్టుకున్న బాధితుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని పోలీసులు తెలిపారు.  కర్నూలు పోలీసు  మొబైల్ ట్రాకింగ్ సర్వీస్ కు మంచి  స్పందన కూడా  వస్తుందన్నారు. సెల్ ఫోన్లు పోగొట్టుకున్న, చోరి అయిన వాటి పరిష్కారంపై కర్నూలు జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. ఎలాంటి రుసుము చెల్లించకుండా ఉచితంగా కర్నూలు పోలీసు వెబ్ సైట్ కు  వెళ్లి పోగొట్టుకున్న సెల్ ఫోన్ వివరాలు అందజేస్తే సెల్ ఫోన్ రికవరీ చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఇటీవల కాలంలో ప్రపంచంలో మొబైల్ మన జీవితంలో ఒక భాగమైందని,  పర్సనల్ సమాచారం, జ్ఞాపకాలు, ఎన్నో మొబైల్ లో ఉంటాయని  సెల్ ఫోన్లు రికవరీ చేసి ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు.   

 మీ - సేవాలో అప్లై 

బాధితులు తమకు దగ్గర్లోని  మీ సేవా కేంద్రాలకు వెళ్లి మీరు మొబైల్ పోగొట్టుకున్న ప్రదేశం, తేదీ వివరాలు,  పోగొట్టుకున్న మొబైలు/సెల్ ఫోన్  IMEI వివరాలు,  మీరు పోగొట్టుకున్నప్పుడు ఉపయోగించిన  మొబైలు నెంబర్ వివరాలు, మీకు సంబంధించిన వ్యక్తిగత గుర్తింపు కార్డ్ , చిరునామా , పేరు వివరాలు, మిమ్మల్ని సంప్రదించడానికి ప్రస్తుతం ఉపయోగిస్తున్న మొబైలు నెంబర్,  ఇతర వివరాలు అందించారు.  ఈ వివరాలు మీరు మీ-సేవాలో సమర్పించి Missing /lost articles  రుసుం చెల్లించాలి. సదరు మీ-సేవా రసీదును తమ పరిధిలోని సంబంధిత పోలీస్ స్టేషన్ లో ఇవ్వాలి.  

 మొబైల్ ట్రాకింగ్ సిస్టమ్ 

kurnoolpolice.in/mobiletheft  ఈ లింకు ను క్లిక్ చేసి వివరాలను సమర్పించవచ్చు.  ఇచ్చిన  లింక్ ను క్లిక్ చేసి  మొబైల్  LOST కాలమ్ లో  మీ పేరు, జిల్లా , పోలీస్ స్టేషన్ పరిధి, మొబైలు కు సంబంధించిన IMEI-1, IMEI- 2 వివరాలు, ప్రస్తుతం ఉపయోగిస్తున్న మొబైలు నంబర్ /alternate కాంటాక్ట్ వివరాలు సబ్మిట్ చేయాలి. ఈ విధంగా ఫిర్యాదు చేస్తే పోలీసులు మీ మొబైల్ ను రికవరీ చేసి మీకు తిరిగి అందిస్తారని కర్నూలు జిల్లా ఎస్పీ ప్రజలకు సూచించారు. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Actor Brahmaji: మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత వార్నింగ్
మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత స్ట్రాంగ్ వార్నింగ్
CM Chandrababu: 'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
Deepthi Jeevanji: పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
Bigg Boss Telugu Season 8 Promo: ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ!  సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ! సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మూతపడే స్థితిలో వరంగల్ ఐటీ హబ్, కనీస సౌకర్యాలు లేక అస్యవ్యస్తంసునీతా విలియమ్స్ లేకుండానే తిరిగొచ్చిన బోయింగ్ స్టార్ లైనర్ధూల్‌పేట్‌ వినాయక విగ్రహాలకు ఫుల్ డిమాండ్, ఆ తయారీ అలాంటిది మరిఇలాంటి సమయంలో రాజకీయాలా? వైఎస్ జగన్‌పై ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Actor Brahmaji: మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత వార్నింగ్
మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత స్ట్రాంగ్ వార్నింగ్
CM Chandrababu: 'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
Deepthi Jeevanji: పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
Bigg Boss Telugu Season 8 Promo: ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ!  సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ! సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
Rains: అల్పపీడనం టూ తీవ్ర అల్పపీడనం - రాబోయే మూడు రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
అల్పపీడనం టూ తీవ్ర అల్పపీడనం - రాబోయే మూడు రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Bigg Boss Season 8: అంతా అనుకున్నదే జరిగిందా? ఈ వీక్ తట్టా బుట్టా సర్దుకుని బయటకొచ్చేసిన కంటెస్టెంట్ ఆవిడే!
అంతా అనుకున్నదే జరిగిందా? ఈ వీక్ తట్టా బుట్టా సర్దుకుని బయటకొచ్చేసిన కంటెస్టెంట్ ఆవిడే!
Asadudduin Owaisi: ఖమ్మం వరదల్లో 9 మందిని రక్షించిన హీరోను సన్మానించిన అసదుద్దీన్, నగదు నజరానా
ఖమ్మం వరదల్లో 9 మందిని రక్షించిన హీరోను సన్మానించిన అసదుద్దీన్, నగదు నజరానా
CM Chandrababu: సీఎం చంద్రబాబుకు రూ.కోటి చెక్కు అందించిన పవన్ - వరద పరిస్థితి, సహాయక చర్యలపై సీఎం టెలీ కాన్ఫరెన్స్
సీఎం చంద్రబాబుకు రూ.కోటి చెక్కు అందించిన పవన్ - వరద పరిస్థితి, సహాయక చర్యలపై సీఎం టెలీ కాన్ఫరెన్స్
Embed widget